( ఫైల్ ఫోటో )
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంశక్తితో ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. తాజాగా రవితేజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నటుడు కమల్. 'సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో నేను హీరోగా మారా. అప్పటికి రవితేజ ఇంకా హీరో అవలేదు. ఇప్పుడెంత ఎనర్జీగా ఉండేవాడో అప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉండేవాడు. కాకపోతే కొద్దిగా లావుగా ఉండేవాడు. కానీ రవితేజ ఎంతో కష్టపడి తనను తాను మలుచుకుని ఇప్పుడున్న యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. 365 రోజులూ ఆయన ఎక్సర్‌సైజ్ చేస్తాడు.
ఈ మధ్యే ఆయన్ని కలిశాను. హైదరాబాద్‌లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలనుకుని వచ్చాను. ఆ తర్వాత వచ్చిందంతా బోనస్ అని నాతో చెప్పాడు. అలాంటి రవితేజ ఈరోజు రూ.12 కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నాడు' అని చెప్పాడు. కృష్ణవంశీ గారి డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో హీరోయిన్‌ను ఏడిపించే చిన్న సీన్‌లో రవితేజ నటించాడు. ఈ రోజు మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు అంటూ తన స్నేహితుడిపై ప్రశంసలు కురిపించాడు కమల్.
చదవండి: వసూళ్ల వర్షం కురిపిస్తున్న పఠాన్
జమున చాలా పొగరుబోతు, ఇంట్లోకి కూడా రానివ్వదు
Comments
Please login to add a commentAdd a comment