
సాక్షి, చెన్నై: చేతిలో ఉన్న రెండు సినిమాల పూర్తికాగానే రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఓ తమిళ వారపత్రికకు కమల్ రాస్తున్న ధారావాహిక శీర్షికలో పలు విషయాలను ప్రస్తావించారు. సినిమాలు ముగించుకుని రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నానని అమెరికాలో తాను చేసిన ప్రకటన అక్కడి అభిమానులను ఆవేదనలో ముంచెత్తిందని తెలిపారు. అందరూ రాజకీయాల్లోకి వచ్చేపుడు తాను వస్తానని గతంలో చెప్పానని, ఆనాటి మాట ప్రకారం తాను వచ్చే సమయం ఆసన్నమైందని స‍్పష‍్టం చేశారు. మరోవైపు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment