స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేశాడు. జిలేబి అంటూ నేడు తండ్రీకొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..
కథ
జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కాలేజ్ చదువుకునే కుర్రాళ్లు హాస్టల్‌లో ఉంటారు. ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ. కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో ఎలా పరిచయం ఏర్పడింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీరిద్దరి మధ్యలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేస్తాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి నటనకు వంక పెట్టే అవకాశమే ఉండదు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారంతా కూడా ఆకట్టుకున్నారు.
విశ్లేషణ
విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తనదైన స్టైల్‌లో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపిస్తాయి. బాయ్స్ హాస్టల్‌లోకి హీరోయిన్ వచ్చిన దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
ప్రథమార్దంలో పాత్రల పరిచయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలో చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు. చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ.. బాగున్నాయి కానీ సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను ఎక్కువ సాగదీయడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్‌పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
చదవండి: Bigg Boss 7 Nagarjuna Remuneration: బిగ్‌బాస్ కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment