gayathri raghuram
-
బరిలో నువ్వుంటే.. ప్రత్యర్థి నేనే!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు నియోజవర్గం ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు సినీ నటి గాయత్రి రఘురాం సవాల్ విసిరారు. పోటీ చేస్తే, ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. వివరాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సినీ నటి గాయత్రి రఘురాం మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నామలైను టార్గెట్ చేసి గాయత్రి తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా అన్నామలైకు ఆమె ఓ సవాలు విసిరారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం ప్రసుత్తం ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఉప ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ కుటుంబం హవా నడుస్తుండటం, మరణించిన ఎమ్మెల్యే తిరుమగన్ ఆయన కుమారుడు కావడం గమనార్హం. దీంతో ఆయన కుటుంబం నుంచి ఉప ఎన్నికల బరిలో ఎవరైనా దిగుతారేమోననే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ నియోజకవర్గ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అన్నామలై నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సవాల్ విసురుతూ గాయత్రి ట్విట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికలలో పోటీకి ధైర్యం ఉందా..? ఉంటే పోటీకి స్వయంగా సిద్ధం కావాలని అన్నామలైను కోరారు. ఉప ఎన్నిక బరిలో అన్నామలై ఉంటే ప్రత్యరి్థగా తాను ఉంటానని స్పష్టం చేశారు. ఆయన నాటకాలు, కపట ప్రచారాలు ఢిల్లీ పెద్దలు నమ్మవచ్చేమోగానీ ఇక్కడ చెల్లవని వ్యాఖ్యానించారు. తాను తమిళనాడు ఆడ బిడ్డనని, అన్నామలై తమిళగం పుత్రుడు అని పేర్కొన్నారు. తమిళనాడు గొప్పదా..? తమిళగం.. గొప్పదా..? అనేది తేల్చుకుందాం రా.. అంటూ ట్వీట్ చేశారు. -
కుష్బూ నువ్వు ఎప్పుడైనా నిజాలు మాట్లాడావా?
చెన్నై,పెరంబూరు: నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుష్బూపై బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీరఘురామ్ ఫైర్ అయ్యారు. పౌరసత్వ బిల్లుపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు చట్ట సభల్లో మాటల దాడి చేస్తుంటే మరి కొందరు మీడియా ద్వారా ఆరోపణలు, ప్రతిఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా కుష్బూ, గాయత్రి రఘరామ్ లాంటి వారు ట్విటర్ వార్‌కు దిగుతున్నారు. నటి కుష్బూ పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్విట్టర్లో రాష్ట్ర బీజేపీ నాయకుడు హెచ్.రాజాపై దాడి చేశారు. దీంతో బిజేపీ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కుష్బూ ట్వీట్‌పై బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీరఘురామ్ స్పందిస్తూ ట్విటర్లో ఎదురుదాడి చేసింది. అందులో నువ్వు ఎప్పుడైనా నిజాలు మాట్లాడావా? అన్నీ అబద్దాలే అని విమర్శించించారు. నీలాంటి అసత్యవాదులకు,కాంగ్రెస్ నాయకులకు విమర్శించే హక్కులేదని గాయత్రీ రఘురామ్ పేర్కొంది. -
బీజేపీకి గుడ్‌బై.. నటి
తమిళనాడు, పెరంబూరు: నటి గాయత్రి రఘురాం బీజేపీకి గుడ్‌బై చెప్పారు. జరుగుతున్న రాజకీయ పోకడలను దుయ్యపట్టారు. దివంగత ప్రముఖ నృత్యదర్శకుడు రఘురాం కూతురు గాయత్రిరఘురాం. 2002లో చార్లిచాప్లిన్ అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తరువాత పలు చిత్రాల్లో నటించారు. యాదుమాగి నిండ్రాయ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు కూడా. కాగా 2017లో బిగ్‌బాస్ రియాలిటీ షో పోటీలో పాల్గొని పాపులర్ అయిన గాయత్రీరఘురాం వివాదాంశ చర్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ మధ్య రాష్ట్ర బీజేపీ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తిగతంగా పలు వివాదాల్లో చిక్కుకున్న గాయత్రీ రఘురాంను ఆ పార్టీ అధ్యక్షురాలు తమిళరసి సౌందరరాజన్ ఆమె తమ పార్టీలోనే లేరని పలుమార్లు చెప్పారు. దీనికి గాయత్రీ రఘురాం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం తన ట్విట్టర్లో పేర్కొని మరోసారి వార్తల్లోకెక్కారు. దీని గురించి గాయత్రి రఘురాం పేర్కొంటూ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఇప్పుడు వాగ్వాదాలకు, కేవలం ఇతరులపై ఆరోపణలు చేయడం వంటి చర్యలతో దిగజారిపోయిందన్నారు. ఇలా పిల్లల గొడవలా రాజకీయాలు తయారయ్యాయని ఆరోపించారు. ఇక్కడ మార్గదర్శకంగా ఉండే అనుభవంతులైన నేతలు లేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా బాగు పడే లక్షణాలేవీ కనపడడం లేదని, మన దేశ తలరాతను మార్చగలమనే నమ్మకం తనకు కలగడం లేదని పేర్కొన్నారు. అందుకే తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిందన్నారు. ఇందుకు తనకు తానే విచారం వ్యక్తం చేసుకుంటున్నానన్నారు. ఇది తన వ్యక్తగత అభిప్రాయం అని పేర్కొన్నారు. సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే అధికంగా నట చక్రవర్తులు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నకలీ పోరాటయోధులు, నకిలీ నాయకులు, నకిలీ కార్యకర్తలే ఇక్కడ అధికం అని దుయ్యబట్టారు. అలా 24 గంటలు నటించడం తన వల్ల కాదని అన్నారు. సమయం వచ్చినప్పుడు తాను అంకితభావంతో, విశ్వాసంతో ఉంటానని చెప్పారు. విలన్ పాత్ర మాదిరి రాజకీయవాది అన్నది విలన్ పాత్రలా తయారైందన్నారు. దురాశ, కుయుక్తులు అంటూ అంతా తారుమారుగా మారిపోయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రస్తుతానికి బయట ఉండి అంతా గమనిస్తూ, పరిశోధన చేసి మరింత నేర్చుకోవాలని భావిస్తునట్లు చెప్పారు. అందుకే రాజకీయాలకు విరామం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాజకీయాల్లో ముమ్మరంగా దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు అన్నారు. అలాంటి సమయం వచ్చినప్పుడు చురుగ్గా పాల్గొంటానని, ప్రస్తుతానికి తానే పార్టీకి మద్దతు తెలపడం లేదని గాయత్రి రఘురాం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. -
ఆ అలవాటు ఆడ, మగ ఇద్దరికీ చెడే..
తమిళసినిమా: నటుడు కమలహాసన్ వ్యాఖ్యలను నటి గాయత్రీ రఘురాం తీవ్రంగా ఖండించింది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో వ్యవహారం రోజూ ఏదో ఒక గొడవకు తెరలేపుతోంది. బిగ్‌బాస్ గేమ్ షోకు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోని మహిళలకు క్లాస్ తీసుకున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై నటి గాయత్రీ రఘురాం కమల్‌ను విమర్శించింది. మహిళలు సిగరెట్లు కాల్చడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి అంశాల గురించి కమలహాసన్ స్పందిస్తూ, మగవాళ్లు చేసే పనులు మహిళలు చేయకూడదని, మనకు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నటి గాయత్రీ రఘురాం తప్పు పట్టింది. దీని గురించి ఆమె బుధవారం తన ట్విట్టర్లో పేర్కొంటూ మహిళలు సిగరెట్లు కాల్చడం వల్ల మగవారి కంటే గొప్పవారిగా వారు భావించడం లేదని, మగవారి లానే మహిళలు మానసిక ఒత్తిడి, మనోవేదన కారణంగానే సిగరెట్లు కాలుస్తున్నారని, అయితే ఈ అలవాటు ఆడ, మగ ఇద్దరికీ చెడేనని పేర్కొంది. అయితే మగవారు గొప్పవారని, స్త్రీలు వారిని కాపీ కొడుతున్నారన్న ధోరణిలో కమలహాసన్ మాట్లాడడం సరికాదని ఘాటైన విమర్శలు చేసింది. గాయత్రీ గత ఏడాది బిగ్‌బాస్ గేమ్ షోలో పాల్గొన్నదన్నది గమనార్హం. -
బిగ్ బాస్‌కు హైకోర్టు నోటీసులు
కోలీవుడ్ లో బిగ్ బాస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థల నుంచి వ్యతిరేకతతో పాటు, కేసులను కూడా ఎదుర్కొంటున్న ఈ షోకు మద్రాస్ హై కోర్ట్ మరో షాక్ ఇచ్చింది. షోలో తమిళ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపిస్తూ వేసిన కేసులో కమల్ హాసన్ తో పాటు విజయ్ టీవీకి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల షోలో భాగంగా పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్.. మరో పార్టిసిపెంట్ను అలగాజన ప్రవర్తన (మురికివాడలో ఉండే వ్యక్తి) అని తిట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వారం రోజుల్లోగా గాయత్రి రఘురామ్ తో పాటు కమల్ క్షమాపణ చెప్పాలని కోరినా.. వారి స్పందించకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు కమల్ హాసన్ తో పాటు వివాదానికి కారణమైన గాయత్రి రఘురామ్, కార్యక్రమ నిర్వాహకులు దీపక్ ధర్ స్టార్ విజయ్ టీవీ జనరల్ మేనేజర్ అజయ్ విద్యా సాగర్ లకు నోటీసులు జారి చేసింది. -
బిగ్ బాస్‌కు షాక్ : వందకోట్లకు పరువు నష్టం దావా
కోలీవుడ్ లో బిగ్ బాస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థల నుంచి వ్యతిరేకతతో పాటు, కేసులను కూడా ఎదుర్కొంటున్న ఈ షో. తాజాగా మరో వివాదానికి కారణమైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్, పార్టిసిపెంట్ గాయత్రి రఘురామ్‌పై వంద కోట్లకు పరువు నష్టం దావా దాఖలైంది. షోలో భాగంగా పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్.. మరో పార్టిసిపెంట్ను అలగాజన ప్రవర్తన (మురికివాడలో ఉండే వ్యక్తి) అని తిట్టడంపై పుతియ తమిళగమ్ సంఘం సభ్యులు ఫైర్ అయ్యారు. ఈ మాటలతో సమాజంలో ఉన్న పేద వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. కమల్ హాసన్, ఈ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పకపోవడంపై కూడా వారు ఘాటుగా స్పందించారు. కమల్ ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన సరిగా స్పందించలేదని ఆరోపించారు. వారం రోజుల్లోగా కమల్, గాయత్రిలు క్షమాపణ చెప్పక పోతే వంద కోట్లు పరువు నష్టం కింద ఇవ్వాలని పుతియ తమిళగమ్ సంఘం నేత డాక్టర్ క్రిష్ణస్వామి డిమాండ్ చేశారు. -
కమల్, గాయత్రీరఘురామ్‌కు నోటీసులు
రూ.100 కోట్లు కోరుతూ నోటీసులు తమిళసినిమా (చెన్నై): తమిళనాట బిగ్‌బాస్ రియాలిటీ షో వ్యవహారంలో నటుడు కమలహాసన్, నటి గాయత్రీరఘురామ్‌పై రూ.100 కోట్లు పరువు నష్టం కోరుతూ పుదియ తమిళ కట్చి నేత డా.కృష్ణస్వామి నోటీసులు పంపారు. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా విజయ్ టీవీ సంస్థ నిర్వహిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలో నటి, నృత్య దర్శకురాలు గాయత్రీరఘురామ్ ఒక సందర్భంలో అలగాజన ప్రవర్తన.. అంటూ వ్యాఖ్యలు చేశారనీ, అవి ఒక జాతిని కించపరచేలా ఉన్నాయని, వాటిని ఎడిట్ చేయకుండా అలానే ప్రసారం చేశారనీ కృష్ణస్వామి ఆదివారం కోయంబత్తూరులో విలేకరుల సమావేశంలో చెప్పారు. వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరగా, రెండు వారాలు గడిచినా వారు స్పందించకపోవడంతో న్యాయవాది ద్వారా శనివారం నోటీసులు పంపినట్లు తెలిపారు.