
సాక్షి, బనశంకరి: కన్నడ భాషను తక్కువ చేసిన గూగుల్ ఉదంతం మరువకముందే ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ కూడా కన్నడను అవమానించింది. పసుపు– ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన లోదుస్తుల్ని అమెజాన్ వెబ్‌సైట్, యాప్‌లో విక్రయిస్తున్నారు. పైగా ఆ దుస్తుల మీద జాతీయ జెండాపై ఉండే అశోక చక్రాన్ని సైతం ముద్రించి పైత్యం చాటుకున్నారు. ఇది కన్నడిగులను అమెజాన్ కంపెనీ అవమానించడమేనని పలు కన్నడ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అమెజాన్ తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సోషల్‌మీడియాలోనూ నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment