కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో తయారైన త్రివర్ణ పతాకాలను 16 రాష్ట్రాల్లో ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 14 రాష్ట్రాలకు అందించేందుకు త్రివర్ణ పతాకాలను తయారు చేసేవారు. ఇప్పుడు కేరళ, కర్నాటక రాష్ట్రాలకు అందించేందుకు కూడా ఇక్కడే జాతీయ జెండాలను తయారుస్తున్నారు. గ్వాలియర్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎనిమిది వేల త్రివర్ణ పతాకాలను పంపించారు.
తాజాగా మరో రెండు వేల త్రివర్ణ పతాకాలకు ఆర్డర్లు అందాయి. ఈ సందర్భంగా కేంద్ర భారత ఖాదీ యూనియన్ కార్యదర్శి రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం అనే ప్రభుత్వ నినాదం చురుగ్గా సాగుతున్నదన్నారు. గ్వాలియర్‌కు చెందిన 196 మందితో కూడిన బృందం త్రివర్ణ పతాకాలను రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment