Kamal
-
బర్త్‌డే రోజు కళ్లముందే ఘోరం.. నా కుటుంబమంతా నిర్జీవంగా..
కళ్ల ముందు కుటుంబాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దారుణం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అలాంటి విషాద, భయానక సంఘటన జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత కమల్ సదనాహ్. పీడకలలాంటి రోజును గుర్తు చేసుకుంటూ.. 'అది నా జీవితంలోనే చీకటి రోజు. మా నాన్న(దర్శకనిర్మాత బ్రిజ్ సదనాహ్) అందరినీ తుపాకీతో కాల్చేశాడు. నన్ను కూడా షూట్ చేశాడు. కానీ అది నా మెడ నరంలో నుంచి చొచ్చుకుని వెళ్లి బయటకు వచ్చింది. తర్వాత ఆయన కూడా తనను తాను షూట్ చేసుకున్నాడు. కళ్లముందే ఘోరం.. తీవ్రంగా గాయపడ్డ అమ్మ (నటి సయూదా ఖాన్), సోదరిని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ బెడ్స్ లేకపోవడంతో నన్ను మరో ఆస్పత్రిలో చేర్చారు. వాళ్లిద్దరినీ బతికించమని వైద్యులను వేడుకున్నాను. అలాగే నాన్న ఎలా ఉన్నాడని ఆరా తీశాను.. కానీ ఏ సమాధానమూ రాలేదు. నాకు రక్తస్రావం ఎక్కువ అవుతుండటంతో సర్జరీ చేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాను.. అక్కడ నా కుటుంబమంతా శవాలుగా కిందపడి ఉన్నారు. నా కళ్లముందే ఆ ఘోరాన్ని చూడాల్సి వచ్చింది. అందరూ మరణించినా నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాను. అందుకే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోను ఈ సంఘటన జరిగినంతమాత్రాన మా నాన్న, ఇంట్లోవాళ్లంతా చెడ్డవారని అర్థం కాదు. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటాను. ఇది నా బర్త్‌డే రోజే జరగడం వల్ల ఎన్నోయేళ్లపాటు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పటికీ ఆ సెలబ్రేషన్స్ నాకు నచ్చవు' అని చెప్పుకొచ్చాడు. ఈ విషాద ఘటన జరిగిన రెండేళ్లకు కమల్.. బేఖుడి(1992) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రంగ్, ఫాజ్, రాక్ డ్యాన్సర్, హమ్ సాబ్ చోర్ హై, మొహబ్బత్ ఔర్ జంగ్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. 2007 తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉన్న అతడు దాదాపు 15 ఏళ్ల తర్వాత సలాం వెంకీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. గతేడాది పిప్పా మూవీలో నటించాడు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు.. -
పతాకధారిగా శరత్ కమల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. -
కాజోల్‌తో మొదటి సినిమా.. కానీ ఆ హీరో జీవితంలో అంతులేని విషాదం!
కమల్ సదానా ఈ పేరు చాలామందికి తెలియదు. కమల్ తన నటన జీవితాన్ని స్టార్ హీరోయిన్ కాజోల్‌తో కలిసి ప్రారంభించాడు. బెఖుడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారానే కాజోల్ కూడా అరంగేట్రం చేసింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో కమల్‌కు బాలీవుడ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ అనుకోకుండా జరిగిన విషాదం అతన్ని మానసికంగా దెబ్బతీసింది. ఊహించని పరిణామాలతో ఒక్కసారిగా తన కెరీర్ ముగిసినంత పనైంది. ఇంతకీ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఏమిటా విషాదం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!) బర్త్ డే రోజే విషాదం తఖ్దీర్, ఏక్ సే బద్కర్ ఏక్, యాకీన్ వంటి చిత్రాలు నిర్మించిన దర్శకుడు బ్రిజ్ సదానాకు కమల్ జన్మించారు. బ్రిజ్ 1960- 70లో బాలీవుడ్లో విజయవంతమైన డైరెక్టర్‌గా పేరు సంపాదించారు. 1980ల మధ్య నాటికి ఆయన సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఆ తర్వాత 1990లో కమల్ 20వ పుట్టినరోజున బ్రిజ్, అతని భార్య సయీదా ఖాన్ మధ్య గొడవ జరిగింది. బర్త్ డే వేడుకకు ఏర్పాట్లు చేసుండగానే కమల్ సదానాకు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దీంత వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా.. తన తండ్రి ఆవేశంతో తల్లి, సోదరినీ చంపి.. తాను కూడా పిస్టల్‌తో కాల్చుకున్నాడు. ఆ సమయంలో కమల్ బర్త్‌డే పార్టికీ వచ్చిన స్నేహితులు వారందరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తీవ్ర విషాదంతో కమల్ సదానా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. అయితే ఆ సమయంలో బ్రిజ్ మద్యం తాగినట్లు శవపరీక్షలో వెల్లడైంది. కమల్ సదానా సినిమా కెరీర్ కమల్ 2000లో విడుదలైన కాళీ టోపీ లాల్ రుమాల్ తర్వాత సినిమాలకు విరామం తీసుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత 2005లో తన దర్శకత్వం వహించిన కర్కాష్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా టీవీ షో కసమ్‌లో సహాయక పాత్రను కూడా పోషించాడు. 2007లో తన తండ్రి నిర్మించిన చిత్రానికి రీమేక్‌గా విక్టోరియా నంబర్ 203ని తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా బాగా ఆడలేదు. నోరా ఫతేహి బాలీవుడ్ అరంగేట్రం చేసిన రోర్ చిత్రానికి కూడా కమల్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత 2022లో విడుదలైన సలామ్ వెంకీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా 30 ఏళ్లకు మళ్లీ కాజోల్త కలిసి తెరపై కనిపించారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించారు. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజోల్‌తో మొదటి సినిమా చేసిన కమల్.. ఆ తర్వాత కెరీర్లో ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చూస్తే అభినందించాల్సిందే. (ఇది చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) -
జిలేబి సినిమా రివ్యూ
స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేశాడు. జిలేబి అంటూ నేడు తండ్రీకొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.. కథ జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కాలేజ్ చదువుకునే కుర్రాళ్లు హాస్టల్లో ఉంటారు. ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ. కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో ఎలా పరిచయం ఏర్పడింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీరిద్దరి మధ్యలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేస్తాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి నటనకు వంక పెట్టే అవకాశమే ఉండదు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారంతా కూడా ఆకట్టుకున్నారు. విశ్లేషణ విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తనదైన స్టైల్లో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపిస్తాయి. బాయ్స్ హాస్టల్లోకి హీరోయిన్ వచ్చిన దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రథమార్దంలో పాత్రల పరిచయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలో చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు. చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ.. బాగున్నాయి కానీ సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను ఎక్కువ సాగదీయడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్‌పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. చదవండి: Bigg Boss 7 Nagarjuna Remuneration: బిగ్‌బాస్ కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
ఫన్... థ్రిల్
‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిలేబి’. అంజు అశ్రాని సమర్పణలో పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ నిర్మించారు. విజయభాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ కథానాయికగా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘‘ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. మణిశర్మ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. -
సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2023–24 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి, డిప్యుటీ చైర్‌పర్సన్‌గా ఆర్ నందిని ఎన్నికయ్యారు. 2022–23కి గాను సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా వ్యవహరిస్తున్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఉన్న కమల్ బాలికి సీఐఐతో చిరకాల అనుబంధం ఉంది. 2022–23కి గాను ఆయన సీఐఐ సదరన్ రీజియన్ డిప్యుటీ చైర్మన్‌గా ఉన్నారు. పరిశ్రమలోని పలు సంస్థలు, ఇన్వెస్ట్ కర్ణాటక ఫోరం మొదలైన వాటిలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అటు నందిని .. చంద్ర టెక్స్టైల్స్ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె సీఐఐ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సీఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్లో సభ్యురాలిగా, సీఐఐ నేషనల్ కౌన్సిల్ టాస్క్ ఫోర్స్ (గ్రామీణాభివృద్ధి, వలస కార్మికులు)కు కో–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలాగే పలు సంస్థల్లో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ (సీఐఈఎస్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సీఐఐ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం, ప్రతీక్షా ట్రస్ట్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్‌ఫాం .. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలదని తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఐఐ సీఐఈఎస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
మాస్ మహారాజ రవితేజ ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా?
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంశక్తితో ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. తాజాగా రవితేజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నటుడు కమల్. 'సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో నేను హీరోగా మారా. అప్పటికి రవితేజ ఇంకా హీరో అవలేదు. ఇప్పుడెంత ఎనర్జీగా ఉండేవాడో అప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉండేవాడు. కాకపోతే కొద్దిగా లావుగా ఉండేవాడు. కానీ రవితేజ ఎంతో కష్టపడి తనను తాను మలుచుకుని ఇప్పుడున్న యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. 365 రోజులూ ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు. ఈ మధ్యే ఆయన్ని కలిశాను. హైదరాబాద్‌లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలనుకుని వచ్చాను. ఆ తర్వాత వచ్చిందంతా బోనస్ అని నాతో చెప్పాడు. అలాంటి రవితేజ ఈరోజు రూ.12 కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నాడు' అని చెప్పాడు. కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో హీరోయిన్ను ఏడిపించే చిన్న సీన్లో రవితేజ నటించాడు. ఈ రోజు మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు అంటూ తన స్నేహితుడిపై ప్రశంసలు కురిపించాడు కమల్. చదవండి: వసూళ్ల వర్షం కురిపిస్తున్న పఠాన్ జమున చాలా పొగరుబోతు, ఇంట్లోకి కూడా రానివ్వదు -
నాలుగు జంటల ప్రేమకథ
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ రిలీజ్ చేశారు. ‘‘నరసింహ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు తీసి ఉంటే ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరేవారు’’ అన్నారు తమ్మారెడ్డి. ‘‘మధ్య తరగతి జీవితాల్లో జరిగే నాలుగు ప్రేమ జంటల కథలతో ఈ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘చిత్తూరు, తిరుపతి ్ర΄ాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య. -
మొన్నటి వరకు బంట్రోతు.. ఇప్పుడేమో ఆచార్య
వేర్ దేర్ ఈజ్ ఏ విల్.. దేర్ ఈజ్ ఏ వే.. అని ఊరికనే అనలేదు. ఏదైనా సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే.. అందుకు ఏదో ఒక మార్గం కచ్చితంగా ఉంటుంది. బహుశా కమల్ కిషోర్ మండల్ సార్‌లాంటి వాళ్లను ఉద్దేశించే అది పుట్టుకొచ్చిందేమో. మొన్నటి వరకు ఏ యూనివర్సిటీలో.. ఏ విభాగంలో బంట్రోతుగా పని చేశారో.. అదే యూనివర్సిటీలో.. పైగా అదే డిపార్ట్మెంట్లో ఆయనిప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డ్యూటీకెక్కారు మరి!.. కమల్ సార్ ప్రయాణం గురించి తెలుసుకుంటే.. అందులో ఏ ఒక్కటీ ఆయనకు అనుకూలంగా అనిపించదు. పేదరికం, సరైన వసతులు కూడా లేని ఇల్లు, తల్లి అనారోగ్యం కోసం ఖర్చు.. ఇంటి నిండా పుట్టెడు కష్టాలే. అయినా సరే విజయం సాధించాలనే పట్టుదలతో అద్భుతమైన సంకల్ప శక్తిని ప్రదర్శించారు. అందుకేనేమో ఇరుకుగల్లీలో రంగులు వెలిసిపోయిన ఆయన రెండు గదుల ఇంటికి అభినందల కోసం ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. కమల్ కిశోర్ మండల్(42) .. ఉండేది బీహార్ భగల్పూర్ ముండీచాక్ ప్రాంతం. చాలా పేద కుటుంబం ఆయనది. కమల్ తండ్రి గోపాల్ రోడ్డు పక్కన టీ అమ్ముతుంటారు(ఇప్పటికీ). డిగ్రీ వరకు ఎలాగోలా స్కాలర్షిప్ మీద నెట్టుకొచ్చారు కమల్. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిగ్రీతోనే 23 ఏళ్లకు చదువు ఆపేశారు. చదివింది పొలిటికల్ సైన్స్ అయినా.. కుటుంబ పోషణ కోసం 2003లో ముంగర్‌లో ఉండే ఆర్డీ అండ్ డీజే కాలేజీ నైట్ వాచ్‌మెన్‌గా చేరాడు. అదృష్టంకొద్దీ నెల తర్వాత డిప్యుటేషన్ మీద తిల్కా మాంజీ భగల్పూర్ యూనివర్సిటీ(TMBU)కి ప్యూన్‌గా వెళ్లాడు. అక్కడ పీజీలోని అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్కు ప్యూన్‌గా పని చేశాడు. అది ఆయన జీవితాన్ని పెను మలుపు తిప్పింది. స్టాఫ్‌కు చాయ్‌లు, టిఫిన్లు, పేపర్లు అందించిన కమల్‌కి.. అక్కడికి వచ్చే విద్యార్థులు, అధ్యాపకులను చూసిన కిశోర్‌కు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. దీంతో సంబంధిత విభాగానికి ఆయన అర్జీ పెట్టుకున్నారు. వెంటనే అనుమతి దొరికింది. ఉదయం కాలేజీ.. మధ్యాహ్నాం నుంచి బంట్రోతు పని.. రాత్రిళ్లు చదువు.. ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయింది. మొత్తానికి ఎంఏ(అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్)ను 2009లో పూర్తి చేశారు. ఆ వెంటనే పీజీ కోసం డిపార్ట్మెంట్లో అనుమతి కోరగా.. మూడేళ్ల తర్వాత అది లభించింది. ఆపై 2013లో పీహెచ్డీ కోసం దరఖాస్తు చేసుకుని.. 2017లో థీసిస్ సమర్పించారు. 2019లో పీహెచ్డీ పట్టా దక్కింది కమల్‌కి. అంతేకాదు.. అదే ఊపుతో లెక్చరర్‌షిప్‌కు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) పూర్తి చేసి.. నొటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. అయితే లక్ష్య సాధనకు ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. 2020లో బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్(BSUSC) టీఎంబీయూకి సంబంధించిన నాలుగు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 12 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అందులో కమల్ కిషోర్ మండల్ కూడా ఒకరు. మే 19, 2022న ఫలితాలు వెలువడగా.. అందులో అర్హత సాధించి.. ఏ యూనివర్సిటీలో అయితే బంట్రోతుగా పని చేశారో.. ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అర్హత సాధించారు. అక్టోబర్ 12వ తేదీన ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో చేరారు. పేదరికం, కుటుంబ సమస్యలు నా చదువుకు ఆటంకంగా మారలేదు. ఉదయం కాలేజీకి వెళ్లి.. మధ్యాహ్నం డ్యూటీ చేసేవాడిని. రాత్రి పూట చదువుకునేవాడిని. సహకరించిన ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నా:: కమల్ కిశోర్ మండల్ పరిస్థితులు అనుకూలించలేదని, పేదరికం వల్లే తాము చదువు దూరమయ్యామని, మంచి ఉద్యోగం సాధించలేకపోయామని కొందరు చెబుతుంటారు. కానీ, చదువుకోవాలనే కోరిక మనసులో బలంగా ఉంటే పేదరికం ఆటంకం కాదనే నిరూపించాడు కమల్. ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించిన కిశోర్ మండల్ సమాజానికి ఓ ప్రేరణ.. చదువుకోవాలనే అతడి సంకల్పానికి సెల్యూట్ చేస్తున్నా:: నెట్ కోసం కిశోర్‌కు ఉచిత శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ జైస్వాల్ -
ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లు హ్యాక్!!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు ‘ఏటీఎం గ్యాంగు’ల్ని పట్టుకున్నారు. హరియాణా– రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన వీరంతా డబ్బు డ్రా చేసిన సమయంలో మెషీన్‌ను ఆపేసి కథ నడిపారు. ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ మాత్రం వీటిని తలదన్నేలా వ్యవహరించింది. ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లను హ్యాక్ చేసి పని కానిచ్చింది. అయిదుగురిని పట్టుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ ముఠాకు సాంకేతిక సహకారం హైదరాబాద్‌కు చెందిన కమల్ అందించినట్లు గుర్తించారు. దీంతో ఇతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపారు. నలుగురు సభ్యులతో ముఠా.. ఉత్తరప్రదేశ్‌లోని బాండ జిల్లాకు చెందిన షానవాజ్ అలీ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) పూర్తి చేసి ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఇతడికి 2015లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన జమీర్ షేక్‌తో పరిచయమైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో ఓ ముఠాను కలిగి ఉన్న జమీర్ ఉత్తరాఖండ్‌తో పాటు యూపీ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏటీఎంలను హ్యాక్ చేయడం ద్వారా తెరిచి అందులోని డబ్బు కాజేశారు. షానవాజ్ అయిదో మెంబర్ అయ్యాడు. అప్పట్లో హ్యాకింగ్‌కు అవసరమైన కోడ్‌ను వీరికి జార్ఖండ్‌లోని జామ్తారకు చెందిన వారు అందించారు. ఉత్తరాఖండ్‌లో వరుసపెట్టి నేరాలు చేసిన ఈ ముఠాను ఆ ఏడాది సెప్టెంబర్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. ఈ కేసులో బెయిల్ పొంది బయటకు వచ్చిన షానవాజ్ తానే గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో ముంబైకి చెందిన జమీర్ షేక్ (కోడింగ్ డిప్లొమా చదివాడు), సాగిర్, మహ్మద్ ఉమర్, మెహ్రాజ్ (బీసీఏ గ్రాడ్యుయేట్) సభ్యులుగా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఏర్పాటు ఈ ముఠా కొత్త ఏటీఎంనూ హ్యాక్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి హైదరాబాద్ వాసి కమల్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇతగాడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి ఓ పబ్‌లో వీరికి పరిచయమయ్యాడు. కమల్ డార్క్ నెట్ నుంచి ఏటీఎం మెషీన్ల హ్యాకింగ్ మాల్వేర్ సమకూర్చుకున్నాడు. దీన్ని యూఎస్బీ డ్రైవ్‌లో వేసి షానవాజ్‌కు అందించాడు. ఈ డ్రైవ్‌ను మిషన్‌కు అనుసంధానించే ముఠా అందులోకి మాల్వేర్ పంపేది. దీని ప్రభావంతో ఆ మెషీన్ ప్రధాన సర్వర్‌తో సంబంధాలు కోల్పోయేది. అదే సమయంలో ఈ మాల్ వేర్ ఓ కోడ్‌ను సృష్టించి కమల్ పొందుపరిచిన మెయిల్ ఐడీకి చేరవేసేది. హైదరాబాద్‌లోనే ఉండి దాన్ని అధ్యయనం చేసే ఇతగాడు పాస్‌వర్డ్‌గా మార్చి షానవాజ్ గ్యాంగ్‌కు ఫోన్లో చెప్పేవాడు. దీన్ని ఎంటర్ చేయడం ద్వారా ముఠా మెషీనన్ రీబూట్ అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో డబ్బు డ్రా చేయడంతో అది ఖాతాదారుడి లెక్కల్లోకి రాదు. ఈ పంథాలో షానవాజ్ గ్యాంగ్ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్‌ల్లో కొన్నాళ్లుగా 200 ఏటీఎంలను కొల్లగొట్టింది. ఇలా కాజేసినదాంట్లో కమల్‌కు 5% ముట్టేది. వీరి కోసం ఘజియాబాద్ పోలీసులు 5 నెలల క్రితం స్వాట్ టీమ్‌ను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌లో ఉన్నాడని.. మూడు నెలల క్రితం నోయిడాలో వీరికి చిక్కిన షానవాజ్ లంచం ఎర చూపి తిప్పించుకున్నాడు. రూ.20 లక్షల నగదుతో పాటు ఎస్యూవీ వాహనాన్ని స్వాట్ టీమ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత తన ముఠాతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు షానవాజ్ సహా అయిదుగురిని పట్టుకున్నారు. వీరి విచారణలోనే నోయిడా ఉదంతం బయటపడింది. దీంతో స్వాట్ టీమ్‌కు చెందిన ఇద్దరిని ఘజియాబాద్ పోలీసులు విధుల నుంచి తొలగించారు. షానవాజ్‌ను లోతుగా విచారించిన సైబర్ సెల్ కమల్ వ్యవహారం గుర్తించింది. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తేలడంతో ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ పంథాలో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
చాలామంది ఆమెతో ప్రేమలో పడ్డవారే
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీనా కుమారికి వారాంతాల్లో సపర్యలు చేస్తూ స్నేహాన్ని పెంచుకున్నాడు దర్శకుడు కమల్ అమ్రోహీ. అటు ‘అనార్కలి’ సినిమా అటకెక్కింది (తర్వాత ఆ ప్రాజెక్ట్ చేతులు మారి నాసిర్ హుస్సేన్ కథతో నంద్లాల్ దర్శకత్వంలో బీనా రాయ్, ప్రదీప్ కుమార్ ముఖ్య భూమికలుగా 1953లో విడుదలైంది ‘అనార్కలి’పేరుతోనే). ఇటు మీనా, కమల్ల స్నేహం ప్రేమై.. నిఖా చేసుకుంది రహస్యంగా. ఎందుకంటే కమల్ అప్పటికే వివాహితుడు, పిల్లలు కూడా. మీనా కుమారి కన్నా పదహారేళ్లు పెద్దవాడు. ఆ నిఖా ఆమెకేనాడూ సంతోషాన్నివ్వలేదు. మీనాను భార్యగా కుబూల్ చేసిన మరుక్షణం నుంచే ఆమె చుట్టూ ఓ చట్రాన్ని బిగించాడు కమల్. అనుక్షణం అభద్రతలో రగిలిపోసాగాడు. ఏది ఏమైనా సాయంకాలం ఆరున్నరకల్లా ఇంటికి చేరుకోవాలి మీనా. అతను పంపిన కారులోనే ఆమె షూటింగ్‌కు వెళ్లాలి, రావాలి. సెట్స్‌లో ఆమె వెన్నంటే ఉండడానికి ఒక వ్యక్తినీ నియమించాడు కమల్. ఈ పొసెసివ్‌నెస్ మీనాను ఊపిరి సలపనివ్వకుండా చేసింది. ఆ పెళ్లి ఎనిమిదేళ్లు సాగినా కలహాల కాపురమే అయింది. మీనా హీరోయిన్గా తన కలల ప్రాజెక్ట్ ‘పాకీజా’ సినిమా తీయాలనుకున్నాడు కమల్. ‘విడాకులు ఇస్తేనే చేస్తాను’ అంటూ కమల్ కళ్లల్లోకి సూటిగా చూసింది మీనా. ‘మానసికంగా మనమేమీ ఒకరికొకరం ముడిపడిలేమిప్పుడు. అయినా నీ ఆత్మసంతృప్తి కోసం ఇస్తాను’ చెప్పాడు కమల్ ఆమె చూపులనుంచి తప్పించుకోకుండానే. ఆ బంధం నుంచి ఆమెను తప్పించాడు విడాకులు ఇచ్చేసి. అలా పెళ్లి విఫలమవడంతో మందుకు దగ్గరైంది మీనా. ఆ కలతకాలంలోనే ఆమె చెంత చేరాడు ధర్మేంద్ర. కష్టాన్ని మరిపించాడు.. ఆమెను మురిపించాడు.. అంతలోనే ఆమెను వీడాడు. మునుపటి అందం... ధర్మేంద్ర తనను వదిలిపోయాక, మద్యానికి బానిసైన మీనా కుమారి లివర్ సిర్రోసిస్ బారినపడింది. విదేశాల్లో చికిత్సపొంది తిరిగి ముంబైకి వచ్చాకే ఆమెకు కమల్ చేరవయ్యాడు మళ్లీ. ‘నువ్వు లేక నా డ్రీమ్ ప్రాజెక్ట్ కెమెరాకు ఎక్కకుండానే మిగిలిపోయింది’ అంటూ పాకీజా ఊసెత్తాడు మీనా కుమారి దగ్గర. ‘నన్ను మునుపటి అందంతో చూపిస్తాను అంటే నీ పాకీజా నేనవుతాను’ చెప్పింది మీనా కుమారి తన చేతులు, చేతివేళ్లు చూసుకుంటూ. ఎదురుగా ఉన్న మీనా కుమారిని మసగ్గా చూపించాయి కమల్ కళ్లల్లో ఊరిన నీళ్లు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ఆప్యాయంగా నొక్కాడు.‘పాకీజా’ సినిమాకు సన్నహాలు మొదలయ్యాయి మీనా కుమారి హీరోయిన్గా. హీరోగా ధర్మేంద్రతో అంతకుముందే సైన్ చేయించుకున్నాడు కమల్. కాని.. మీనా కుమారితో ధర్మేంద్రకున్న స్నేహం చిలువలు, పలువలుగా కమల్‌ను చేరి అతని మనసును కలవరపెట్టాయి. అతనిలోని పొసెసివ్ నేచర్ మళ్లీ పడగ విప్పింది. ధర్మేంద్రను ఆ సినిమా నుంచి తొలగించింది. ఆ పాత్రకు రాజ్‌కుమార్‌ను ఎంచుకున్నాడు. ‘పాకీజా’ మొదలైంది. అయితే అప్పటికి కమల్‌కు తెలియని నిజం ఏంటంటే రాజ్‌కుమార్ కూడా మీనా కుమారీకి దీవానానే అని. విలక్షణమైన తన ఉచ్చారణ శైలితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్.. సెట్స్‌లో మీనా కుమారిని చూడగానే మైమరచిపోయేవాడట.. సీన్లోని డైలాగులు టార్గెట్ అయ్యేవట. ఈ క్రమం ‘పాకీజా’కేమీ మినహాయింపు కాలేదు. డైరెక్టర్ కమల్ ‘ కెమెరా.. యాక్షన్’ అని చెప్పినా తాను చెప్పాల్సిన సంభాషణలను మరచిపోయి మీనా కుమారీనే చూస్తుండి పోయిన సందర్భాలెన్నో. రాజ్‌కుమార్ తీరుతో చిర్రెత్తి పోయిన కమల్.. హీరోహీరోయిన్లు కలిసి నటించే సీన్లను సాధ్యమైనంత తక్కువ షూట్ చేశాడట. ‘పాకీజా’లోని ‘చలో దిల్దార్ చలో చాంద్ కే పార్ చలో’ పాటను ప్రణయ గీతంగా నాయికా నాయకుల మధ్య సాన్నిహిత్యంతో చిత్రీకరించాలని అనుకున్నాడట. కాని ఎప్పుడైతే రాజ్‌కుమార్ కూడా మీనా కుమారి అంటే పడిచచ్చిపోతున్నాడని కమల్ అమ్రోహీ గ్రహించాడో అప్పడు ఆ పాట చిత్రీకరణే మారిపోయింది. కళ్లతోనే ప్రేమను అభినయించమని, ముఖ కవళికలతోనే సాన్నిహిత్యాన్ని ప్రదర్శించమని మీనా కుమారిని ఆదేశించాడు కమల్. అంతేకాదు చుట్టూ ఉన్న చెట్లు, లతలు, పూలు, చందమామాను ఎక్కువగా ఫోకస్ చేసి రొమాంటిక్ సాంగ్‌ను పూర్తి చేశాడు. అలా ఆ సినిమా షెడ్యూల్స్ అన్నీ అసహనం, కోపం, నిస్సహాయత, చిరాకునే మిగిల్చాయి దర్శకుడికి. పాకీజా విడుదలైన కొన్ని వారాలకే మీనా కుమారి అల్విదా చెప్పింది ఈ ప్రపంచానికి. కాని కమల్ పొసెసివ్‌నెస్ మాత్రం కొనసాగింది. ఫలితంగా తర్వాతటి తన సినిమాల్లో ఏ ఒక్కదాంట్లోనూ రాజ్‌కుమార్‌కు వేషం ఇవ్వలేదు అతను. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు, ప్రణయగీతాల పట్ల అంత ఆసక్తి కనబర్చేవాడు కాదట రాజ్‌కుమార్. కాని మీనా కుమారికి జంటగా చేసే సినిమాల్లో ఇష్టంగా నటించేవాడట. మీనా కుమారితో సినిమాలు చేసిన దర్శక, హీరోల్లో చాలామంది ఆమెతో ప్రేమలో పడ్డవారే. ఆమె అందానికి ఫిదా అయిన వారే. ఆ వరుసలోనే భరత్ భూషణ్ కూడా ఉంటాడు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రం ‘బైజూ బావ్రా’. సూపర్, డూపర్ హిట్. ఆ సినిమా షూటింగ్‌లోనే భరత్ భూషణ్ మీనా కుమారితో ప్రేమలో పడ్డాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అభ్యర్థించాడు. సున్నితంగా తిరస్కరించింది మీనా కుమారి. -ఎస్సార్ -
మిమిక్రీ లేడీ సూపర్ స్టార్
-
చిత్రం రమణీయం.. నటన స్మరణీయం
అతడి కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ప్రకృతి రమణీయతకు, గ్రామసీమలవాతావరణానికి అద్దం పడుతున్నాయి. నాటక, సినీ రంగాల్లోనూ రాణించడంతో ప్రశంసలు అందుతున్నాయి. ఒకవైపు చిత్రకళలో, మరోవైపు నటనా రంగంలో తనదైన వైవిధ్యాన్ని చాటుతున్నారు నగరంలోని వెంగళరావునగర్‌కు చెందిన చిత్రకారుడు కమల్. ఇప్పటికే పలు చిత్రకళా ప్రదర్శనలతో ముందుకు సాగుతున్నారు. నాటకాలు, సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోపుట్టి పెరిగిన ఆయన తన నేపథ్యాన్నిమరవకుండా పల్లె ఆత్మను తన చిత్రకళలోఆవిష్కరిస్తున్నారు. జూబ్లీహిల్స్ :సూర్యాపేట జిల్లా కోదాడ వాస్తవ్యుడైన కమల్‌కు చిన్నప్పటి నుంచే చిత్రలేఖనం అంటే మక్కువ. పాఠశాలలో చదివేటప్పుడు ఎలాంటి పెయింటింగ్ వర్క్ ఉన్నా ఉపాధ్యాయులు కమల్‌తోనే వేయించేవారు. అలా చిత్రకళపై పట్టు సాధించారు. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనా చిత్రలేఖనం కళపై ఇష్టంతో అందులో చేరలేదు. కుటుంబానికి భారం కావడం ఇష్టంలేక ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు దుకాణాలు, షాపులకు సంబంధించిన బోర్డులు, చిన్నచిన్న పెయింటింగ్స్ వేసేవారు. ఈ క్రమంలో కమల్‌కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. దీంతో ఏకంగా చెన్నై వెళ్లారు. అక్కడ ఐదేళ్లు ఉన్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలో బీఎఫ్ఏ కోర్స్ పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి నాటక రంగంలో ఎంఏ పూర్తి చేశారు. అప్పటినుంచి పూర్తిస్థాయిలో పెయింటింగ్స్పైనే దృష్టి సారించారు. పలు గ్రూప్ షోలలో పాల్గొంటున్నారు. మరోవైపు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ తన అభిరుచికి సాన పెడుతున్నారు. పెయింటింగ్ వేస్తున్న కమల్ ఎంతో సంతృప్తిగా ఉంది.. చిన్నప్పటి నుంచే చిత్రలేఖనం, నాటకరంగం అంటే చాలా ఇష్టం. వీటినే వృత్తిగా స్వీకరించాను. ఇప్పటివరు 35కుపైగా సినిమాలు, సీరియల్స్‌లో నటించాను. చిరుత, పప్పు, మిస్టర్ గిరీశం సహా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాను. ‘మట్టిలో మాణిక్యాలు’ చిత్రంలో వేసిన పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు సోలో పెయింటింగ్ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. భవిష్యత్‌లో సోలో ఎగ్జిబిషన్ తప్పకుండా చేస్తాననే నమ్మకం ఉంది. వెంగళరావునగర్ ప్రాంతంలోని పిల్లలకు పెయింటింగ్ పాఠాలు చెప్పడం ఎంతో సంతృప్తినిస్తోంది. – కమల్, చిత్రకారుడు, నటుడు -
సినిమాలు పూర్తవగానే రాజకీయాల్లోకి...
సాక్షి, చెన్నై: చేతిలో ఉన్న రెండు సినిమాల పూర్తికాగానే రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఓ తమిళ వారపత్రికకు కమల్ రాస్తున్న ధారావాహిక శీర్షికలో పలు విషయాలను ప్రస్తావించారు. సినిమాలు ముగించుకుని రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నానని అమెరికాలో తాను చేసిన ప్రకటన అక్కడి అభిమానులను ఆవేదనలో ముంచెత్తిందని తెలిపారు. అందరూ రాజకీయాల్లోకి వచ్చేపుడు తాను వస్తానని గతంలో చెప్పానని, ఆనాటి మాట ప్రకారం తాను వచ్చే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. మరోవైపు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
రాష్ట్రా వ్యాప్తంగా కమల్ పర్యటనలు
-
కమల్, గాయత్రీరఘురామ్‌కు నోటీసులు
రూ.100 కోట్లు కోరుతూ నోటీసులు తమిళసినిమా (చెన్నై): తమిళనాట బిగ్‌బాస్ రియాలిటీ షో వ్యవహారంలో నటుడు కమలహాసన్, నటి గాయత్రీరఘురామ్‌పై రూ.100 కోట్లు పరువు నష్టం కోరుతూ పుదియ తమిళ కట్చి నేత డా.కృష్ణస్వామి నోటీసులు పంపారు. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా విజయ్ టీవీ సంస్థ నిర్వహిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలో నటి, నృత్య దర్శకురాలు గాయత్రీరఘురామ్ ఒక సందర్భంలో అలగాజన ప్రవర్తన.. అంటూ వ్యాఖ్యలు చేశారనీ, అవి ఒక జాతిని కించపరచేలా ఉన్నాయని, వాటిని ఎడిట్ చేయకుండా అలానే ప్రసారం చేశారనీ కృష్ణస్వామి ఆదివారం కోయంబత్తూరులో విలేకరుల సమావేశంలో చెప్పారు. వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరగా, రెండు వారాలు గడిచినా వారు స్పందించకపోవడంతో న్యాయవాది ద్వారా శనివారం నోటీసులు పంపినట్లు తెలిపారు. -
జల్లికట్టుకు నేను సైతం..
జల్లికట్టు పోరాటంలో ఎప్పుడైతే యువత పాల్గొందో అప్పటి నుంచి విశ్వరూపం దాల్చిందనే చెప్పాలి. రెండేళ్లుగా తమిళ సంఘాలు, రాజకీయనాయకులు జల్లికట్టు కోసం గొంతు విప్పినా, పెద్దగా ప్రభావం చూపలేదు. అలాంటిది సమీపకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి యువత జల్లికట్టు కోసం నడుంబిగించిందో అప్పటి నుంచి జల్లికట్టు పోరాట ముఖ చిత్రమే మారిపోయింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ మనకెందుకులే వివాదం అంటూ ముఖం చాటేసిన తమిళ చిత్రపరిశ్రమ వర్గాలు జల్లికట్టు కోసం ఘోషిస్తున్నాయి. అయినా ఇప్పటికీ కొందరు కప్ప చావకూడదు, కర్ర విరగ కూడదు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఆచితూచి అడుగేసే నటుడు విజయ్ మంగళవారం ఎట్టకేలకు తన మౌన ముద్రను వీడి జల్లికట్టుకు వంత పాడారు. పెటాను మన ఊరు నుంచి తరిమి కొడదాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందే రజనీకాంత్, కమలహాసన్, సూర్య, కార్తీ, విశాల్ జల్లికట్టుకు మద్దతు పలికారన్నది తెలిసిన విషయమే. తాజాగా దక్షిణాదిలో అగ్ర నటిగా రాణిస్తున్న నటి నయనతార జల్లికట్టుకు తాను సైతం అంటూ అందుకోసం పోరాడుతున్న యువతకు మద్దతు పలికారు. బుధవారం నయనతార విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎమన్నారో చూద్దాం. యువతరం బలం మరోసారి నిరూపణ అయ్యింది. సమీప కాలంలో తమిళనాడు చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఒక విప్లవం రగులుతుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ పుట్టకపోయినా, ఆలోచన, అనుబంధాల పరంగా నేనూ ఈ రాష్ట్రానికి చెందిన అమ్మాయిననే భావంతో గర్వంగా తలెత్తుకునేలా చేసింది. జల్లికట్టు కోసం యువత శాంతియుతంగా పోరాటం చేయడం మరింత ఘనతను చాటుతోంది. నేనిక్కడ పుట్టకపోయినా, నాకు గుర్తింపును ఇచ్చింది తమిళప్రజలే. అలాంటి వారి ఈ భావోద్రేక పోరాటానికి నేనూ అండగా నిలబడతాను. మన సంస్కృతి, సంప్రదాయాలు తెలి యని వారి అసత్య వాదనను నమ్మిన న్యాయ, ప్రభుత్వ రంగాలకు మన గొంతు వినిపిస్తుందని నమ్ముతున్నాను. జల్లికట్టు కోసం భావోద్రేక పోరాటం చేస్తున్న తమిళుల గొంతు ప్రపంచానికి వినిపిస్తుందని నమ్ముతున్నాను. తమిళనాడు ప్రజలు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఒక పౌరురాలిగా వారి సమైక్యత, ధైర్యానికి శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను. వారి ప్రయత్నం ఎలాంటి జాప్యం లేకుండా ఫలిస్తుందని నమ్ముతున్నాను. అని పేర్కొన్నారు. -
కమల్, నాజర్, విశాల్‌కు హైకోర్టు నోటీసులు
చెన్నై: నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో నటుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే చెన్నై, తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌సంఘం సభ్యుడు చెన్నై నగర హక్కుల విభాగంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నడిగర్ సంఘం 62వ సర్వసభ్య సమావేశంలో సంఘ భవనాన్ని నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారన్నారు. అదే విధంగా సంఘ సభ్యులతో చర్చించకుండానే బెంగళూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో సంఘ భవన నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందువల్ల ఆ ఒప్పందాన్ని రద్దు చేసి సంఘ సభ్యులందరితో చర్చించి నూతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను 19 తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
కావేరి వివాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ కావేరీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర జలాల వివాదాల నదీ ప్రవాహం ఇలా కొనసాగుతూనే ఉంటుందంటూ ట్విట్టర్ లో తన ఫీలింగ్స్ ను షేర్ చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. కావేరీ జలాల వివాదం ఇరు రాష్ట్రాల మధ్య ఆదిమానవుల కాలంనుంచి కొనసాగుతోందనీ, ఇది మన తరం తర్వాత కూడా కొనసాగుతుందన్నారు. మానవుడు వానరాలుగా.. భాష నేర్వక సంచరిస్తున్న కాలంలో పుట్టిందనీ.. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుందంటూ ట్వీట్ చేశారు. చరిత్ర అద్దంలో మన ముఖాలను ఇలా చూసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాగా సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చెలరేగిన వివాదం హింసాత్మకం రూపం దాల్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనాలను కన్నడిగులు తగులబెట్టారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. ఐటీ సహా, పలు వ్యాపార సంస్థలు మూతపడడంతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా జరిగిన పోలీసులు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో
చక్కని నటి కమలినీ ముఖర్జీ. తెలుగులో ఆనంద్ చిత్రంతో అందరినీ అలరించిన బ్యూటీ ఈమె. బహుభాషా నటిగా గుర్తింపు పొందినా ఎందు చేతనో క్రేజీ నాయకి స్థాయికి చేరుకోలేదు. ఇంతకు ముందు తమిళంలో వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌తో రొమాన్స్ చేసిన కమలిని ముఖర్జి.. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఇరైవి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.ఈ సందర్భంగా కమలిని ముఖర్జీ తన అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు. వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌కు జంటగా చిన్న పాత్రనే పోషించినా నాకు తమిళ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ మరువలేనిది. నేను ఇక్కడ అధిక చిత్రాలు చేయకపోయినా ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అలాంటి వైవిధ్యభరిత పాత్రల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇరైవి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో కుటుంబం, ఉద్యోగం రెండింటిని మేనేజ్ చేసుకుంటూ జీవించే పాత్ర. ఇప్పటి వరకూ నేను నటించిన పాత్రలకు భిన్నమైనది. ఈ పాత్రతో మరోసారి తమిళ ప్రేక్షకులకు దగ్గరవుతాననే నమ్మకం ఉంది. భాష నాకు సమస్య కాదు. నాకు నచ్చిన హీరో ఎవరని అడుగుతున్నారు. నటనకే నేను అభిమానిని. తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను. ఇక రచన,ప్రయాణం, పాకశాస్త్రం కళలపై ఆసక్తి చూపుతున్నాను. భవిష్యత్‌లో పలు కథలు రాస్తాను. నేను రంగస్థలంపై నటించాను. ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో. -
లాస్‌ఏంజల్స్‌కు శభాష్ నాయుడు చిత్ర యూనిట్
కొత్తదనం కోసమో, లేక కథల డిమాండ్ వల్లనో మన చిత్ర నిర్మాతలు విదేశాలలో చిత్రీకరణకు బయలు దేరుతున్నారు.అయితే ఇందులో సాధక బాధకాలు ఎన్నో. ప్రఖ్యాత నటుడు,నిర్మాత లాంటి వారికి కూడా ఆటంకాలు తప్పడం లేదంటే చూడండి. విశ్వనాయకుడు తాజాగా తమిళం, తెలుగు, హిందీ భాషలో శభాష్ నాయుడు అనే చిత్రంలో నటిస్తూ లైకా సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చెన్నైలో చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం అమెరికాలోని లాస్ఏంజల్స్ చేరుకుంది. అయితే ఇందుకు ఆ యూనిట్ పలు అవరోధాలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విషయాన్ని కమలహాసన్ ఒక లేఖ ద్వారా పేర్కొంటూ శభాష్‌నాయుడు చిత్ర బృందం సురక్షితంగా లాస్ఏంజల్స్ చేరుకుందన్నారు.అయితే ఇందుకు ఆదిలోనే పలు ఆటంకాలను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు.అలాంటి సవాళ్లను అధిగమించి అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు.ప్రతి చిత్ర నిర్మాణ సంస్థకు ఇలాంటి సమస్యలు ఎదురవ్వడం సర్వసాధారణ విషయంగా భావించాల్సి ఉంటుందన్నారు.ముఖ్యంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఎత్తున,బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్న శభాష్ నాయుడు లాంటి చిత్రాల నిర్మాణాలకు ఇలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయన్నారు. చెన్నైలోని అమెరికా కాన్సలెంట్ సహకారం మరువలేనిదన్నారు.వారు విదేశాలలో చిత్ర నిర్మాణం చేపడుతున్న తమ ప్రతి చిత్రానికి ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు.ఇదే విధంగా దక్షిణాదికి చెందిన ప్రతి చిత్ర నిర్మాణ సంస్థకు వారు ఎంతో సహాయ సహకారాన్ని అందుస్తున్నారని అన్నారు.ఇకపోతే ప్రతిభావంతులైన నటీనటులు,సాంకేతిక వర్గంతో శభాష్ నాయుడు చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కమలహాసన్ పేర్కొన్నారు.కాగా ఇందులో కమలహాసన్ ఆయన కూతురు శ్రుతిహసన్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.దీనికి సంగీతజ్ఞాని ఇళయరాజా స్వరాలు క డుతున్నారు. -
నెత్తుటి మరక
పట్టుకోండి చూద్దాం.. ఆరోజు చాలా పొద్దుటే ఆఫీసుకు వచ్చాడు చందర్. సెక్యూరిటీ గార్డ్ సెలవులో ఉన్నాడు. పనివాళ్లు ఎవరూ ఇంకా రాలేదు. తన ఛాంబర్లో ఒంటరిగా కూర్చున్నాడు చందర్. అందరికీ ఆఫీసు నుంచి ఎప్పుడూ ఇంటికెళదామా? అని ఉంటుంది. తనకేమో...ఆఫీసు టైం అయిపోతే చాలు గుండెలో గుబులు. దీనికి కారణం తన భార్య సుందరి. కాలేజీ రోజుల నాటి మిత్రురాలు సుందరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చందర్. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. ఆ తరువాత మాత్రం చీటికి మాటికి గొడవపడడం మొదలైంది. ఒకరోజు ఇంట్లో గట్టిగా అరిచాడు చందర్... ‘‘నా ప్రాణం పోతే...అది నీ వల్లే అని గుర్తుంచుకో...’’ ‘‘దొంగే... దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది. నీ నస భరించలేక ఏదో ఒక రోజు నేనే చనిపోయేలా ఉన్నాను’’ అని గట్టిగా అంది సుందరి. చందర్, సుందరీల సంసారంలో ఇలాంటి గొడవలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు ఆఫీసుకు త్వరగా రావడానికి కూడా ఇంట్లో గొడవే కారణం. భార్యతో జరిగిన గొడవను గుర్తు తెచ్చుకుంటూ సిగరెట్టు వెలిగించాడు చందర్. ‘‘ఛా...ఏమిటో ఈ మనుషులు’’ అని నిట్టూర్చాడు. కాసేపు భార్యను తిట్టుకున్నాడు. ‘అమ్మానాన్నలు చేసుకోమన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఈ గొడవంతా ఉండేది కాదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పుతుందా మరీ’ అనుకున్నాడు బాధగా. ఇంతలోనే చందర్‌కు తన బిజినెస్ పార్టనర్ కమల్ గుర్తుకు వచ్చాడు. కమల్ పేరు గుర్తుతెచ్చుకోగానే కోపం నషాళానికి అంటింది. ‘దుర్మార్గుడు... ఎంత మోసం చేశాడు! నమ్మి నెత్తి మీద పెట్టుకుంటే నిలువునా గొంతు కోశాడు’ అనుకుంటూ మరో సిగరెట్టు వెలిగించాడు. కమల్ తనకు చేసిన ఒక్కో మోసాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు చందర్. ఇంతలోనే తన ఫోన్ మోగింది. ‘‘సురేష్... నాకు మళ్లీ ఫోన్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు...’’ గట్టిగా తన పీఏ సురేష్‌పై అరిచాడు చందర్. ‘‘సార్...నేను చెప్పేది వినండి...’’ అవతలివైపు నుంచి సురేష్ అంటున్నాడు. ‘‘నువ్వు మరో మాట మాట్లాడకు... నీ అంతు తేలుస్తా...’’ అరిచాడు చందర్. ‘‘ఎవరి అంతు ఎవరు తేలుస్తారో చూద్దాం...’’ అని అంతకంటే గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశాడు సురేష్. ఒక గంట తరువాత..... తాను కూర్చున్న సీట్లోనే హత్యకు గురయ్యాడు చందర్. ఆ ఉదయం ఆఫీసుకు వచ్చిన వాళ్లు... 1. చందర్ భార్య సుందరి. 2. బిజినెస్ పార్టనర్ కమల్. 3. పీఏ సురేష్. అనుమానితుల జాబితాలో ఈ ముగ్గురు ఉన్నారు. ఇన్స్పెక్టర్ నరసింహ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అనుమానితుల పేర్లు, వివరాలు తెలుసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపట్లోనే చందర్‌ని హత్య చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టాడు ఇన్స్పెక్టర్ నరసింహ. క్లూ: చందర్ ఎదురుగా ఉన్న క్యాలెండర్‌లోని ఒక బొమ్మపై... నెత్తుటితో గీసిన గీత కనిపిస్తుంది. పై ముగ్గురిలో హత్య చేసిన వ్యక్తి పేరు చెప్పగలరా? జవాబు: హంతకుడి పేరు కమల్. చందర్ సురేష్‌తో మాట్లాడిన తరువాత... బిజినెస్‌లో తనకు రావల్సిన వాటా గురించి మాట్లాడడానికి వచ్చాడు కమల్. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంతో చందర్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు కమల్. ఎదురుగా ఉన్న క్యాలెండర్‌పై ‘తామరపువ్వు’ బొమ్మపై రక్తంతో గీశాడు చందర్. తనపై కాల్పులు జరిపింది ‘కమల్’ అని తెలియడానికే ఇలా చేశాడు. -
కమల్‌తో శివగామి?
విశ్వనటుడికి శివకామి అర్ధాంగిగా మారనున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి రావడం తాజా వార్తే అవుతుంది. విశ్వనటుడంటే కమలహాసన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు శివగామి అన్నా నటి రమ్యక్రిష్ణ అని గుర్తు చేయనక్కర్లేదు. ఎందుకంటే బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు అంతగా జీవం పోసి ఆ చిత్రానికి వెన్నుముకగా నిలిచిన నటి రమ్యక్రిష్ణ. ఇంతకు ముందు ఇలానే పడయప్పా చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకిగా దీటుగా నటించి నీలాంబరిగా ప్రాచుర్యం పొందారు. నిజానికి రమ్యక్రిష్ణ తమిళం కంటే తెలుగులోనే అధిక చిత్రాలు చేశారు.అయితే పడయప్పా చిత్రంలో నీలాంబరి పాత్ర అంతకంటే అధికంగా ప్రాచుర్యం పొందారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ నటీమణులు ఇప్పటికీ నీలాంబరి లాంటి పాత్ర చేయాలని ఆశ పడుతుండడం ఆ పాత్రలో రమ్యక్రిష్ణ ఎంతగా ఒదిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక పంచతంత్రం చిత్రంలోనూ కమలహాసన్‌తో పోటీపడి నటించారు. ఆ చిత్రంలో నటి సిమ్రాన్ హీరోయిన్ అయినా రమ్యక్రిష్ణ పాత్రకే ప్రాధాన్యత ఉంటుంది.ఆ చిత్రం 2002లో విడుదలైంది.14 ఏళ్ల తరువాత ఈ శివగామి కమల్‌తో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంచలన నటికి విశ్వనటుడి నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. కమలహాసన్ నటించనున్న తాజా చిత్రానికి మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఇందులో కమల్‌కు భార్యగా నటి రమ్యక్రిష్ణను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. మరో విశేషం ఏమిటంటే ఇదే చిత్రంలో కమలహాసన్‌కు కూతురిగా ఆయన కూతురు, క్రేజీ హీరోయిన్ శ్రుతిహసన్ నటించనున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్‌ను అమెరికాలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నటి రమ్యక్రిష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. ఏదేమైనా బాహుబలి చిత్రం తరువాత ఈ ప్రౌడకు మరింత క్రేజ్ పెరిగిందన్నది నిజం. ఇప్పటికే నాగార్జునతో నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటించి తన సత్తాను మరో సారి చాటుకున్న రమ్యక్రిష్ట త్వరలో తన భర్త క్రిష్ణవంశీ దర్శకత్వంలో రుద్రాక్ష అనే తెలుగు చిత్రంలో నటించడానికి తయారవుతున్నారు. మరో పక్క బాహుబలి-2లోనూ నటిస్తూ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా బిజీగా ఉన్నారు. -
పాత కాంబినేషన్... కొత్త సినిమా...
హీరో కమలహాసన్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే, తరువాతి సినిమాకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ‘చీకటి రాజ్యం’ (తమిళంలో ‘తూంగా వనమ్’)తో ప్రేక్షకులను పలకరించిన ఆయన టి.కె. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళాల్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జరీనా వహాబ్, అక్కినేని అమల నటిస్తున్న ఆ చిత్రం తాలూకు ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ‘అమ్మానాన్న ఆట’ అని పేరు పెట్టిన ఆ సినిమాలో కమల్‌తో కలసి ఆయన కుమార్తె శ్రుతీహాసన్ కూడా నటించనున్నారు. తండ్రీ కూతుళ్ళిద్దరూ కలసి నటిస్తున్న తొలి సినిమా అదే. ఇన్ని విశేషాలున్న కొత్త సినిమా పని హడావిడిలో ఉండగానే, కమల్ ఆ తరువాతి సినిమాకు కూడా ప్లాన్ సిద్ధం చేసినట్లు భోగట్టా. తెలుగు, తమిళాల్లో వాణిజ్యపరంగా సక్సెస్ అనిపించుకున్న ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వా దానికి దర్శకుడట! గతంలో దాదాపు ఏడేళ్ళ పాటు తన దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాజేశ్‌తో ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ కొత్త సినిమాకు కమల్ శ్రీకారం చుడతారట! ‘‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా. మారిషస్‌లో చిత్రీకరించాలని భావిస్తున్నారు. నిజానికి, ‘చీకటి రాజ్యం’ కన్నా ముందే ఈ కథను తెరకెక్కించాలని భావించారు. కానీ, అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్క లేదు. మళ్ళీ ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఆ ప్రాజెక్ట్‌లో కదలిక వచ్చింది’’ అని కోడంబాకమ్ వర్గాల కథనం. అంటే, మొత్తానికి కమలహాసన్ ఈ ఏడాది చకచకా రెండు సినిమాలు చేయనున్నారన్న మాట! మన అగ్ర హీరోలందరూ నిదానంగా అడుగులు వేస్తుంటే, వయసు, అనుభవం పెరిగిపోతున్నకొద్దీ కమల్లో జోరు పెరిగిపోతుండడం విశేషమే!! -
జల్లికట్టు కోసం తమిళనాట ఉద్యమాలు
-
చీకటిలో... చదరంగం..!
కొత్త సినిమాలు గురూ! చిత్రం: చీకటి రాజ్యం; తారాగణం: కమలహాసన్, త్రిష, కిశోర్, ప్రకాశ్‌రాజ్, ‘మిర్చి’ సంపత్‌రాజ్, యూహి సేతు; స్క్రీన్‌ప్లే: కమలహాసన్; సంగీతం: జిబ్రాన్ కెమేరా: సానూ జాన్ వర్గీస్; యాక్షన్: గిల్గెస్ కాంసే యిల్, టి. రమేశ్; నిర్మాతలు: ఎస్.చంద్రహాసన్, కమలహాసన్; దర్శకత్వం: రాజేశ్ ఎం. సెల్వా, నిడివి: 129 నిమిషాలు సృజనాత్మకత తక్కువైపోయి సినిమాలన్నీ ఒకే తరహాలో వస్తుంటే..? అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఇవాళ ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. మరి, సృజనాత్మకత మరీ ఎక్కువైపోతేనో? వెరైటీగా అనిపించినా, అదీ ఇంకో రకమైన ఇబ్బందే. కానీ, కొత్త తరహాగా ఆలోచించాలనీ, నలుగురూ వెళుతున్న దోవకు భిన్నంగా వెళ్ళాలనీ, కొత్తదనాన్నీ చూపించాలనీ అనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకొనే కమలహాసన్ చేసిన తాజా ప్రయత్నం - ‘చీకటి రాజ్యం’. చాలాకాలం తరువాత తమిళం (‘తూంగావనమ్’)తో పాటు తెలుగులోనూ కమల్ అందించిన స్టైలిష్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. దీపావళికి ఒక రోజు ముందే తమిళ వెర్షన్ అక్కడ విడుదలై, విజయవంతంగా ప్రదర్శితమవుతుంటే, సరిగ్గా పది రోజుల తరువాత ఇప్పుడీ తెలుగు వెర్షన్ జనం ముందుకొచ్చింది. ఫ్రెంచ్ చిత్రం ‘స్లీప్‌లెస్ నైట్’ ఆధారంగా ఈ కథ అల్లుకున్నట్లు కమల్ పేర్కొన్నారు. టైటిల్స్‌లో క్రెడిట్ కూడా ఇచ్చారు. సినిమా స్టోరీ ఏమిటంటే... సి.కె. దివాకర్ అలియాస్ సి.కె.డి. (కమలహాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్. డాక్టరైన భార్య విడాకులిచ్చేస్తుంది. వాళ్ళబ్బాయి వాసు స్కూల్లో చదువుకొనే పిల్లాడు. ఇద్దరికీ పిల్లాడే ప్రాణం. ఊళ్ళో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుంటే, పది కిలోల కొకైన్ బ్యాగ్‌ను దివాకర్, అతని కొలీగ్ మణి (యూహీ సేతు) కొట్టే స్తారు. కొకైన్ దంధా నడిపే నైట్‌క్లబ్ ఓనర్ విఠల్‌రావు (ప్రకాశ్‌రాజ్) విషయం తెలిసి, పిల్లాణ్ణి కిడ్నాప్ చేయిస్తాడు. కొకైన్ బ్యాగ్ ఇస్తేనే, పిల్లాణ్ణి అప్పగిస్తానని బేరం పెడతాడు. బాబు కోసం ఆ బ్యాగ్ ఇచ్చేయ డానికి దివాకర్ సిద్ధపడతాడు. ఆ బ్యాగ్ తీసుకొని క్లబ్‌కు వెళ్ళి, టాయి లెట్లో దాచిపెడతాడు. నార్కోటిక్స్ బ్యూరోలోనే మరో పోలీసైన మల్లిక (త్రిష) అనుకోకుండా దివాకర్‌ను వెంబడించి, బ్యాగ్ సంగతి చూస్తుంది. తీసి మరోచోట దాస్తుంది. తీరా పిల్లాణ్ణి కాపాడుకొందామని ప్రయత్నిం చిన దివాకర్‌కు దాచినచోట బ్యాగ్ కనిపించదు. ఒకపక్క విఠల్‌రావు, అతని బిజినెస్ పార్టనర్ (‘మిర్చి’ సంపత్), అనుచరులు, మరోపక్క ఆఫీసర్లు మల్లిక, మోహన్ (కిశోర్) వెంటాడుతుంటే, బిడ్డను కాపాడు కోవడానికి అతను తంటాలు పడుతుంటాడు. ఆ రాత్రి పోలీస్ డిపార్ట మెంట్‌తో సహా, నేరసామ్రాజ్యంలోని చీకటి కోణాలెన్నో బయటపడ తాయి. అవేమిటి? దివాకర్ కన్నబిడ్డను కాపాడుకోగలిగాడా? అవన్నీ తెరపై చూడాల్సిన విషయాలు. పాయింట్ చిన్నదైనా, ప్రధానంగా కథనశైలి మీద ఆధారపడి తీసిన క్రైవ్‌ు యాక్షన్ థ్రిల్లర్ ఇది. అందుకు తగ్గట్లే నేపథ్య సంగీతం, యాక్షన్ అంశాలే కీలకమయ్యాయి. భార్య నుంచి విడాకులు తీసుకొని, కొడుకే ప్రాణంగా బతుకుతున్న తండ్రి పాత్రలోని బాధను కమల్ బాగా చూపించారు. యాక్షన్ సన్నివేశాల్నీ రియలిస్టిక్‌గా పండిం చారు. అలాగే, పోలీస్ ఆఫీసర్లుగా త్రిష, కిశోర్, గ్యాంగ్స్టర్లుగా ప్రకాశ్‌రాజ్, సంపత్ అందరూ సీనియర్లే. పాత్రల్ని సమర్థంగానే పోషించినవారే. కాకపోతే, కమల్ పోషించిన పాత్రను మొదటి నుంచి కొంత నెగిటివ్ షేడ్ ఉన్నదిగా చూపెడుతూ వస్తారు. సెకండాఫ్ సగంలోకి వచ్చే సరికి ఆ పాత్ర అసలు స్వరూపం ఏమిటో, ఎందుకలా ప్రవర్తిస్తోందో తెలియజేస్తారు. అదీ వట్టి డైలాగులతో. దాంతో, ఆ పాత్ర ఒక్కసారి డార్క్ షేడ్ నుంచి బ్రైట్ షేడ్ వైపు గెంతినట్లనిపిస్తుంది. సినిమా దాదాపు నైట్ క్లబ్‌లోనే జరుగుతుంది. దాంతో, సీన్లన్నీ డ్యాన్స్ ఫ్లోర్, కిచెన్, టాయిలెట్స్‌లోనే తిరుగుతుంటాయి. ఒక విభిన్న తరహా ప్రయత్నంగా, బడ్జెట్ కలిసొచ్చే అంశంగా దాన్ని సర్దిచెప్పుకోవచ్చు కానీ, పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాను ఆ పరిధిలోనే సరిపెట్టుకోవడం ఆడియన్సకు ఇబ్బందే. సినిమా చివరలో రోలింగ్ టైటిల్స్ వస్తుంటే, యూనిట్ మొత్తం నర్తించిన ప్రమోషనల్ వీడియో తరహా సాంగ్, సాహిత్యం, ఆర్కెస్ట్రయిజేషన్ బాగు న్నాయి. ఆ పాటలో కమల్ ఎనర్జీ చూస్తే ముచ్చటేస్తుంది. వెరసి కొన్ని సినిమాలు కథను బట్టి చూస్తాం. మరికొన్ని దర్శకుణ్ణి బట్టో, హీరోను బట్టో చూస్తాం. కానీ, ఒక నటుణ్ణి బట్టి, అతని అభినయం మీద ప్రేమ కొద్దీ చూసే సినిమాలు ఇవాళ తక్కువ. యాభై ఏళ్ళ పైగా కెరీర్ తరువాత కూడా అలాంటి నటుడిగా కమల్ అలా ఆసక్తికరంగా ఆయన సినిమాలూ ఉండడం విశేషమే. ఆ ఆసక్తి ‘చీకటి రాజ్యం’ లోకి ప్రేక్షకుల్ని తెస్తుంది. కానీ, కమల్ కెరీర్లో కొన్నాళ్ళుగా పేరుకున్న బాక్సాఫీస్ చీకటిని తొలగిస్తుందా అన్నది కొన్ని కోట్ల రూపాయల ప్రశ్న. కమల్ శిష్యుడే దర్శకుడు రాజేశ్. దర్శకుడిగా అతనికి ఇదే తొలి చిత్రం. రామజోగయ్యశాస్త్రితో డైలాగ్స రాయించాలని కమల్ భావించారట. మణి పాత్రకు తెలుగులో రచయిత అబ్బూరి రవి డబ్బింగ్ చెప్పారు. ఉన్న ఒకే ఒక్క పాట కమలే పాడారు. ఫారిన్ యాక్షన్ మాస్టర్ గిల్గెస్ కాంసే యిల్ కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు. రెంటాల జయదేవ -
‘చీకటి రాజ్యం’ మెరుపు తీగెలు
అందాల తారలు రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్‌లు గురువారం నగరంలో సందడి చేశారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘చీకటి రాజ్యం’ ప్రీమియర్ షోను తిలకించేందుకు ఐమ్యాక్స్‌కు వీరు వచ్చారు. -
కమల్,మౌళి కలయికలో కామెడీ చిత్రం?
విశ్వనాయకుడు కమలహాసన్, విభిన్న కథా చిత్రాల దర్శకుడు మౌళి కాంబినేషన్లో కామెడీ కథా చిత్రం తెర కెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూంగావనం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కమలహాసన్ తదుపరి చిత్రం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కమర్షియల్, కుటుంబ కథా చిత్రాలను చేస్తున్న కమల హాసన్ దృష్టి మరోసారి హాస్యంపై మళ్లిందని సమాచారం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న చందాన కమల్ కోసం ఐదారుగురు దర్శకులు హాస్యభరిత కథలను వండి ఆయన కను సైగల కోసం ఎదురు చూస్తున్నారట. అయితో కమలహాసన్ మాత్రం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, మౌళిలలో ఒకరి దర్శకత్వంలో నటించాలని భావిస్తునట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల కమల్, దర్శకుడు మౌళి కలిసి కథా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇంతకు ముందు వీరి కలయికలో పంబల్ కే సంబంధం, నలదమయంతి వంటి వైవిధ్య భరిత చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా కమలహాసన్, మౌళి మరో వినోదభరిత చిత్రానికి సృష్టి కర్తలు కావచ్చుననే టాక్ కోడంబాక్కంలో వినిపిస్తోంది. -
అమ్మ, నాన్నను సంప్రదించం
మాకు సంబంధించిన ఏ విషయాన్ని మా అమ్మా నాన్నలను అడగం, సంప్రదించం కూడా అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇప్పుడు భారతీయ సినిమా అభిమానుల కలల రాణిగా ఎదుగుతున్న కథానాయకి ఈమె అని చెప్పవచ్చు.నటన అనేది శ్రుతిహాసన్ రక్తంలోనే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నటనలో వేళ్లూరుకు పోయిన కమలహాసన్, సారిక పుత్రికారత్నాలు శ్రుతిహాసన్, అక్షరహాసన్. శ్రుతి తమిళం, తెలుగు, హిందీ అంటూ ఏక కాలంలో టాప్ హీరోయిన్గా దుమ్మురేపుతున్నా రు. ఇటీవల విడుదలైన టాలీవుడ్ చిత్రం శ్రీమంతుడు ఈమె క్రేజ్‌ను మరింత పెంచిందని చెప్పక తప్ప దు. ఆ చిత్రంలోని ఆమె ఫొటోలను, నటించిన పాటల్ని ఇంటర్నెట్, యూట్యూబ్‌లలో అధికంగా చూ స్తున్నారని ఒక సర్వేలో తెలింది. కాగా శ్రుతిహాసన్ ఇంత తక్కువ కాలంలో అంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆమె కుంటుబ నేపథ్యం కారణమనే అపోహ కొందరికి ఉండవచ్చు. అలాంటిదేమీ కాదని శ్రుతిహాసన్ మాటలు విన్నవారికి స్పష్టం అవుతుంది. ఇంతకీ ఈ టాప్ హీరోయిన్ ఏమంటున్నారో చూద్దాం. నటన, సంగీతం నాకు రెండు కళ్లు లాంటివి. చిన్నతనంలో అమ్మ సారిక నాకు సంగీతంపై ఆసక్తిని పెంపొందించి ప్రోత్సహించారు. అదే విధంగా నాన్న కమలహాసన్ నటనపై మోహాన్ని, ప్రపంచ సినీ అనుభవాన్ని రేకెత్తించారు. అలాంటి బలమైన పునాదినే నా చెల్లెలు అక్షర హాసన్‌కు ఇచ్చారు. అందువల్లే మేమిద్దరం మా పనుల్ని మేమే ఎవరి సహాయం లేకుండా సక్రమంగా చేసుకుపోతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనయినా స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలన్న నాన్న హితబోధనను పాఠిస్తున్నాం. కథలు వినడం,పారితోషికం మాట్లాడడం, కాల్షీట్స్ కేటాయించడం వంటి విషయాల్లో ఎవరి ప్రమేయం లేకుండా నేను,చెల్లెలు ఇష్టానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటాం. అమ్మానాన్నలు జోక్యం చేసుకోరు. అలాంటి స్వేచ్ఛను వారు మాకిచ్చా రు. ఇక నాన్నతో కలిసి నటించే విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. అలాంటి అవకాశం ఇంతకు ముందొకసారి వచ్చింది. అప్పుడు నా కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాను. నాన్నతో కలిసి నటించాలనే ఆకాంక్ష నాకు ఉంది. మరోసారి అలాంటి అవకాశం వస్తే వదులుకోను. అలాగే నా చెల్లెలు తమిళంలో ఎప్పుడు నటిస్తుందన్నది తననే అడగాలి. అక్షర నాకంటే ప్రతిభ గల నటి. మంచి కథ అమిరితే మేమిద్దరం కలిసి నటిస్తాం. -
మగపిల్లల్ని పెంచడం కూడా భయమే
చెన్నై: ఈ దుర్మార్గమైన దేశంలో మగపిల్లల్ని పెంచడం కూడా తనకు భయమే అని ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్‌హాసన్ అన్నారు. తన తాజా చిత్రం 'పాపనాశం' ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాపనాశం చిత్రం విశేషాలను తెలుపుతూ తనకు కూడా తన ఇద్దరు ఆడపిల్లలు రక్షణ గురించి ఇప్పటికీ భయంగానే ఉంటుందన్నారు. శృతి, అక్షర స్థానంలో మగపిల్లలు ఉన్నా కూడా తాను ఇలాగా భయపడే వాడినన్నారు. పాపనాశం ప్రోమోలో విభూతి పెట్టుకుని ఉన్నతనను చూసి చాలామంది మీరు నాస్తికులు కదా అని అడుగుతున్నారని తెలిపారు. కానీ సినిమా వేరు, జీవితం వేరన్నారు. సాధారణంగా తన వ్యక్తిగత భావాలను సినిమాల కోసం వదులుకోనన్నారు. మరీ తప్పదనుకుంటే తప్ప తన నమ్మకాలకు, విశ్వాసాలకు వ్యతిరేకంగా నటించనన్నారు. అలాగే ఒక కులాన్ని కీర్తించే సినిమాలు తాను ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చారు. కేబల్ ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన ఆడబిడ్డలను దుండగుల వేధింపుల నుంచి రక్షించుకునే కథాంశంతో తెరకెక్కుతున్నమూవీ పాపనాశం. మలయాళంలోనూ, తెలుగులోనూ ఘన విజయం సాధించిన 'దృశ్యం' సినిమాను కమల్ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. జీతూ జోసేఫ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గౌతమి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
తమిళ సినిమా తల్లితో సమానం
తమిళసినిమా తల్లిలాంటిదని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద పేర్కొన్నారు. తమిళ చిత్రపరిశ్రమలో నినైత్తాలే ఇనిక్కుమ్(తలుచుకుంటేనే మధురం) అనే పాట వింటుంటే కమల్, రజినీలతో పాటు గుర్తుకొచ్చే నటి జయప్రద. అంతగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జయప్రద. తమిళం, తెలుగుభాషల్లో ప్రముఖ నాయికగా వెలుగొంది అటు పిమ్మట బాలీవుడ్ రంగప్రవేశం చేసి అక్కడా టాప్ హీరోయిన్గా వెలిగారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజాసేవకు అంకితమైన జయప్రద తాజాగా తన కొడుకు సిద్ధూను హీరోగా పరిచయం చేస్తూ ఉయిరే ఉయిరే అనే చిత్రాన్ని స్టూడియో9 మోషన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. నటి హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర గీతాలను ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్‌సింగ్ సమక్షంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్‌కపూర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని తెలుగు ప్రముఖ నటుడు మోహన్‌బాబు, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి, నటి రాధిక, శ్రీప్రియలు అందుకున్నారు. చి త్రం ప్రచార చిత్రాన్ని అమర్‌సింగ్ ఆవిష్కరిం చి వేదికపైనున్న వారందరికి అందించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ఈ వేది కపై దర్శకుడు కె.బాలచందర్ ఉంటే బాగుండేదన్నారు. అయినా ఆయన ఆశీస్సులు తన కొడుక్కి ఉంటాయని భావిస్తున్నానన్నారు. బాలచందర్ తన చేతిని పట్టుకుని సినిమాను నేర్పించారని గుర్తు చేసుకున్నారు. తన కొడుకు సిద్ధూను తమిళంలో ఎందుకు పరిచయం చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారన్నారు. తమిళసినిమా తనకు కన్నతల్లిలాంటిదని వివరించారు. పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందీ తమిళసినిమానేనన్నారు. అలాంటి ఈ పరిశ్రమలో తన కొడుకు ఎదగాలనే పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర చిత్రాల కంటే ఈ ఉయిరే ఉయిరే చిత్రంలో సిద్ధూ, హన్సికల జంట చూడ ముచ్చటగా, అందంగా ఉన్నారని జయప్రద పేర్కొన్నారు. నటుడు మోహన్‌బాబు, సుబ్బరామిరెడ్డి, రాధిక, శ్రీప్రియ, సుమలత, అమర్‌సింగ్ తదితరులు చిత్ర యూనిట్‌కు శుభాశీస్సులు అందించారు. చివరగా నటుడు అనిల్‌కపూర్ సినిమా ఎంటర్టైన్ అంటూ జయప్రద, హన్సిక, రాధిక, సుమలత తదితరులతో సరదాగా స్టెప్స్ వేసి అందర్నీ అలరించారు. -
విపత్తులను ముందే ఊహిస్తున్న కమల్..?
-
దళిత సమస్యని తెరకెక్కిస్తున్న కమల్..?
-
చెట్నీ అడిగితే 'పచ్చడి' కింద కొట్టాడు
న్యూఢిల్లీ: హోటల్లో అయినా.... రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేస్తూ... కొంచెం పచ్చడి వేయమంటే మళ్లీ ఎవరైనా వేస్తారు. అది సహజం. కానీ చేస్తున్న టిఫిన్‌లో మరోసారి పచ్చడి వేయమని అడిగి... కాకా హోటల్ యజమాని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి ఆసుపత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తూర్పు న్యూఢిల్లీలోని త్రిలోక్ పూరి బ్లాక్ 31లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సన్నీ అనే యువకుడు అతని స్నేహితులు రోడ్డు పక్కనే ఉన్న కాకా హోటల్లో టిఫిన్ తింటున్నారు. ఆ క్రమంలో సన్నీ ప్లేట్లో పచ్చడి అయిపోయింది. మళ్లీ పచ్చడి కావాలని హోటల్ యజమాని కమల్ని కోరాడు. దాంతో కమల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సన్నీపై ఐరన్ రాడ్‌తో దాడి చేసి... విచక్షణరహితంగా కొట్టి 'పచ్చడి' చేశాడు. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కమల్‌పై కేసు నమోదు చేశారు. సన్నీని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రీ ఆసుపత్రికి తరలించారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా పచ్చడిని సన్నీ వృద్ధా చేశాడని... అలా చేయవద్దని చెప్పినందుకు అతడితోపాటు అతడి స్నేహితులు తనతో ఘర్షణకు దిగారని కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా అతడి స్నేహితులకు ఫోన్ చేస్తే.. వారు కూడా వచ్చి తనతో వాదనకు దిగారని ఆ ఫిర్యాదులో కమల్ పేర్కొన్నాడు. దాంతో సన్నీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రయోగాలకు డాడీ భయపడరు..
ముంబై: 'డాడీ ఎవ్వరికీ భయపడరు. ప్రయోగాలు చేయడానికి ఆయన అస్సలు వెనక్కి తగ్గరు. ఏదైనా సరికొత్తగా ట్రై చేయడమంటే డాడీకి చాలా ఇష్టం. పప్పా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి' అంటూ తన తండ్రిని తలుచుకొని మురిసిపోతున్నది మరెవ్వరో కాదు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రుతిహాసన్. ఆమె నటించిన హిందీ చిత్రం 'గబ్బర్ ఈజ్ బ్యాక్' (మే 1) విడుదలైన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమె... తల్లిదండ్రులు సారిక, కమల్ హసన్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. అమ్మ సారిక చాలా దృఢంగా, స్వాతంత్ర్యంగా ఉంటారనీ... నాన్నకు సంబంధించినంతవరకు ఒక నటుడిగా ఆయన ఎవ్వరికీ భయపడరని తెలిపింది. అమ్మ స్పాంటేనియస్‌గా నటిస్తే.. నాన్న కమల్ చాలా సహజంగా నటిస్తారని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా తన సోదరి, షమితాబ్ సినిమా హీరోయిన్ అక్షర హాసన్‌పై పొగడ్తలు గుప్పించింది శ్రుతి. ఆమె తన సోదరి కావడం గర్వంగా ఉందని మురిసిపోయింది. కాగా క్రిష్ దర్శకత్వంలో అక్షయ కుమార్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో కరీనా కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
కష్టాల్లో కమల్
-
ఒక సూపర్ స్టార్ కథ.. ఉత్తమ విలన్
తన తాజా చిత్రం ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రముఖ నటుడు,దర్శకుడు కమల్ హాసన్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమా ఒక నటుడి కథ అని ఆయన చెప్పారు. ఒక సూపర్ స్టార్‌గా ఎదిగిన ఒక నటుడిలోని రెండు విభిన్నమైన కోణాలను పట్టిచూపించే మంచి సినిమా అన్నారు. అందరూ ఊహిస్తున్నట్టుగా ఉత్తమ విలన్ సినిమా సినీ పరిశ్రమ మీద సంధించిన వ్యంగ్యాస్త్రం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది మీ కథేనా అని అడుగుతున్నారని... కానీ తాను నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ తన జీవితానికి సంబంధించిన కొంత భాగం ఉంటుందని పేర్కొన్నారు. తన గురువు, దైవంతో సమానమైన కె. బాలచందర్ మార్గదర్శి పాత్రలో నటించిన ఉత్తమ విలన్ సినిమా తన జీవితంలో మర్చిపోలేని, అతి ముఖ్యమైందన్నారు కమల్. అలాంటి లెజెండరీ దర్శకుడు బాలచందర్ శిష్యరికంలో ఎదిగిన రమేష్ అరవింద్ మీద అపారమైన నమ్మకముందని, అందుకే ఈ సినిమాకు దర్శకుడిగా ఆయన్ను ఎంచుకున్నానని కమల్ తెలిపారు. ఈ సందర్భంగా తెయ్యం కళను ఫ్రెంచి నుంచి కాపీ చేశారనే విమర్శలు ఆయన తిప్పి కొట్టారు. ఫ్రాన్స్‌లో ఫ్రెంచి భాష మాట్లాడకముందే తెయ్యం కళ ఉనికిలో ఉందని చెప్పుకొచ్చారు. ఊర్వశి, నాజర్, జయరామ్ , భాస్కర్ లాంటి ప్రముఖులు నటించిన ఉత్తమ విలన్ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. -
ప్రకృతే పెద్ద విలన్
ఇక్కడ ఎవరు పెద్ద వారు కాదు. ప్రకృతే పెద్ద విలన్ అని దర్శకుడు ప్రభు సాల్మన్ తన తదుపరి చిత్రం కయల్ ద్వారా చెప్పనున్నారట. పర్ఫెక్షన్కు నూరు శాతం ప్రాముఖ్యతనిచ్చే దర్శకుడీయన. మైనా, కుంకీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. తన ఊహా రచనకు సహజత్వంతో కూడిన హంగులు అద్ది విమర్శకులు సైతం మెచ్చేలా సెల్యులాయిడ్‌పై చిత్రాలను ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు ప్రభుసాల్మన్. తాజా చిత్రంలో కమల్‌ను అద్భుత కావ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి ఆయనతో ముచ్చటిద్దాం. కయల్... ఈ పేరే కవితాత్మకంగా ఉందే? : ఇదొక రొమాంటిక్ కథా చిత్రం. కథకు తగ్గట్టుగా అలాంటి టైటిల్ కోసం ఆలోచించగా హీరోయిన్ పేరు కయల్ రొమాంటిక్‌గా ఉండడంతో దాన్నే టైటిల్‌గా నిర్ణయించాం. కథకు సునామీని నేపథ్యంగా తీసుకున్నారట? దానికంటే ముందు అందరికీ అర్థమయ్యేలా ఒక విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పదలిచాను. సునామీ రావడానికి ముందు రోజు డిసెంబర్ 25న పర్వదినం, వేడుకగా జరుపుకునే రోజు. అలా సంతోషంగా గడిపి 24 గంటలు గడవగానే అలాంటి ఒక దుర్దినం సంభవిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే మీరో, నేనో, ఇంకొకరో ఎవరు పెద్ద వాళ్లు కాదు. ప్రకృతే అందరికంటే పెద్ద విలన్. కొన్ని సెకన్లలోనే లక్షల మంది జీవితాలను అతలాకుతలంచేసి పోయింది. అందుకే జీవిస్తున్నప్పుడే నలుగురికి మంచి చెయ్యండి. ప్రేమతో పలకరించండి. జీవితం అనుభవించడానికే అంటాం. ఇప్పుడు మనం బతకడానికే ప్రయత్నిస్తున్నాం. అయితే బతకడానికి, జీవించడానికి మధ్య వ్యత్యాసం తెలియకుండానే కాలం గడిపేస్తున్నాం. ఈ విషయాన్నే కయల్ చిత్రంలో చెబుతున్నాను. డి.ఇమాన్ మ్యూజిక్ వర్కౌట్ అవుతుందా? మైనా, కుంకీ, చిత్రాల కంటే ఈ చిత్రంలో పాటలకు కొంచెం అధికంగానే ప్రాముఖ్యత ఉంటుంది. ఎలక్ట్రానిక్ సంగీతం కాకుండా అంతా లైవ్ సంగీతాన్ని అందిస్తున్నాం. వంద, నూట యాబై వయలెన్స్, పిల్లన గ్రోవిలాంటి పాత విధానంలో సంగీతం అందించనున్నాం. అలాగే చిత్రాన్ని డాల్పి అట్మాస్‌లో చేయనున్నాం. మీ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు టాప్ రేంజ్లో ప్రకాశించడం గురించి? సినిమా అనేది రెండున్నర గంటల మ్యాజిక్. అలాంటి సినిమాలను చూడటానికొచ్చేవారిని థియేటర్లలో కూర్చోపెట్టడానికి ఏదైనా చెయ్యాలి. మనం ఎవరితోనయినా మాట్లాడాలంటే వారి కళ్లు చూసే మాట్లాడతాం. అలా నేను కళ్లు చూసే ఎంపిక చేసిన హీరోయిన్లే అమలాపాల్, లక్ష్మీమీనన్. ఈ కయల్ చిత్ర నాయికి ఆనంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఆనందికి పలు అవకాశాలు వస్తున్నాయి. మైనా, కుంకీ వరసలో కయల్ చేరుతుందా? కయల్ చిత్రం కచ్చితంగా మంచి పేరు సంపాదించి పెడుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు షూటింగ్ కోసం చుట్టి వచ్చాం. సిరపురింజి అడవి ప్రాంతంలోని లొకేషన్స్‌ను ఇంతకు ముందే చిత్రంలోనూ చూసి ఉండరు. బ్రహ్మాండమైన విజువల్స్ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఒక చిత్రం హిట్ అవ్వగానే ఆ దర్శకుడు స్టార్స్ చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో మీరు మాత్రం నూతన తారలతోనే చిత్రాలు తీస్తున్నారే. నా కథలకు ఎలాంటి ఇమేజ్ లేని తారలు కావాలి, కుంకీ చిత్రంలో విక్రమ్ ప్రభును ఎంపిక చేసినప్పుడు ఆయన మావటివాడిలానే కనిపించారు. అలానే నా స్క్రిప్ట్ స్టార్స్‌కు నప్పుతుందంటే వారితోనే సినిమా చేస్తా. అలా చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. -
చాటింగ్‌తో లాభం!
నేటి తరం ఎక్కువగా అంకితం అవుతున్నవాటిలో ఆన్లైన్ చాటింగ్ ఒకటి. చాటింగ్ ద్వారా కొన్ని చీటింగ్స్ జరుగుతాయని అంటారు. కానీ, దానివల్ల లాభం చేకూరుతుందనే కథాంశంతో లావణ్య చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘చాటింగ్’. అభినయకృష్ణ, సునీత మరసీయర్ జంటగా టీయస్ కమల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వచ్చే నెల 4న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇదొక యూత్‌ఫుల్ లవ్, కామెడీ ఎంటర్టైనర్. చాటింగ్ వల్ల జరిగే మంచిపనులను చూపించే చిత్రం. జయంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
రీమేక్‌లు చేస్తున్న కమల్
-
కాలమే మారుస్తుంది
మనోగతం ఆకలేసినా, దాహం వేసినా నా భార్యని పిలవమని నా నోటికి చెప్పక్కర్లేదు. ఇంటికీ, భర్తకి, పిల్లలకు మాత్రమే సమయం కేటాయించే ఆడవాళ్లకు ఆ మూడే ప్రపంచం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా! ఇప్పుడంటే ఈ రోజని కాదు...మార్పు వచ్చి ముప్పైఏళ్లవుతుంది. ఎప్పుడైతే భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం చేయడం మొదలుపెట్టిందో అప్పుడే మార్పు వచ్చేసింది. ‘‘నా ముఖం మారింది. ఇల్లాలిగా ఇంత వండి పడేసి హాయిగా పిల్లల కోసం, భర్త కోసం ఎదురుచూడాల్సిన మేం ఉద్యోగాలపేరుతో వందమందికి వండిపెడుతున్నట్లుంది. ఇంట్లో పని గురించి ఆఫీసులో చెప్పలేం, ఆఫీసులో ఒత్తిడి గురించి ఇంట్లో చెప్పలేం’’ అని మా పక్కింటి ఆంటీ మా ఆవిడతో అంటుంటే విన్నాను. దానికి నా భార్య... ‘‘పెళ్లయిన కొత్తలో మావారు నన్ను ఉద్యోగం చేయొద్దన్నారండి. నేనే... పట్టుబట్టి, పోట్లాడి మరీ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు సరదా తీరిపోతోంది. ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాక ఉద్యోగం మానాలంటే మనసొప్పడంలేదు’’ అంటూ నా భార్య వాపోవడం కూడా విన్నాను. మా ఇద్దరి ఆఫీసులు పక్కపక్కనే ఉంటాయి. ఒకోసారి ఇద్దరం కలిసి ఇంటికొస్తాం. ఒకోసారి జాలేస్తుంటుంది. వద్దంటే ఉద్యోగంలో చేరింది. వంట సరిగ్గా కుదరలేదని, నన్నూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని చిన్న చిన్న గొడవలతో పదేళ్లు గడిపేశాం. ఇప్పుడు తను నిజంగా విసుగొచ్చి ఉద్యోగం మానేస్తే నా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అలాగని ఆమెకు పనుల్లో సాయం చేయగలనా అంటే నా వల్లకాదు. ఏం సాయం చేయాలి. పొద్దునే చీపురు పట్టుకుని ఊడ్చలేను కదా! గిన్నెలు కడగలేను కదా! ఒకసారి నా భార్య ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి పది దాటిపోయింది. నేను నా ఇద్దరు పిల్లలు (మగపిల్లలు) ఎదురుచూస్తూ కూర్చున్నాం. కొద్దిగా అన్నం ఉంటే చిన్నాడికి పెట్టాను. పెద్దాడు ఫ్రిజ్ తెరిచి పండ్లకోసం వెదికాడు. ఇంట్లో ఏమీ లేవు. ‘నాన్నా మీకు వంట చేయడం రాదా...’ అన్నాడు పెద్దాడు. ‘వచ్చు.. కాని ఎప్పుడూ చేయలేదురా...’ అన్నాను. ‘అమ్మ ఎప్పుడు రావాలి, ఎప్పుడు వండాలి. వచ్చేటప్పటికి అమ్మకు కూడా ఆకలి వేస్తుంది కదా!’ అన్నాడు. నాకు చాలా సిగ్గనిపించింది. వెంటనే నా భార్యకు ఫోన్ చేశాను. అన్నం వండడానికి కుక్కర్లో నీళ్లెన్ని పోయాలో అడిగాను. పప్పు చేయడానికి కూడా అదే పద్ధతని చెప్పింది. అరగంటలో వంట రెడీ అయిపోయింది. మేం ఇద్దరం తింటుంటే తనొచ్చింది. ‘అమ్మా... నాన్న వంట చేశారు. నువ్వు కూడా మాతో తిను’ అని కొడుకన్న మాటలకు ఇంత మొహం చేసుకుని పళ్లెం అందుకుని అన్నం వడ్డించుకుంది. కొడుకు అడిగే వరకూ పొయ్యి దగ్గ-రికి వెళ్లలేదు నేను. నా కొడుకు అలా అడిగించుకోడు. మార్పుకున్న ప్రత్యేకతే అది కదా! - కమల్, దిల్షుక్నగర్ -
‘మగధీర’ దెబ్బకు చెయ్యి మడత పడింది!
పావలా ఇస్తే బిందెలు మోసిన బాహుబలి... ఎన్నోసార్లు మృత్యువుని ముద్దాడి వచ్చిన మగధీర... ఆకలి చేసిన మరమ్మత్తులతో రాటుదేలిన రోబో... కష్టాల్ని కూడా ఇష్టంగా తీసుకునే డార్లింగ్... పీటర్ హెయిన్ గురించి ఇంకా ఏం చెప్పాలి? ప్రతి క్షణం ఓ పోరాటం.. ప్రతి మలుపు ఓ పోరాటంపాణాలకు తెగించి మృత్యువుతో పోరాడడమే పీటర్ జీవితం! ఫైట్‌మాస్టర్ అంటే తనను తక్కువ చేసినట్టే! అతని సాహసం... అంకితభావం... మనుషుల పట్ల ఆరాటం... ఇవన్నీ తెలుసుకుంటే... అతను ఓ పోరాటయోధుడని ఎవరైనా ఇట్టే ఒప్పుకుంటారు. ఊహించని మలుపులతో సాగుతున్న ఆ జీవితం వెంట పీటర్ హెయిన్ మాటల్లోనే పయనిద్దాం... రండి... చెన్నయ్‌లోని వడపళనిలో మాదో చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లోనే అమ్మా, నాన్న, నానమ్మ, నేను, అక్క, చెల్లి... ఇంతమందిమి ఉండేవాళ్లం. మా నాన్న పేరు పెరుమాళ్. ఊరు తమిళనాడు. అమ్మది వియత్నామ్. నేను పుట్టి, పెరిగింది మాత్రం చెన్నయ్‌లోనే. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున.. ఇలా స్టార్ హీరోల సినిమాలకు నాన్న ‘స్టంట్ మేన్’గా పనిచేసేవారు. షూటింగ్ ఉంటే డబ్బులొచ్చేవి. అది కూడా మా కుటుంబానికి సరిపడేంత వచ్చేవి కాదు. పైగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. అమ్మ బ్యూటీషియన్‌గా చేసేది. ఆమె నెల జీతం 300 రూపాయలు. జీవితమే నా పాఠశాల! చాలామందిలా నా బాల్యం పూలబాట కాదు. మంచి బట్టలుండేవి కాదు. ఆకలి బాధైతే ఎప్పుడూ ఉండేదే. ఒక్కోసారైతే నూకలతో చేసిన గంజి మాత్రమే తాగేవాళ్లం. ఆదివారం వస్తే, రెండే రెండు గుడ్లు వండేవాళ్లు. తలా ఓ ముక్క తినేవాళ్లం. కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితుల్లో నన్ను బడికి ఎలా పంపించగలుగుతారు? అలా నాకు పదేళ్లు వచ్చేశాయ్. కానీ, జీవితమే నాకు బోలెడన్ని పాఠాలు నేర్పించింది. చదవడం, రాయడం అన్నీ నాకు నేనుగా నేర్చుకున్నాను. చదివించకపోయినా, ‘బతకడం ఎలాగో’ నేర్పించిన మా అమ్మా నాన్న నా దృష్టిలో దేవుళ్లు. చిన్నప్పుడు నాకేదో ఆపరేషన్ జరిగింది. మా ఇంటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి 8 కిలోమీటర్లు. అప్పట్లో బస్సు టిక్కెట్కయ్యే 60 పైసలు కూడా మా దగ్గరుండేవి కాదు. దాంతో, ఉదయాన్నే ఇంటి దగ్గర నీళ్లు తాగేసి, ఎనిమిది కిలోమీటర్లూ నడుచుకుంటూ వెళ్లి, చెకప్ చేయించుకుని వచ్చేవాణ్ణి. పావలా కోసం బిందెడు నీళ్ళు మోసేవాణ్ణి! మా ఇంటి పక్కన ఓ టీ షాప్ ఉండేది. ఒక రోజు ‘రెండు బిందెలు నీళ్లు తెచ్చిపెడతావా?’ అని అడిగాడు టీ కొట్టు యజమాని. అప్పుడు నా దగ్గర పావలా కూడా లేదు. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఎవరెవరికి నీళ్లు కావాలో వాళ్ల దగ్గర బిందెకు పావలా చొప్పున తీసుకుని, నీళ్లు మోసుకెళ్లడం మొదలుపెట్టాను. సైకిల్ మీద నాలుగైదు బిందెలు పెట్టుకుని మెల్లిగా నెట్టుకుంటూ వెళ్లేవాణ్ణి. బతుకు తెరువు కోసం నీళ్లు మోయడంతో పాటు సర్వర్‌గా, మెకానిక్‌గా, వెల్డర్‌గా, టైలర్‌గా, వంట మనిషికి సాయం చేసే కుర్రాడిగా... ఇలా రకరకాల పనులతో బిజీగా ఉండేవాణ్ణి. చైనీస్ లుక్కే వరమైంది! మరోవైపు మా నాన్న దగ్గర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకునేవాణ్ణి. అప్పుడప్పుడూ మా నాన్నగారి స్టూడెంట్స్‌కి ఫైట్స్ నేర్పించేవాణ్ణి. అదృష్టం కొద్దీ ఓ సినిమాకి చైనా వాడిలా కనిపించే స్టంట్ మేన్ కావాల్సి వస్తే, నన్ను తీసుకెళ్లారు. నేను చేసిన ఫైట్స్‌కి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో స్టంట్ మేన్‌గా యూనియన్‌లో సభ్యత్వ కార్డ్ తీసుకున్నాను. సినిమాల్లోకి వచ్చిన ఏడాదికే కనల్ కణ్ణన్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా పని చేయడం మొదలుపెట్టాను. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. ‘మురారి’తో ఫైట్ మాస్టర్నై, తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలెన్నో చేశా. అంగ వికలాంగురాల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా! సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాకు వేరే జీవితం ఉంటుందనే విషయాన్నే మర్చిపోయా. అప్పటికి షూటింగ్లో చాలాసార్లు ప్రమాదాలకు గురయ్యా. ఓ రోజు నాన్న నన్ను పిలిచి, ‘ఇప్పటికే చాలాసార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నావ్. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే నీకు నలభై వచ్చేటప్పటికి పిల్లలు చిన్నవాళ్లవుతారు. నీకు జరగకూడనిది ఏదైనా జరిగితే, వాళ్లేమవుతారు’ అన్నారు. దాంతో, పెళ్లి చేసుకోవడానికి ఓకే కానీ.. అంటూ ఓ కండిషన్ పెట్టా. అందంగా ఉన్న అమ్మాయిలనూ, డబ్బున్నవాళ్లనూ ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. అందుకే, అంగ వైకల్యం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ, మా నాన్న గారు నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. కనీసం పేదింటి అమ్మాయినైనా పెళ్లాడతా అని చెప్పా. నన్ను కూడా ప్రేమిస్తారా? ఈ ప్రపంచంలో అందంగా ఉన్నవాళ్లని ఓ రకంగా, నాలా అందవిహీనంగా ఉన్నవాళ్లని మరో రకంగా చూస్తారు. ఇక, నన్నెవరు ప్రేమిస్తారు? ‘కావ్య తలైవన్’ అనే తమిళ సినిమా కోసం స్టంట్ మేన్‌గా చేస్తున్నప్పుడు ఓ వ్యక్తితో పరిచయం అయింది. ఓ సారి మా ఇంటికి తీసుకెళితే, తనకో చెల్లెలుందని తెలిసి, మా అమ్మ ఆరా తీసింది. వాళ్లూ మా లాంటివాళ్లే. వాళ్ళ నాన్న భారతీయుడు. వృత్తి రీత్యా వియత్నామ్ వెళ్లినప్పుడు అక్కడి అమ్మాయిని ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నయ్‌లో స్థిరపడ్డారు. సాదాసీదా కుటుంబం. అందుకని వాళ్లతో సంబంధం కలుపుకుందామని అమ్మ అంటే, ఓకే అన్నా. వాళ్లు తమిళనాడులోని కారైక్కాల్‌లో ఉండేవాళ్లు. చెన్నయ్ నుంచి 390 కిలోమీటర్ల దూరం. నా ఫ్రెండ్‌ని తీసుకుని మోటార్‌బైక్‌లో ఆ ఊరెళ్లాను. దేవుడు ఇద్దరు దేవతలనిచ్చాడు! అప్పటికి తెల్లవారుజామున ఐదున్నర గంటలైంది. చిన్న గుడిసెలో నుంచి ఆ అమ్మాయి బయటికొచ్చి వాకిలి ఊడ్చి, అందంగా ముగ్గులేసింది. ఇంటిని సరిగ్గా చూసుకోగలదనే నమ్మకం కుదిరి, జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నా. ఆమె పేరు పార్వతి. చాలా మంచిది. ఆ దేవుడు నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇద్దరు దేవతలను ఈ భూలోకానికి పంపించాడేమో. ఒకరు మా అమ్మ.. మరొకరు నా శ్రీమతి. నా భార్యకు నేను తాజ్‌మహల్ కట్టించకపోయినా ఫర్వాలేదు.. నాలా ఆస్పత్రికి నడిచి వెళ్లే స్థితి మాత్రం తనకు, మా పిల్లలకు రాకూడదని, ఆర్థికంగా నేనో స్థాయికి వచ్చాకే పెళ్లి చేసుకున్నా. జాకీచాన్ వీరాభిమానిని! యాక్షన్ సన్నివేశాలను జాకీచాన్ చేసే తీరు నాకు చాలా ఇష్టం. ఓ రకంగా నేను ఆయనకు వీరాభిమానిననొచ్చు. కానీ ఆయనను అనుకరించడానికి యత్నించను. నేను ఆదర్శంగా తీసుకునేది కరాటే వీరుడు బ్రూస్లీనే. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. బ్రూస్లీ ఫైట్స్ చూసి చాలా నేర్చుకున్నా. బాత్రూమ్లో తనివి తీరి ఏడ్చా! శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా రూపొందిన ‘ముదల్వన్’ (తెలుగులో ‘ఒకే ఒక్కడు’) సినిమాకి నేను స్టంట్ మేన్‌ని. అప్పటికి నాకు పెళ్లయి ఓ రెండేళ్లు అవుతుందేమో! ఆ సినిమా కోసం ఒంటి మీద నూలు పోగు లేకుండా వీపుకు జెల్ రాసుకుని, పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని పై నుంచి కిందకు దూకే సీన్ తీయాలి. చాలా రిస్క్. ధైర్యం చేశాను. తీశాం కానీ, తృప్తికరంగా అనిపించలేదు. ‘మళ్లీ తీద్దాం సార్’ అని శంకర్ గారితో, ఫైట్‌మాస్టర్ కనల్ కణ్ణన్గారితో అన్నా. రిస్క్ కాబట్టి, ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. నాకు కూడూ గుడ్డా ఇచ్చిన వృత్తికి న్యాయం చేయాలంటే మళ్లీ తీయాల్సిందేనని పట్టుబట్టా. మర్నాడు తెల్లవారుజామున 2 గంటలకు ఆ సీన్ ప్లాన్ చేశాం. తీరా ముందు రోజు రాత్రి 12 గంటలకు ఇంటికెళ్లాను. నా భార్యను చూస్తే ఏడుపు ఆగలేదు. కానీ, తన ముందు ఏడిస్తే, కంగారుపడుతుందని దిగమింగుకున్నా. కాఫీ కావాలనడిగి, తను అటెళ్లగానే మా ఆరు నెలల బాబును గుండెలకు హత్తుకున్నా. బాత్రూమ్లోకెళ్లి, షవర్ ఓపెన్ చేసుకుని, తనివి తీరా ఏడ్చా. బయటికొచ్చిన తర్వాత నా కళ్లు చూసి, ‘ఏంట’ని నా భార్య అడిగితే, సబ్బు నురుగ పడిందన్నాను. ఇంట్లోనే హెల్మెట్ పెట్టుకున్నా! అర్ధరాత్రి రెండింటికి షూటింగైతే, ఇంట్లో ఉన్న ఆ రెండు గంటలూ నా మనసు మనసులో లేదు. రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికొస్తుంటే ఏడుపొచ్చేసింది. అది కనిపించకూడదని ఇంట్లోనే హెల్మెట్ పెట్టేసుకున్నా. మా ఆవిడ విచిత్రంగా చూసింది. బయటకు అడుగుపెట్టేటప్పుడు, ‘దేవుడా... నేను బతికితే ఓకే. ఒకవేళ ఏదైనా జరిగితే నా భార్యను, బిడ్డను నా అంతగా ప్రేమించే ఓ తోడునివ్వు. నేనిప్పటివరకు అన్నీ మంచి పనులే చేశాను కాబట్టి, స్వర్గానికి పంపించు. పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత నా భార్యను నా వద్దకు పంపించు’ అని వేడుకున్నాను. లొకేషన్‌కి వెళ్లిన తర్వాత నా భార్యకు ఫోన్ చేసి, ‘షూటింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళతా. అక్కడికెళ్లిన తర్వాత కాల్ చేస్తా. లేకపోతే నా నుంచి కాల్ రాదు. నువ్వే చెయ్యాలి’ అని చెప్పా. దానర్థం నాకు మాత్రమే తెలుసు. ఇక ప్రాణాలకు తెగించకూడదనుకున్నా! షూటింగ్‌కి రెడీ అయి... గుండె దిటవు చేసుకుని మేడ పెకైక్కా. ఒంటి మీద బట్టలు తీసి, వీపుకు జెల్ రాయించుకుని, పెట్రోల్ పొయ్యమన్నాను. నిప్పంటించగానే కిందకు ఒక బాక్సులోకి దూకాలన్నమాట. దూకాను... ఆ పెట్టెలో నుంచి నన్ను తీసి, మంటలార్పడానికి బెడ్‌షీట్‌తో నా వీపు మీద రుద్దారు. దాంతో చర్మం ఊడొచ్చింది. కానీ, బతికాం కదా అని సంబరపడిపోయా. ఆ తరువాత పాన్‌కేక్‌తో వీపు మీద మేకప్ చేశాక, మరో షాట్ కోసం అలాగే మంటలతో కిందే పరిగెత్తా. ఏదైనా రిస్కే కదా! అయినా చేశా. ఆ రోజుకు నా పారితోషికం ఎంతో తెలుసా? మూడు వేలు. అందులో కొంత యూనియన్‌కి వెళ్లిపోతుంది. ఏమైనా.. ప్రాణాలను పణంగా పెట్టకూడదనీ, లేనిపోని వాగ్దానాలు చేయకూడదనీ ఆ రోజు నిర్ణయించుకున్నా. ‘మగధీర’ దెబ్బకు చెయ్యి మడతపడిపోయింది! ఇలా మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన సంఘటనలు ఇంకా ఉన్నాయి. ‘మగధీర’లో బైక్‌తో పోటీ సన్నివేశం తీసేటప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ తప్పడంతో పడ్డాను. గడ్డం దగ్గర బాగా దెబ్బ తగిలింది. చెయ్యి వెనక్కి మడతపడిపోయింది. ఎముక అటూ ఇటూ అవడంతో చెయ్యి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తే, వెనక్కి వెళ్లేది. ఆస్పత్రికి వెళ్లేవరకు నా మనసు మనసులో లేదు. అంతకుముందు రెండు, మూడుసార్లు వెన్నెముకకు దెబ్బ తగిలింది. దాంతో ఆస్పత్రికి వెళ్లగానే, ‘నా వెన్నెముక బాగానే ఉంది కదా. ముందు అది చూడండి. ఆ తర్వాత చికిత్స చేయొచ్చు’ అన్నా. డాక్టర్లు స్కానింగ్ తీసి, బాగానే ఉందన్నాక, ఊపిరి పీల్చుకున్నాను. స్నానం చేస్తుంటే పక్షవాతంతో కుప్పకూలా! పెద్ద పెద్ద ప్రమాదాలు ఎన్ని జరిగినా వెనకడుగు వేయలేదు. ఒకసారైతే ఓ షూటింగ్లో దెబ్బ తగిలింది. నేనేం పట్టించుకోలేదు. ఇంటికి రాగానే స్నానం చేద్దామని, షవర్ కింద నిలబడ్డా. తల మీద నీళ్లు పడగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయా. ఒక కాలు, చెయ్యి పని చేయలేదు. పక్షవాతం వచ్చింది. మరో కాలితో శరీరాన్ని ఈడ్చుకుంటూ ఎలాగోలా బయటికొచ్చాను. డాక్టర్లు లాభం లేదన్నారు. అన్నం తినిపించడం, స్నానం చేయించడం అంతా మా ఆవిడే. ఇక జీవితం అంతేనేమో అనుకున్నా. రెండు, మూడుసార్లు నడవడానికి ప్రయత్నించి, కిందపడేసరికి పళ్లు ఊడాయి. అలా 18 రోజులు విశ్వప్రయత్నాలు చేశాక కానీ, కాలూ చెయ్యి స్వాధీనంలోకి రాలేదు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. దేవుడే నన్ను కాపాడాడనుకున్నా. నేనంతే.. అదో టైప్! ఇవాళ కొంతమంది దర్శకుల కన్నా నా పారితోషికం ఎక్కువే. అంత మాత్రాన నా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయనుకుంటే పొరపాటే. పావలా కోసం పని చేసినవాణ్ణి. చెత్త నుంచి పైకొచ్చినవాణ్ణి. ఇవాళ చేతిలో రూపాయి లేకపోయినా బతకగలను. నాదో చిత్రమైన శైలి. ఒక్కోసారి 30 రూపాయల భోజనం తింటా. కొన్నిసార్లు అందుకు భిన్నంగా విమానంలో వియత్నామ్ వెళ్లిపోయి, భోజనం కోసం రెండు, మూడు లక్షలు ఖర్చు చేస్తా. కంపోజ్ చేసే ఫైట్స్లానే నేనూ కొత్తగా, విచిత్రంగా కనిపించాలనుకుంటా. అందుకే, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటుంటా. ఒకసారి రింగుల జుట్టు, మరోసారి పొడవాటి జుట్టు... ఇలా స్టయిల్ మార్చేస్తుంటా. సంపాదనలో పావు భాగం వృద్ధులకు, పిల్లలకు..! ఇవాళ నేనో లక్ష రూపాయలు సంపాదిస్తే, అందులో పావు వంతు వృద్ధాశ్రమాలకూ, అనాథాశ్రమాలకూ ఇచ్చేస్తా. వృద్ధాశ్రమానికి ఇవ్వడానికి కారణం మా నాన్నమ్మ. నాకు పదమూడేళ్లప్పుడు ఆమె చనిపోయింది. మూడేళ్లు పక్షవాతంతో బాధపడింది. తనకు స్నానం చేయించేవాణ్ణి. అన్నం తినిపించేవాణ్ణి. నాన్నమ్మ పక్కన ఎవరో ఒకళ్లు ఉంటే మంచిదనిపించి, ఆ మూడేళ్లు నేను పెద్దగా బయటకు వెళ్లేవాణ్ణి కాదు. మా అమ్మా నాన్నల కన్నా నాకు నాన్నమ్మే ఎక్కువ. తనలాంటివాళ్లు వృద్ధాశ్రమాల్లో ఉంటారు కాబట్టే, విరాళం ఇస్తుంటాను. అలాగే, చిన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డప్పటికీ, అమ్మానాన్న, అక్కాచెల్లెళ్ల ప్రేమ నాకు లభించింది. ఇక, వాళ్లు కూడా లేనివాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో? అందుకే అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తుంటా. లక్ష సంపాదించినప్పుడు నా అవసరాలకు 80 వేలు కావాలనుకోండి.. అప్పుడు కూడా 75 వేలే ఉంచుకుని, 25 వేలు ఆశ్రమాలకు ఇచ్చేస్తా. తదుపరి పారితోషికంలో ఆ 5 వేలు తీసుకుంటా. ఇవాళ అందరూ నన్ను ‘స్టార్ ఫైట్ మాస్టర్’ అని అంటూ ఉంటారు. కానీ, నిజం చెప్పాలంటే మా నాన్న గారు నా కన్నా గొప్ప. నేనీ స్థాయిలో ఫైట్స్ చేస్తున్నానంటే, నాకు శిక్షణనిచ్చిన మా నాన్న ఏ స్థాయిలో చేసి ఉండేవారో ఊహించవచ్చు. మంచి అవకాశాలొచ్చాయి కాబట్టి నేను నిలదొక్కుకున్నా. ఇలాంటి అవకాశాలు వచ్చి ఉంటే మా నాన్న గారు ‘తిరుగులేని ఫైట్ మాస్టర్’ అనిపించుకుని ఉండేవారు. మా పిల్లలు ఫైట్స్ మానేయమంటారు! నాకు ఓ బాబు, పాప. ప్రస్తుతం బాబు ప్లస్ టూ, పాప ఆరో తరగతి చదువుతున్నారు. సినిమాలు, కుటుంబం మినహా నాకు మరో యావ లేదు. నాది రిస్కీ లైఫ్. ఏ క్షణాన ఏం జరుగుతుందో నాకే తెలియదు కాబట్టి, నా పేరు మీద ఆస్తులు కూడా ఉంచుకోను. అన్నీ నా భార్య పేరు మీదే పెట్టేశా. షూటింగ్లో నాకు బాగా దెబ్బలు తగిలినప్పుడు నా భార్య, పిల్లలు నన్ను తాకడానికి కూడా చాలా భయపడతారు. నాకు నొప్పి కలుగుతుందేమోనని వారి భయం. కానీ, ఆ సమయంలో వాళ్లు ముగ్గురూ నా బుగ్గ మీద ఇచ్చే ముద్దు... కాసేపు నా నొప్పిని మాయం చేసేస్తుంది. అందుకే అంటాను... ముద్దు విలువ నొప్పి కన్నా ఎక్కువ అని! ‘మా డాడీ గొప్ప ఫైట్‌మాస్టర్’ అని మా పిల్లలు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ, షూటింగ్లో నాకయ్యే గాయాలు చూసి, పిల్లలు ‘డాడీ.. ఫైట్స్ మానేయవా..’ అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. మా అబ్బాయి పెద్దయిన తర్వాత ఫైట్ మాస్టర్‌గా చేస్తానంటే నేనొప్పుకోను. వాస్తవానికి యాక్షన్ అనేది నాకు తగిన వృత్తి కాదు. బతకడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఈ రంగంలోకి వచ్చాను. కానీ, నా బిడ్డలకు ఆ అవసరం లేదు. వాళ్లకి నేను మంచి జీవితమిచ్చా. (ఒకింత ఉద్వేగానికి గురవుతూ.....) నేను ఎన్ని కష్టాలైనా అనుభవించగలను కానీ, నా బిడ్డల కష్టాలు చూసి, తట్టుకునేంత ఆత్మస్థయిర్యం మాత్రం నాకు లేదు. - డి.జి. భవాని మేమూ మనుషులమే! ఫైటర్లూ మనుషులే అని కొంతమంది దర్శక, నిర్మాతలు అనుకోరు. ప్రమాదభరితమైన ఫైట్లను హీరోలకు బదులుగా ఫెటర్లే చేస్తుంటారు. అలాంటి సమయంలో ఫైటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా దర్శక, నిర్మాతలు సమయం ఇవ్వరు. స్టార్లకేమో మామూలుగా కూడా ఎలాంటి నిబంధనలూ ఉండవు. వాళ్లు మేకప్ చేసుకునేవరకు ఆగుతారు. కాఫీలు, టీలు తాగడానికి కోరినంత టైమ్ ఇస్తారు. కానీ, ఒక జీవితం క్షేమంగా ఉండటం కోసం మాకు మాత్రం టైమ్ ఇవ్వరు. నాకిలాంటివి బోలెడన్ని ఎదురయ్యాయి. అందుకే, నా అసిస్టెంట్ల విషయంలో అలా జరగకుండా చూసుకుంటా. ఎంత సమయమైనా సరే జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే షాట్ తీద్దామని చెబుతా. ఆ 24 గంటలు నేనెవరో నాకే తెలియదు! నేను స్టంట్ మేన్‌గా చేస్తున్న రోజులవి. ఓ షూటింగ్లో వేగంగా వెళుతున్న కారులో నుంచి అమాంతంగా దూకాలి. కానీ, నేను దూకిన చోట రాయి ఉండటంతో అది నా తలకు తగిలింది. అయితే పెద్దగా నొప్పి లేకపోవడంతో పట్టించుకోలేదు. కాసేపు బాగానే ఉన్నాను. కానీ, ఆ తర్వాత యూనిట్ సభ్యులతో ‘నేనెక్కడున్నాను’ అని అడగడంతో షాకయ్యారట. నా బైక్ దగ్గరే నిలబడి ‘నా బండి ఎక్కడుంది?’ అని అడగడంతో ఏదో తేడా జరిగిందని గ్రహించారట. ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి అడ్రసడిగితే.. ఏవేవో పేర్లు చెప్పానట. ఇంటికెళ్లిన తర్వాత కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడటంతో అమ్మకు భయమేసి హాస్పటల్‌కి తీసుకెళ్లిందట. అప్పుడు మెదడులో ఓ చోట రక్తం గడ్డ కట్టుకుపోయిందని చెప్పి, డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత నేను మామూలు మనిషిని అయ్యానని అమ్మ చెప్పింది. ఆ 24 గంటలు నేనెవరో నాకే తెలియదు. -
రిలీజ్‌కు సిద్ధమైన విశ్వరూపం-2
-
పద్మభూషణుడికి అభినందనలు
తమిళసినిమా, న్యూస్‌లైన్ : ఐదేళ్ల నుంచి ఆరు పదుల వరకు సినీ కళామతల్లికి విశేష సేవలందిస్తున్న వారెవరైనా ఉన్నారంటే వారిలో ఆద్యుడు కమలహాసన్. కళామతల్లి ఆరాధ్యుడు. నటననే శ్వాసిస్తూ నటన అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా జీవిస్తున్న కమలహాసన్‌కు అత్యుత్తమ అవార్డులు వరించడంలో విశేషం ఏముంది. అవార్డులకే అలంకారంగా మారిన ఈ సకల కళా వల్లభుడు చేయని పాత్ర ఉందనే సాహసం ఎవరూ చేయలేరు. ఇప్పటికే గౌరవ డాక్టరేట్, కలైమామణి, ఫిలింఫేర్, పద్మశ్రీ వంటి అవార్డులకు సొంతం చేసుకున్న కమలహాసన్ తాజాగా పద్మభూషణ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. నటనకు నడకలు నేర్పే కమలహాసన్‌కు పద్మభూషణ్ రావడంపై పలువురు చిత్ర ప్రముఖులు శుక్రవారం అభినందనల జల్లు కురిపించారు. ఆయన్ను అభినందించిన వారిలో సీనియర్ దర్శకుడు ఎస్పి ముత్తురామన్, ప్రభు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉదయనిధి స్టాలిన్, నిర్మాత టి.శివ, త్యాగరాజన్, జ్ఞానవేల్రాజ, వెంకట్ ప్రభు, సుబ్బు, ధరణి, రచయిత వెన్నెల కంటి, శశికుమార్, కార్తీక్‌రాజా, ఎస్.వి.శేఖర్, క్రేజీ మోహన్ తదితరులు ఉన్నారు. -
చాటింగ్ గీతాలు
అభినయ్‌కృష్ణ, సునీత జంటగా.. టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘చాటింగ్’. జయంత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, మంత్రి రుద్రరాజు పద్మరాజుకి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. హీరో అభినయ్ ఈ సినిమాకోసం ఎన్నో సాహసాలు చేశాడని దర్శకుడు అభినందించారు. ఇంకా నిర్మాత అశోక్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.