
సాక్షి, హైదరాబాద్: పర్యా వరణ హితాన్ని కోరుతూ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ, కర్బన ఉద్ఘారాలు తగ్గించాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా వలంటీర్‌కు స్థానం దక్కింది.
పర్యావరణ మార్పులపై 35 దేశాలకు చెందిన 150 మంది సభ్యుల బృందం చేపట్టిన అధ్యయనంలో భాగంగా గ్రీన్‌ఇండియా అంటార్కిటికాకు ప్రయాణించింది. ఫౌండేషన్–2041 నెలకొల్పి పర్యావరణం కాపాడాలనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్‌ను అక్కడ గ్రీన్ ఇండియా వాలంటీర్ కలిశారు. తమ ఉద్యమం తీరును వివరించారు. దీన్ని ప్రశంసించిన రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు. అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలంటీర్ అభిషేక్ శోభన్నను ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment