అయోధ్య: రామ మందిరం ముందు ఘర్షణ చోటు చేసుకుంది. గుడి బయట కొంత మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ జెండాను చించి వేశారు. జెండాను చించి వేసిన వ్యక్తులకు, కాంగ్రెస్ నేతల మధ్య గొడవ పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ నెల 22న జరిగే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జాతీయ పార్టీ సీనియర్ నేతలు కొందరు మాత్రం మకర సంక్రాంతి పర్వదినాన సోమవారం అయోధ్య రామ మందిరానికి వెళ్లారు.
వీరు అక్కడికి చేరుకోక ముందే గొడవ జరిగింది. కాంగ్రెస్ జెండాను కొంత మంది ధ్వంసం చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మతం పేరుచెప్పి చెత్త రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ మండిపడ్డారు.
#WATCH | Few people seen vandalising Congress flag outside Ayodhya Ram temple
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024
A Congress delegation comprising Ajay Rai and Deepender Hooda is on Ayodhya visit today pic.twitter.com/fTSOSUurpI
Comments
Please login to add a commentAdd a comment