
అమ్మ, నాన్నను సంప్రదించం
మాకు సంబంధించిన ఏ విషయాన్ని మా అమ్మా నాన్నలను అడగం, సంప్రదించం కూడా అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇప్పుడు భారతీయ సినిమా అభిమానుల కలల రాణిగా ఎదుగుతున్న కథానాయకి ఈమె అని చెప్పవచ్చు.నటన అనేది శ్రుతిహాసన్ రక్తంలోనే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నటనలో వేళ్లూరుకు పోయిన కమలహాసన్, సారిక పుత్రికారత్నాలు శ్రుతిహాసన్, అక్షరహాసన్. శ్రుతి తమిళం, తెలుగు, హిందీ అంటూ ఏక కాలంలో టాప్ హీరోయిన్‌గా దుమ్మురేపుతున్నా రు. ఇటీవల విడుదలైన టాలీవుడ్ చిత్రం శ్రీమంతుడు ఈమె క్రేజ్‌ను మరింత పెంచిందని చెప్పక తప్ప దు. ఆ చిత్రంలోని ఆమె ఫొటోలను, నటించిన పాటల్ని ఇంటర్నెట్, యూట్యూబ్‌లలో అధికంగా చూ స్తున్నారని ఒక సర్వేలో తెలింది.
కాగా శ్రుతిహాసన్ ఇంత తక్కువ కాలంలో అంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆమె కుంటుబ నేపథ్యం కారణమనే అపోహ కొందరికి ఉండవచ్చు. అలాంటిదేమీ కాదని శ్రుతిహాసన్ మాటలు విన్నవారికి స్పష్టం అవుతుంది. ఇంతకీ ఈ టాప్ హీరోయిన్ ఏమంటున్నారో చూద్దాం. నటన, సంగీతం నాకు రెండు కళ్లు లాంటివి. చిన్నతనంలో అమ్మ సారిక నాకు సంగీతంపై ఆసక్తిని పెంపొందించి ప్రోత్సహించారు. అదే విధంగా నాన్న కమలహాసన్ నటనపై మోహాన్ని, ప్రపంచ సినీ అనుభవాన్ని రేకెత్తించారు. అలాంటి బలమైన పునాదినే నా చెల్లెలు అక్షర హాసన్‌కు ఇచ్చారు. అందువల్లే మేమిద్దరం మా పనుల్ని మేమే ఎవరి సహాయం లేకుండా సక్రమంగా చేసుకుపోతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనయినా స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలన్న నాన్న హితబోధనను పాఠిస్తున్నాం. కథలు వినడం,పారితోషికం మాట్లాడడం, కాల్‌షీట్స్ కేటాయించడం వంటి విషయాల్లో ఎవరి ప్రమేయం లేకుండా నేను,చెల్లెలు ఇష్టానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటాం. అమ్మానాన్నలు జోక్యం చేసుకోరు. అలాంటి స్వేచ్ఛను వారు మాకిచ్చా రు.
ఇక నాన్నతో కలిసి నటించే విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. అలాంటి అవకాశం ఇంతకు ముందొకసారి వచ్చింది. అప్పుడు నా కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాను. నాన్నతో కలిసి నటించాలనే ఆకాంక్ష నాకు ఉంది. మరోసారి అలాంటి అవకాశం వస్తే వదులుకోను. అలాగే నా చెల్లెలు తమిళంలో ఎప్పుడు నటిస్తుందన్నది తననే అడగాలి. అక్షర నాకంటే ప్రతిభ గల నటి. మంచి కథ అమిరితే మేమిద్దరం కలిసి నటిస్తాం.