
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఒమన్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అర్చన కామత్ రన్నరప్‌గా నిలిచింది. మస్కట్‌లో శనివారం జరిగిన అండర్–21 మహిళల సింగిల్స్ ఫైనల్లో అర్చన 7–11, 8–11, 6–11తో ఒడో సాత్సుకి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో అర్చన 11–7, 11–5, 11–8తో గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్)పై, సెమీఫైనల్లో 6–11, 5–11, 11–2, 11–6, 11–9తో మరియా తైలకోవా (రష్యా)పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment