Riot Police Out In Jamshedpur After Clash Over Ram Navami Flag Desecration - Sakshi
Sakshi News home page

Flag Desecration: జంషెడ్‌పూర్‌లో ఘర్షణ..రంగంలోకి ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌

Published Mon, Apr 10 2023 10:59 AM | Last Updated on Mon, Apr 10 2023 11:25 AM

Riot Police Out In Jamshedpur After Clash Over Ram Navami Flag Desecration - Sakshi

జార్ఘండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. శనివారం శ్రీరామ నవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఇరు గ్రూప్‌లు ఘర్షణకు దిగాయి. నిందితులను పట్టుకోవాని డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేపట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్లు అదికారులు తెలిపారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు శాస్త్రి నగర్‌లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. గుమిగూడి ఉన్నవారిని అక్కడ నుంచి పంపించి.. ఆ ప్రాంతం మొత్తం ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది మోహరించారు. ఈ మేరకు సింగ్‌భూమ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. అల్లర్లుకు సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కొందరూ సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పౌరులు అప్రమత్తమై సహకరించాలని విజయ్‌ అన్నారు. అలాగే శాంతి భ్రదతల రక్షణ కోసం తగినంత పోలీసు బలగాలు, క్విక్‌ రెస్పాన్స్‌ టీం, ఒక మేజిస్ట్రేట్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు సిబ్బందిని నియమించామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పుకార్లను నమ్మవద్దదని ఎమ్మెల్యే జాదవ్‌ ప్రజలను కోరారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా సందేశాలు వస్తే పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. 

(చదవండి: కోవిడ్‌ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌.. అప్రమత్తంగా ఉండాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement