లాస్‌ఏంజల్స్‌కు శభాష్ నాయుడు చిత్ర యూనిట్ | Chitra unit to Los Angeles Sabhash Naidu | Sakshi
Sakshi News home page

లాస్‌ఏంజల్స్‌కు శభాష్ నాయుడు చిత్ర యూనిట్

Published Fri, May 27 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

లాస్‌ఏంజల్స్‌కు   శభాష్ నాయుడు చిత్ర యూనిట్

లాస్‌ఏంజల్స్‌కు శభాష్ నాయుడు చిత్ర యూనిట్

కొత్తదనం కోసమో, లేక కథల డిమాండ్ వల్లనో మన చిత్ర నిర్మాతలు విదేశాలలో చిత్రీకరణకు బయలు దేరుతున్నారు.అయితే ఇందులో సాధక బాధకాలు ఎన్నో. ప్రఖ్యాత నటుడు,నిర్మాత లాంటి వారికి కూడా ఆటంకాలు తప్పడం లేదంటే చూడండి. విశ్వనాయకుడు తాజాగా తమిళం, తెలుగు, హిందీ భాషలో శభాష్ నాయుడు అనే చిత్రంలో నటిస్తూ లైకా సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చెన్నైలో చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం అమెరికాలోని లాస్‌ఏంజల్స్ చేరుకుంది. అయితే ఇందుకు ఆ యూనిట్ పలు అవరోధాలను ఎదుర్కొనవలసి వచ్చింది.


ఈ విషయాన్ని కమలహాసన్ ఒక లేఖ ద్వారా పేర్కొంటూ శభాష్‌నాయుడు చిత్ర బృందం సురక్షితంగా లాస్‌ఏంజల్స్ చేరుకుందన్నారు.అయితే ఇందుకు ఆదిలోనే పలు ఆటంకాలను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు.అలాంటి సవాళ్లను అధిగమించి అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు.ప్రతి చిత్ర నిర్మాణ సంస్థకు ఇలాంటి సమస్యలు ఎదురవ్వడం సర్వసాధారణ విషయంగా భావించాల్సి ఉంటుందన్నారు.ముఖ్యంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఎత్తున,బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్న శభాష్ నాయుడు లాంటి చిత్రాల నిర్మాణాలకు ఇలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయన్నారు. చెన్నైలోని అమెరికా కాన్సలెంట్ సహకారం మరువలేనిదన్నారు.వారు విదేశాలలో చిత్ర నిర్మాణం చేపడుతున్న తమ ప్రతి చిత్రానికి ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు.ఇదే విధంగా దక్షిణాదికి చెందిన ప్రతి చిత్ర నిర్మాణ సంస్థకు వారు ఎంతో సహాయ సహకారాన్ని అందుస్తున్నారని అన్నారు.ఇకపోతే ప్రతిభావంతులైన నటీనటులు,సాంకేతిక వర్గంతో శభాష్ నాయుడు చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కమలహాసన్ పేర్కొన్నారు.కాగా ఇందులో కమలహాసన్ ఆయన కూతురు శ్రుతిహసన్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.దీనికి సంగీతజ్ఞాని ఇళయరాజా స్వరాలు క డుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement