
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు

ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు

ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు

2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం
















