బిగ్ బాస్కు హైకోర్టు నోటీసులు | Kamal Haasan, Star Vijay TV served legal notice | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్కు హైకోర్టు నోటీసులు

Published Fri, Aug 4 2017 12:56 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

బిగ్ బాస్కు హైకోర్టు నోటీసులు

బిగ్ బాస్కు హైకోర్టు నోటీసులు

కోలీవుడ్ లో బిగ్ బాస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థల నుంచి వ్యతిరేకతతో పాటు, కేసులను కూడా ఎదుర్కొంటున్న ఈ షోకు మద్రాస్ హై కోర్ట్ మరో షాక్ ఇచ్చింది. షోలో తమిళ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపిస్తూ వేసిన కేసులో కమల్ హాసన్ తో పాటు విజయ్ టీవీకి హై కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇటీవల షోలో భాగంగా పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫ‌ర్ గాయ‌త్రి ర‌ఘురామ్‌.. మ‌రో పార్టిసిపెంట్ను అలగాజన ప్రవర్తన (మురికివాడలో ఉండే వ్యక్తి) అని తిట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వారం రోజుల్లోగా గాయత్రి రఘురామ్ తో పాటు కమల్ క్షమాపణ చెప్పాలని కోరినా.. వారి స్పందించకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు కమల్ హాసన్ తో పాటు వివాదానికి కారణమైన గాయత్రి రఘురామ్, కార్యక్రమ నిర్వాహకులు దీపక్ ధర్ స్టార్ విజయ్ టీవీ జనరల్ మేనేజర్ అజయ్ విద్యా సాగర్ లకు నోటీసులు జారి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement