చెన్నై,పెరంబూరు: నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుష్బూపై బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీరఘురామ్ ఫైర్ అయ్యారు. పౌరసత్వ బిల్లుపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు చట్ట సభల్లో మాటల దాడి చేస్తుంటే మరి కొందరు మీడియా ద్వారా ఆరోపణలు, ప్రతిఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా కుష్బూ, గాయత్రి రఘరామ్ లాంటి వారు ట్విటర్ వార్‌కు దిగుతున్నారు. నటి కుష్బూ పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్విట్టర్‌లో రాష్ట్ర బీజేపీ నాయకుడు హెచ్.రాజాపై దాడి చేశారు. దీంతో బిజేపీ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కుష్బూ ట్వీట్‌పై బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీరఘురామ్ స్పందిస్తూ ట్విటర్‌లో ఎదురుదాడి చేసింది. అందులో నువ్వు ఎప్పుడైనా నిజాలు మాట్లాడావా? అన్నీ అబద్దాలే అని విమర్శించించారు. నీలాంటి అసత్యవాదులకు,కాంగ్రెస్ నాయకులకు విమర్శించే హక్కులేదని గాయత్రీ రఘురామ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment