మువ్వన్నెల రుచులు | food flavors | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల రుచులు

Published Mon, Aug 10 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

మువ్వన్నెల రుచులు

మువ్వన్నెల రుచులు

ముచ్చటైన మువ్వన్నెల జెండా పండుగ...
ముచ్చటైన రాష్ట్రాలన్నీ ఒక్కటైన పండుగ...
భాషలు వేరైన కాని భావమొక్కటనే పండుగ...
పొరుగు రాష్ట్రాల సంస్కృతులను పంచుకునే పండుగ...
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే పండుగ...
అందరి రుచులను చవి చూసే పండుగ...
ఇది దేశపండుగ...
దేశభక్తితో పాటు మువ్వన్నెల రుచులను కూడా పంచుకుందాం...
 

గుజరాతీ మ్యాంగో సలాడ్‌తో ఆమ్ శ్రీఖండ్
కావలసినవి: గట్టి పెరుగు - 2 కప్పులు (పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి, నీరంతా పోయిన తరవాత వాడాలి); కుంకుమ పువ్వు - అర టీ స్పూను; కండెన్స్‌డ్ మిల్క్ - 2 టిన్నులు; తాజా మామిడిపండ్లు - 300 గ్రా.; తాజా క్రీమ్ - పావు కప్పు; నిమ్మరసం - టేబుల్ స్పూను; పుదీనా ఆకులు - గుప్పెడు; చాట్ మసాలా - 2 టీ స్పూన్లు; గోల్డ్ వార్క్ - 4 షీట్లు; పిస్తా తరుగు - 80 గ్రా.
 
తయారీ  ఒక పాత్రలో గట్టి పెరుగు, కుంకుమ పువ్వు, కండెన్స్‌డ్ మిల్క్, మామిడి పండు తరుగు, పంచదార, ఏలకుల పొడి, తాజా క్రీమ్ వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో చిల్లర్‌లో ఉంచాలి  ఒక బౌల్‌లో మామిడిపండు ముక్కలు, నిమ్మరసం, పుదీనా ఆకులు, చాట్ మసాలా వేసి కలపాలి శ్రీఖండ్‌తో సర్వ్ చేయాలి.
 
 కాశ్మీరీ పులావ్

 కావలసినవి: బాస్మతి బియ్యం - కప్పు; బటర్ - టీ స్పూను; షాజీరా - టీ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; లవంగాలు - 1; బిరియానీ ఆకు - 1; ఏలకులు - 1; ఫ్యాట్ తక్కువ ఉన్న పాలు - కప్పు; నీళ్లు - కప్పు; కుంకుమ పువ్వు - కొద్దిగా; ఉప్పు - తగినంత; పంచదార - టీస్పూను; క్యారట్, బీన్స్ ముక్కలు - కప్పు; తాజా బఠాణీ - పావు కప్పు; జీలకర్ర పొడి - అర టీ స్పూన్; ఏలకుల పొడి - పావు టీ స్పూను; వాల్నట్స్ - పావు కప్పు; బాదం తరుగు - పావు కప్పు; జీడిపప్పు పలుకులు - పావు కప్పు; కిస్‌మిస్ - పావు కప్పు; ఆపిల్ ముక్కలు - అర కప్పు; పైనాపిల్ ముక్కలు - అర కప్పు; బటర్ - 2 టీ స్పూన్లు; షాజీరా - అర టీ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; ఏలకులు - 1; లవంగాలు - 2; అల్లం ముక్క - చిన్నది

తయారీ: టేబుల్ స్పూను పాలలో కుంకుమ పువ్వును నానబెట్టాలి  బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాక నీళ్లు ఒంపేయాలి  బాణలిలో బటర్ వేసి కరిగాక, షాజీరా వేసి వేయించాలి  దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, బిరియానీ ఆకు వేసి వేయించాక, బాస్మతి బియ్యం జత చేసి, రెండు మూడు నిమిషాలు దోరగా వేయించాలి  కప్పు నీళ్లు, పంచదార, కప్పు పాలు జత చేయాలి  తగినంత ఉప్పు జత చేసి మూత ఉంచి ఉడికించాలి  ఉడుకుతుండగా కుంకుమ పువ్వు పాలు కూడా జత చేయాలి మెత్తగా ఉడికిన తర్వాత దించేయాలి  క్యారట్, బీన్స్, బఠాణీలను హాఫ్ బాయిల్ చేయాలి  టేబుల్ స్పూను బటర్‌ను వేసి చేసి, అందులో కిస్‌మిస్ వేసి అవి పొంగేలా వేయించి తీసేయాలి  పిస్తాలు, జీడిపప్పులు, బాదం పలుకులు (కొద్దిసేపు నీళ్లలో నానబెట్టి, తొక్క తీసి చిన్నచిన్న ముక్కలు చేయాలి) వేసి వేయించాలి  బాణలిలో బటర్ వేసి కరిగాక జీలకర్ర వేసి వేయించాలి  ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, బిరాయనీ ఆకు వేసి వేయించాలి  అల్లం తురుము వేసి రెండు నిమిషాలు వేయించాక స్టౌ మీద నుంచి దించేయాలి  ఉడికించిన కూరగాయముక్కలు, పండ్ల ముక్కలు జత చేయాలి  ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపి తాజా క్రీమ్, రోజా పువ్వు రేకలతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
 
