కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాడులోనే కాదు తెలుగులోనూ అభిమానులున్నారు. రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం కోసం ఎప్పటినుంచో పావులు కదుపుతూ వస్తున్నాడు. ఎట్టకేలకు శుక్రవారం(ఫిబ్రవరి 2న) తను పాలిటిక్స్‌లో అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు. తమిళగ వెట్రి కళగం అనే కొత్త పార్టీని స్థాపించాడు. ప్రజల సేవే లక్ష్యంగా పని చేస్తానని, పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతానని వెల్లడించాడు.
ప్రజల సేవలో నిమగ్నం కానున్న హీరో
ఇక్కడే అభిమానుల గుండె పగిలే వార్త కూడా చెప్పాడు. ఇక మీదట సినిమాలు చేయబోనన్నాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత సినిమాలకు శాశ్వత విరామం ప్రకటించనున్నట్లు తెలిపాడు. సినిమాలు మానేసి పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తానంటున్నాడు. విజయ్ ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)' అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షిచౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
అదే చివరి సినిమా
ఇందులో స్నేహ, లైలా, మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీని తర్వాత కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో 69వ సినిమా చేయనున్నాడు. ఇక ఇదే చివరి చిత్రం కానుందా? అని అభిమానులు చర్చ మొదలుపెట్టారు. ఈ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించడంటేనే మనసు చివుక్కుమంటుందంటున్నారు ఫ్యాన్స్.
#தமிழகவெற்றிகழகம் #TVKVijay https://t.co/Szf7Kdnyvr
— Vijay (@actorvijay) February 2, 2024
చదవండి: టార్గెట్ ఫిక్స్.. రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్
పూనం పాండే: చనిపోయేంత వరకు విమర్శలు, వివాదాలే!
Comments
Please login to add a commentAdd a comment