రూ.100 కోట్లు కోరుతూ నోటీసులు
తమిళసినిమా (చెన్నై): తమిళనాట బిగ్‌బాస్ రియాలిటీ షో వ్యవహారంలో నటుడు కమలహాసన్, నటి గాయత్రీరఘురామ్‌పై రూ.100 కోట్లు పరువు నష్టం కోరుతూ పుదియ తమిళ కట్చి నేత డా.కృష్ణస్వామి నోటీసులు పంపారు. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా విజయ్ టీవీ సంస్థ నిర్వహిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలో నటి, నృత్య దర్శకురాలు గాయత్రీరఘురామ్ ఒక సందర్భంలో అలగాజన ప్రవర్తన.. అంటూ వ్యాఖ్యలు చేశారనీ, అవి ఒక జాతిని కించపరచేలా ఉన్నాయని, వాటిని ఎడిట్ చేయకుండా అలానే ప్రసారం చేశారనీ కృష్ణస్వామి ఆదివారం కోయంబత్తూరులో విలేకరుల సమావేశంలో చెప్పారు.
వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరగా, రెండు వారాలు గడిచినా వారు స్పందించకపోవడంతో న్యాయవాది ద్వారా శనివారం నోటీసులు పంపినట్లు తెలిపారు.
కమల్, గాయత్రీరఘురామ్‌కు నోటీసులు
Published Mon, Jul 31 2017 3:37 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM
Advertisement
Advertisement