భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. టేబుల్ టెన్నిస్‌కు అర్చన కామత్ రిటైర్మెంట్ ప్రకటించింది. 24 ఏళ్ల కామత్ ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్‌కు ఆమె వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని కామత్ కోచ్ అన్షుల్ గార్గ్ ధ్రువీకరించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కామత్ తన కెరీర్ గురుంచి చర్చించినట్లు అన్షుల్ తెలిపాడు.
"లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో పతకం సాధించడం చాలా కష్టమైన పని నేను కమత్‌కు చెప్పాను. అందుకోసం తీవ్రంగా శ్రమించివలసి ఉంటుంది. ఎందుకంటే ఆమె టాప్- 100 ర్యాంకు జాబితాలో లేదు.
అయితే గత రెండు నెలల్లో ఆమె చాలా మెరుగుపడింది. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి ఆమె నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు.
అయితే ఏ క్రీడలోనైనా అగ్రశ్రేణి ఆటగాళ్లకు సాధారణంగా ఎటువంటి సమస్య ఉండదు. వారికి అన్నిరకాల సపోర్ట్ ఉంటుంది. కానీ యువ ఆటగాళ్లు పరిస్థితి వేరు. వారికి శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎవరూ భరోశా ఇవ్వలేకపోతున్నారు.
అంతేకాకుండా వారు జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కమత్ తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్షుల్ పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో కమత్ పతకం సాధించికపోయినప్పటకి తన పోరాటంతో అందరిని ఆకట్టుకుంది.
ఒలింపిక్స్ చరిత్రలో భారత టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జర్మనీతో జరిగిన క్వార్టర్స్‌లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున గెలిచింది అర్చన మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment