Archana Kamath
-
ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. టేబుల్ టెన్నిస్‌కు అర్చన కామత్ రిటైర్మెంట్ ప్రకటించింది. 24 ఏళ్ల కామత్ ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్‌కు ఆమె వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని కామత్ కోచ్ అన్షుల్ గార్గ్ ధ్రువీకరించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కామత్ తన కెరీర్ గురుంచి చర్చించినట్లు అన్షుల్ తెలిపాడు. "లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో పతకం సాధించడం చాలా కష్టమైన పని నేను కమత్కు చెప్పాను. అందుకోసం తీవ్రంగా శ్రమించివలసి ఉంటుంది. ఎందుకంటే ఆమె టాప్- 100 ర్యాంకు జాబితాలో లేదు.అయితే గత రెండు నెలల్లో ఆమె చాలా మెరుగుపడింది. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి ఆమె నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు. అయితే ఏ క్రీడలోనైనా అగ్రశ్రేణి ఆటగాళ్లకు సాధారణంగా ఎటువంటి సమస్య ఉండదు. వారికి అన్నిరకాల సపోర్ట్ ఉంటుంది. కానీ యువ ఆటగాళ్లు పరిస్థితి వేరు. వారికి శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎవరూ భరోశా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా వారు జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కమత్ తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్షుల్ పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో కమత్ పతకం సాధించికపోయినప్పటకి తన పోరాటంతో అందరిని ఆకట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో భారత టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జర్మనీతో జరిగిన క్వార్టర్స్‌లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున గెలిచింది అర్చన మాత్రమే. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్‌ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
కామన్వెల్త్ బెర్తు కోసం కోర్టుకెక్కిన టీటీ ప్లేయర్లు
న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్‌లో మరో క్రీడాకారిణి కామన్వెల్త్ గేమ్స్ బెర్తు కోసం కోర్టుకెక్కింది. డబుల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన అర్చన కామత్ తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక విషయమై కోర్టుకెక్కిన నాలుగో ప్లేయర్ అర్చన. గతంలో దియా, మానుశ్ షా, స్వస్తిక ఘోష్‌లు కూడా కోర్టు తలుపు తట్టారు. ప్రస్తుతం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) వ్యవహారాలను పరిపాలక మండలి (సీఓఏ) పర్యవేక్షిస్తోంది. తొలుత టీటీఎఫ్ఐ సెలక్టర్లు అర్చనను ఎంపిక చేశారు. కానీ ఆమె ఇటీవలి ప్రదర్శన బాగోలేదంటూ బర్మింగ్‌హామ్ ఈవెంట్ నుంచి ఉన్నపళంగా తప్పించారు. చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి'.. మాజీ సైక్లింగ్ కోచ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు -
మనిక జంటకు కాంస్యం.. సాయిప్రణీత్ శుభారంభం.. రెండో రౌండ్లో సౌజన్య
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీలో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జంట కాంస్య పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 8–11, 6–11, 7–11తో చెంగ్ ఐ చింగ్–లియు జున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో మనిక–అర్చన తమ సర్వీస్‌లో ఏకంగా 16 పాయింట్లు కోల్పోయారు. ఇతర క్రీడాంశాలు.. సాయిప్రణీత్ శుభారంభం పారిస్: ఓర్లియన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అతను బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 21–19, 21–12తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కెయుర మోపాటి (భారత్) 21–16, 7–21, 15–21తో వెన్ జు జాంగ్ (కెనడా) చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండో రౌండ్లో సౌజన్య కాన్బెర్రా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సౌజన్య బవిశెట్టి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. జో హైవ్స్ (ఆస్ట్రేలియా)తో జరిగిన తొలి రౌండ్లో సౌజన్య తొలి సెట్‌ను 2–6తో కోల్పోయి, రెండో సెట్‌ను 6–4 తో గెల్చుకుంది. మూడో సెట్లో సౌజన్య 1–0 తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగింది. చదవండి: IPL 2022- RCB Vs KKR: బెంగ తీర్చిన హసరంగ -
ఒమన్ ఓపెన్ టీటీ టోర్నీ రన్నరప్ అర్చన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఒమన్ ఓపెన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి అర్చన కామత్ రన్నరప్‌గా నిలిచింది. మస్కట్‌లో శనివారం జరిగిన అండర్–21 మహిళల సింగిల్స్ ఫైనల్లో అర్చన 7–11, 8–11, 6–11తో ఒడో సాత్సుకి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో అర్చన 11–7, 11–5, 11–8తో గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్)పై, సెమీఫైనల్లో 6–11, 5–11, 11–2, 11–6, 11–9తో మరియా తైలకోవా (రష్యా)పై గెలిచింది. -
అర్చన శుభారంభం
కేప్‌టౌన్: ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల సింగిల్స్ విభాగంలో అర్చన కామత్ రెండో రౌండ్లోకి ప్రవేశించగా... మానవ్ వికాస్ ఠక్కర్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అర్చన కామత్ 11-7, 11-4, 11-4, 14-12తో అనా గార్సియా (స్పెయిన్)పై గెలుపొందగా... మానవ్ 10-12, 7-11, 11-6, 11-13, 11-13తో హొరాసియో సిఫుయెంటెస్ (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు.