
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.