
జమ్మూ: కేంద్రానికి ధైర్యముంటే శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో జాతీయ జెండాని ఎగురవేయాలని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని కేంద్రం, బీజేపీ మాట్లాడుతున్నాయి. ధైర్యం ఉంటే ముందుగా లాల్ చౌక్‌లో ఎగురవేయండి. పీవోకే భారత్‌లో అంతర్భాగం కాదన్నది వాస్తవం’ అని అన్నారు. భారతీయుల మనోభావాలను కించపరిచేందుకు ఇలాంటి వ్యాఖ్యలను తాను చేయడంలేదని చెప్పారు. ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment