న్యూఢిల్లీ: బీహర్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో శారదా సిన్హా కుమారుడు అన్షుమన్ సిన్హాకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి, శారదా సిన్హా క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
శారదా సిన్హా ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త బ్రిజ్కిషోర్ సిన్హా మరణానంతరం శారదా సిన్హా ఆందోళనకు లోనయ్యారు. శారదా సిన్హాను బీహార్ కోకిల అని కూడా అంటారు. ఆమె భోజ్‌పురి, మైథిలి, మాగాహి జానపద గీతాలను ఆలపించడంలో పేరొందారు. శారదా సిన్హా బీహార్ సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారు. ఆమె పాడిన 'కహే తో సే సజ్నా','పెహ్లే పెహిల్ హమ్ కయేని' పాటలు ఎంతో ఆదరణ పొందాయి. శారదా సిన్హా 2018లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
ఇది కూడా చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన
Comments
Please login to add a commentAdd a comment