తెలుగింటి పెసరట్టు
కావలసినవి: పెసలు - పావు కేజీ (పొట్టుతో ఉండాలి); బియ్యం - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; అల్లం తురుము - టేబుల్ స్పూను; పచ్చి మిర్చి - 10; ఉల్లి తరుగు - 2 కప్పులు; జీలకర్ర - టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము - కప్పు; క్యారట్ తురుము - కప్పు; కొత్తిమీర తరుగు - అర కప్పు; నూనె - తగినంత

తయారీ: బియ్యం, పెసలను విడివిడిగా ముందు రోజు రాత్రి నానబెట్టాలి  మరుసటి రోజు ఉదయం బియ్యం విడిగా, పెసలు విడిగా మిక్సీ పట్టాలి  పెసలు మిక్సీ పడుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ తరుగు, ఆరు పచ్చిమిర్చి, అల్లం తురుము, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టి, బియ్యప్పిండి కూడా జత చేయాలి  సుమారు అరగంట సేపు నాననివ్వాలి  స్టౌ మీద పెనం ఉంచి, గరిటెడు పెసర పిండి తీసుకుని పెనం మీద అట్టు వేయాలి క్యారట్ తురుము, ఉల్లితరుగు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర... అన్నిటినీ కొద్దికొద్దిగా అట్టు మీద వేసి కాల్చాలి  బాగా కాలిన తర్వాత తీసేయాలి  వేడి వేడి పెసరట్టు రెడీ అల్లం పచ్చడి, కొబ్బరిపచ్చడి కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి.
 
బిహారీ లిట్ట్టీ ఛోకా
కావలసినవి: గోధుమపిండి - 400 గ్రా. ; వాము - అర టీ స్పూను ; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; పెరుగు - ముప్పావు కప్పు ; బేకింగ్ సోడా - అర టీ స్పూను; ఉప్పు - ముప్పావు టీ స్పూను; స్టఫింగ్ కోసం... సత్తు - 200 గ్రా. (రకరకాల పప్పు ధాన్యాలను పిండిగా చేసినది. బిహార్‌లో ఈ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో ఈ పిండి రెడీగా దొరుకుతుంది); అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 4; కొత్తిమీర తరుగు - అర కప్పు; జీలకర్ర - టీ స్పూను ; వాము - అర టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; పికిల్ స్పైసెస్ - టేబుల్ స్పూను; నిమ్మరసం - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; ఛోకా కోసం... వంకాయలు - 400 గ్రా.; టొమాటోలు - 250 గ్రా.; పచ్చి మిర్చి - 4; అల్లం తురుము - టీ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు; ఉప్పు - తగినంత; ఆవ నూనె - 2 టీ స్పూన్లు

తయారీ: జల్లెడ పట్టిన గోధుమపిండికి నెయ్యి, బేకింగ్ సోడా, వాము, ఉప్పు జత చేసి బాగా కలపాలి  పెరుగును చక్కగా చిలకరించి పిండికి జత చే సి పిండి మృదువుగా అయ్యేవరకు బాగా కలపాలి  చల్లటి నీరు కావలసినంత వేస్తూ పిండి క లిపి, పైన మూత ఉంచి సుమారు అర గంట సేపు నాననివ్వాలి. స్టఫింగ్ తయారీ... ఒక పాత్రలో సత్తు పిండి, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర, వాము, ఆవ నూనె, పికిల్ స్పైసెస్ వేసి బాగా కలపాలి. (ఈ పదార్థం గట్టిగా ఉందనిపిస్తే, ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నీరు జతచేయాలి). పిట్టీ సిద్ధమయినట్లే.
 
లిట్టీ తయారీ... పిండిని ఉండలుగా చేయాలి. ఒక ఉండను చేతిలోకి, మూడు అంగుళాల వెడల్పు వచ్చేవరకు వేళ్లతో ఒత్తాలి  అందులో ఒకటిన్నర స్పూన్ల పిట్టి మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, అంతా సమానంగా ఉండేలా చేతితో సరిచేయాలి. వేయించడానికి లిట్టీ సిద్ధమైనట్లే  తయారు చేసుకున్న లిట్టీలను తందూరీ విధానంలో కాల్చుకోవాలి. లేదంటే స్టౌ మీద పెనం ఉంచి దాని మీద పచ్చి వాసన పోయే వరకు నూనె లేకుండా కాల్చాలి  వంకాయలు, టొమాటోలను శుభ్రంగా కడగాలి  బాణలిలో నూనె వేసి కాగాక, వంకాయలు, టొమాటోలను వేసి వేయించి, తీసేయాలి  చల్లారినతర్వాత వాటి మీద తొక్క తీసి మెత్తగా మెదపాలి  పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, ఆవనూనె వేసి బాగా కలపాలి. చోకాలు సిద్ధమయినట్లే  ఛోకాను ఒక పాత్రలో ఉంచాలి  వేడివేడి లిట్టీలను మధ్యలో కొద్దిగా రంధ్రం చేసి కరిగించిన నేతిలో వేసి తీసేయాలి. చోకా, కొత్తిమీర పచ్చడులతో సర్వ్ చేయాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement