బిగ్ బాస్కు షాక్ : వందకోట్లకు పరువు నష్టం దావా | 100 crore defamation case filed against tamil Bigg Boss | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్కు షాక్ : వందకోట్లకు పరువు నష్టం దావా

Published Tue, Aug 1 2017 2:00 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

బిగ్ బాస్కు షాక్ : వందకోట్లకు పరువు నష్టం దావా

బిగ్ బాస్కు షాక్ : వందకోట్లకు పరువు నష్టం దావా

కోలీవుడ్ లో బిగ్ బాస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థల నుంచి వ్యతిరేకతతో పాటు, కేసులను కూడా ఎదుర్కొంటున్న ఈ షో. తాజాగా మరో వివాదానికి కారణమైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క‌మ‌ల్‌హాస‌న్‌, పార్టిసిపెంట్ గాయ‌త్రి ర‌ఘురామ్‌పై వంద కోట్లకు ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లైంది.

షోలో భాగంగా పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫ‌ర్ గాయ‌త్రి ర‌ఘురామ్‌.. మ‌రో పార్టిసిపెంట్ను అలగాజన ప్రవర్తన (మురికివాడలో ఉండే వ్యక్తి) అని తిట్టడంపై పుతియ త‌మిళ‌గ‌మ్ సంఘం స‌భ్యులు ఫైర్ అయ్యారు. ఈ మాటలతో స‌మాజంలో ఉన్న పేద వర్గాల మ‌నోభావాలు దెబ్బతిన్నాయ‌ని ఆరోపించారు. క‌మ‌ల్ హాస‌న్, ఈ వ్యాఖ్యల‌కు అభ్యంత‌రం చెప్పక‌పోవ‌డంపై కూడా వారు ఘాటుగా స్పందించారు.

కమల్ ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన సరిగా స్పందించలేదని ఆరోపించారు. వారం రోజుల్లోగా కమల్, గాయత్రిలు క్షమాపణ చెప్పక పోతే వంద కోట్లు ప‌రువు న‌ష్టం కింద ఇవ్వాల‌ని పుతియ త‌మిళ‌గ‌మ్ సంఘం నేత డాక్టర్ క్రిష్ణస్వామి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement