ములుగు, న్యూస్‌లైన్: జిల్లా ప్రజానీకమంతా స్వాతంత్య్ర సంబరాల్లో ఉండగా ములుగు మండలం సింగన్నగూడెంలో మాత్రం విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలో సైతం యువకులు ఎంతో ఉత్సాహంగా జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ వైర్లు ఇద్దరిని బలిగొన్నాయి. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నారె నరేశ్(25), కంచనపల్లి మహేష్‌గౌడ్(26) కలిసి జెండా కోసం తయారుచేసిన ఇనుపపైపును లేపి గద్దెలోకి దింపే క్రమంలో వారి చేతుల్లోంచి జెండా పైపు జారి పక్కనేగల హైటెన్షన్ వైర్లపై పడింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురైన వారిరువురూ అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. చికిత్సకోసం వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా నరేశ్, మహేష్‌గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో సింగన్నగూడెంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుం బీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. గ్రామానికి చెందిన నారె యాదమ్మ, మల్లేష్ దంపతులకు నలుగురు కుమారులు. మొదటి కుమారుడు నరేశ్ రంగారెడ్డిజిల్లా తుర్కపల్లిలోని ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. మరో మృతు డు కంచనపల్లి మహేష్‌గౌడ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మహేష్‌గౌడ్ చిన్నగా ఉన్నప్పుడే తండ్రి రాజాగౌడ్ చనిపోగా తల్లి లక్ష్మి, భార్య రేఖ ఉన్నారు.
నేతల పరామర్శ
విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన నరేశ్, మహేష్ కుటుంబీకులను గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పరామర్శించారు. ఆర్థికసాయం కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.18 వేల చొప్పున అందజేశారు. అంతేకాకుండా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ.2,500 చొప్పున, టీఆర్‌ఎస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెట్టి సురేష్‌గౌడ్, కొత్తూరు సర్పంచ్ సులోచనలు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 వేల చొప్పున, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నరేంద్రనాథ్ రూ. 3 వేల చొప్పున, బీజేపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ నరేష్‌బాబు రూ.వెయ్యి చొప్పున మృతుల కుటుంబీకులకు అందజేశారు. వం టిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ సయ్యద్ సలీం, మండల, యువజన కాం గ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, శ్రీధర్‌రెడ్డి, నాయకులు స త్తయ్య, పెంటయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు గణేశ్ తదితరులున్నారు
మృత్యుపాశాలు
Published Fri, Aug 16 2013 1:01 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement
Advertisement