Tamizhaga Vetri Kazhagam
-
నటుడు విజయ్ ‘పొలిటికల్ పార్టీ’ జెండా ఆవిష్కరణ (ఫొటోలు)
-
టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.#WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag and symbol today.(Source: ANI/TVK) pic.twitter.com/J2nk2aRmsR— ANI (@ANI) August 22, 2024 #WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay takes pledge along with party workers and leaders at the party office in Chennai "We will always appreciate the fighters who fought and sacrificed their life for the liberation of our country… pic.twitter.com/amiti3rBC2— ANI (@ANI) August 22, 2024 -
Actor Vijay: విజయ్ పార్టీ కోసం పని చేస్తారా?
చెన్నై: స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశంపై విజయ్ ప్రశాంత్ కిషోర్‌తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్‌కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్ నాతో టచ్‌లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు. ఇక.. ఇదే ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై స్పందించిన పీకే.. అక్కడి రాజకీయాల్లో విజయ్ ప్రభావంపైనా మాట్లాడారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తేలికగా తీసుకోవద్దని ఇతర పార్టీలకు సూచించారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు 60 నుంచి 65 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. -
'ఒకవేళ మీరు సీఎం అయితే'.. దళపతి సమాధానం ఇదే!
అందరూ ఊహించినట్టే జరిగింది. ఇన్ని రోజులు ఆయన రాజకీయ అరంగేట్రం కోసం కళ్లు కాసేలా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. గతంలో చాలాసార్లు దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాజకీయ ఎంట్రీపై ప్రకటన రిలీజ్ చేశారు. తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇన్ని రోజులుగా ఎదురు చూసిన స్టార్ హీరో అభిమానులు ఇప్పుడు కాస్తా రిలాక్స్ అయ్యారు. ఎట్టకేలకు తమ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పార్టీ పేరు ప్రకటనతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దళపతి విజయ్. ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ నిజం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన నటించిన సినిమాలో చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: దళపతి విజయ్ అభిమానుల గుండె పగిలే వార్త..) కాగా.. 2018లో విజయ్ నటించిన చిత్రం సర్కార్. ఆ సినిమాలో ఓటు రిగ్గింగ్ గురించి దళపతి ప్రస్తావించారు. తన ప్రమేయం లేకుండా పోలైన ఓటును న్యాయపోరాటం ద్వారా సాధించుకునే ఎన్ఆర్ఐ పాత్రలో ఆయన కనిపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందడంతో.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఛాన్స్ వస్తుంది. అయితే ఆ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన ఓ యాంకర్ విజయ్ను ఆసక్తికర ప్రశ్న అడిగింది. ఒకవేళ మీరు నిజజీవితంలో సీఎం అయితే ఏం చేస్తారని ప్రశ్నించారు. దీనికి విజయ్ బదులిస్తూ..'నేను కనుక ముఖ్యమంత్రిని అయితే.. సినిమాల్లో ఎప్పటికీ నటించను' అని క్లారిటీ ఇచ్చారు. తనకు తెలిసి చాలామంది రాజకీయ నేతలు పదవుల్లో ఉండి నటించినవారే తప్ప.. ప్రజల కోసం పనిచేసిన వారు లేరని ఆయన అన్నారు. తాజాగా పార్టీ ప్రకటనతో విజయ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2026 లక్ష్యంగా పార్టీ స్థాపించినట్లు విజయ్ వెల్లడించారు. -
దళపతి విజయ్ అభిమానుల గుండె పగిలే వార్త..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాడులోనే కాదు తెలుగులోనూ అభిమానులున్నారు. రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం కోసం ఎప్పటినుంచో పావులు కదుపుతూ వస్తున్నాడు. ఎట్టకేలకు శుక్రవారం(ఫిబ్రవరి 2న) తను పాలిటిక్స్‌లో అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు. తమిళగ వెట్రి కళగం అనే కొత్త పార్టీని స్థాపించాడు. ప్రజల సేవే లక్ష్యంగా పని చేస్తానని, పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతానని వెల్లడించాడు. ప్రజల సేవలో నిమగ్నం కానున్న హీరో ఇక్కడే అభిమానుల గుండె పగిలే వార్త కూడా చెప్పాడు. ఇక మీదట సినిమాలు చేయబోనన్నాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత సినిమాలకు శాశ్వత విరామం ప్రకటించనున్నట్లు తెలిపాడు. సినిమాలు మానేసి పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తానంటున్నాడు. విజయ్ ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)' అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షిచౌదరి హీరోయిన్గా నటిస్తోంది. అదే చివరి సినిమా ఇందులో స్నేహ, లైలా, మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీని తర్వాత కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో 69వ సినిమా చేయనున్నాడు. ఇక ఇదే చివరి చిత్రం కానుందా? అని అభిమానులు చర్చ మొదలుపెట్టారు. ఈ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించడంటేనే మనసు చివుక్కుమంటుందంటున్నారు ఫ్యాన్స్. #தமிழகவெற்றிகழகம் #TVKVijay https://t.co/Szf7Kdnyvr — Vijay (@actorvijay) February 2, 2024 చదవండి: టార్గెట్ ఫిక్స్.. రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్ పూనం పాండే: చనిపోయేంత వరకు విమర్శలు, వివాదాలే! -
Vijay Political Party: రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్
తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ప్రకటించాడు. 'తమిళగ వెట్రి కళగం'Tamizhaga Vetri Kazhagam పేరుతో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరును రిజస్టర్ చేసినట్లు ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఎక్కువగా ప్రజల్లోనే కనిపించడమే కాకుండా పలు సేవా కార్యక్రామాల్లో పాల్గొంటు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ ప్రకటన అయితే వచ్చేసింది కానీ అందుకు సంబంధించిన గుర్తును త్వరలో ప్రకటించనున్నారు. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామాని విజయ్ నుంచి ఒక నోట్ వెలువడింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని దానిని నిర్మూలించడమే తన ధ్యేయం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు. హీరో విజయ్ తన రాజకీయ రంగప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్‌తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన విజయ్ మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆపై అనేక రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ ఏర్పాటు చేశారు. గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలతో పాటు కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు. నెలరోజుల క్రితం తమిళనాడులో తుపాను దెబ్బకు వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారందరికి తనవంతుగా సాయం అందించి వారికి అండగా నిలిచాడు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది చేరనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Vijay (@actorvijay)