నూతన సంవత్సరం-2024 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ శ్రేయస్సు, శాంతి, మంచి ఆరోగ్యం సమకూరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ‘ప్రతి ఒక్కరికీ 2024 అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, మెరుగైన ఆరోగ్యం సమకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అందరికీ సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. సమ్మిళిత, స్థిరమైన, అభివృద్ధికి దోహదపడే కొత్త నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం’ అని ఆమె ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఇలా రాశారు ‘ప్రతి భారతీయునికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను. భారతదేశ పురోగతి, శ్రేయస్సుకు దోహదపడే దృఢ నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం’ అని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘2024 నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని రాశారు. భారతదేశంతో పాటు ప్రపంచమంతా 2024కు ఘనంగా స్వాగతం పలికింది.
ఇది కూడా చదవండి: 2024.. దునియాలో ఏం జరగనుంది?
"Wishing everyone a splendid 2024": PM Modi extends New Year wishes to people
— ANI Digital (@ani_digital) January 1, 2024
Read @ANI Story | https://t.co/mlu0Wa1zb2#PMModi #NewYear #NewYears2024 pic.twitter.com/k4j6q3NyPn
Comments
Please login to add a commentAdd a comment