Sharda
-
ఆస్పత్రిలో ప్రముఖ జానపదగాయని.. పరామర్శించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బీహర్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో శారదా సిన్హా కుమారుడు అన్షుమన్ సిన్హాకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి, శారదా సిన్హా క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.శారదా సిన్హా ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త బ్రిజ్కిషోర్ సిన్హా మరణానంతరం శారదా సిన్హా ఆందోళనకు లోనయ్యారు. శారదా సిన్హాను బీహార్ కోకిల అని కూడా అంటారు. ఆమె భోజ్‌పురి, మైథిలి, మాగాహి జానపద గీతాలను ఆలపించడంలో పేరొందారు. శారదా సిన్హా బీహార్ సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారు. ఆమె పాడిన 'కహే తో సే సజ్నా','పెహ్లే పెహిల్ హమ్ కయేని' పాటలు ఎంతో ఆదరణ పొందాయి. శారదా సిన్హా 2018లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.ఇది కూడా చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన -
ఒకరికి ఒకరు ఊతమిచ్చుకున్నారు
వాళ్లిద్దరూ వికలాంగులు. పుట్టుకతోనే పోలియోబారిన పడి నడవలేని పరిస్థితి వారిది. పదేళ్ల క్రితం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కాళ్లు లేకున్నా ఆత్మవిశ్వాసంతో తమకు తాముగా నిలదొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతున్న ఆ జంటను చూసి అంతా అభినందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న బాలాజీనగర్ తండాకు చెందిన కాట్రోత్ శంకర్ పుట్టుకతోనే వికలాంగుడు. నడవలేకున్నా చేతులనే ఆధారం చేసుకొని ఇంటర్ వరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత సైకిల్ పంక్చర్ దుకాణం పెట్టుకుని జీవనం సాగించడం మొదలుపెట్టాడు. టీవీఎస్ మోపెడ్‌ను తనకు వీలుగా మరో రెండు చక్రాలు బిగింపజేసుకుని దానిపై ఊరూరు తిరుగుతూ సీజనల్ వ్యాపారాలు చేస్తుంటాడు. ఇష్టపడిన జీవితం మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన శారద చిన్నప్పుడే పోలియోబారిన పడింది. శారదను కలిసిన శంకర్ ఆమెనే తన జీవితభాగస్వామిగా రావాలనుకున్నాడు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వికలాంగులు కావడంతో ఎలా బతుకుతారోనని ఆ తండాలోని అంతా అనుకున్నారు. కాని వారి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. ఊరూరా ఇడ్లీలు ఇద్దరూ తెల్లవారకముందే నిద్రలేచి ఇడ్లీలు తయారు చేసుకుని ద్విచక్ర వాహనంపై పెట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్ముతుంటారు. ఇడ్లీల అమ్మకంతో వచ్చిన డబ్బును పొదుపు చేసుకున్నారు. ఇడ్లీలతోపాటు వేసవి వస్తే ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారు. చలికాలం దుప్పట్ల వ్యాపారం చేసేవారు. ఇలా సీజన్‌కు తగ్గట్టు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న శంకర్, శారద దంపతులు తండావాసులకు ఆదర్శం అయ్యారు. కిరాణా కొట్టుతో పోషణ పొదుపు చేసుకున్న డబ్బుతో ఇప్పుడు కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఓ చిన్న షాప్ వేసుకుని కిరాణాకొట్టు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కలిసి కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాలకు వెళ్లి సామాన్లు కొనుగోలు చేసుకుని వస్తారు. ప్రతీ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ దుకాణం తెరిచే ఉంటుంది. తండావాసులే కాకుండా, రోడ్డున వెళ్లేవారు సైతం అక్కడ ఆగి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇద్దరినీ చూసి మెచ్చుకొని వెళుతుంటారు. కొత్త కష్టం కుటుంబ పోషణకు ఎవరిపైనా ఆధారపడకుండా వెళ్లదీసుకుంటున్న ఈ జంటకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. ఇన్నాళ్లూ పోగేసుకొని నిర్మించుకున్న షాప్ రోడ్డు వెడల్పులో పోతుందని ఆందోళన చెందుతోంది. అక్కడే ప్రభుత్వ స్థలం ఉందని, ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందిస్తే ఆ స్థలంలో షెడ్డు నిర్మించుకొని తమ బతుకులు తాము బతుకుతామని అంటున్నారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి ఫొటోలు: అరుణ్ మాకు కాళ్లు లేవని బాధగా ఉండేది. కానీ, ఇప్పుడు ఒకరికి ఒకరం ఉన్నాం. కాళ్లు లేవనే బాధ లేదు. నలుగురిలో భేషుగ్గా బతకాలని ఇద్దరం కష్టపడుతున్నాం. దేనికీ లోటులేకుండా బతుకుతున్నాం. మమ్మల్ని చూసి మా తండాలోనే కాదు చుట్టుపక్కల ఊళ్లవాళ్లూ మెచ్చుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. – కాట్రోత్ శంకర్, శారద దంపతులు -
గుడ్డి వెలుతురు
చీకటే గుర్తుంది మొదట.‘నువ్వు చీకట్లోనే దొరికావు’ అంటుంది శారదా టీచర్.చీకటి. రాత్రి. ఇల్లంతా చీకటై పోయిన రాత్రి. నాన్న చీకటిగా మారిన రాత్రి.‘అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చుగా’ అనేదట అమ్మ.‘నేను పెళ్లయినవాణ్ణి. గవర్నమెంట్ ఉద్యోగిని. నిన్ను ఉంచుకుంటా’ అన్నాడట నాన్న.‘పోనీ ఎవ్వరికీ తెలియకుండా నా మెడలో తాళైనా కట్టు’ఆ మాత్రం కమిట్మెంట్ కూడా ఎందుకు.‘కట్టను. ఇష్టమైతే చెప్పు’అమ్మ ఏమంటుంది. పేదరికం నోరు మూయించింది. అప్పటికే పాతికేళ్లు వచ్చేశాయి. దిక్కులేని ఇంటికి చాకిరీ చేసి చేసి అలసిపోయింది. మనిషి కదా తను. ఎముకలు, గుజ్జు, రక్తము, చలనము ఉన్న మనిషి. నాన్నతో వచ్చేసింది.పెళ్లయిన స్త్రీకి అడ్రస్ ఉంటుంది. ఉంచుకున్నదానికి ప్రతి ఊరూ అడ్రస్సే.ఇంట్లో తెలియకుండా ఉండాలని నాన్న అమ్మను ఊరూరు తిప్పేవాడు. అక్కడ కొన్నాళ్లు. అక్కడ కొన్నాళ్లు. ఇక్కడ కొన్నాళ్లు. ఇక్కడ కొన్నాళ్లు. ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. వచ్చినరోజు ఇంట్లో కోడికూర కుతకుత ఉడికేది. అమ్మ నవ్వేది. ఏదో అడుగుతుంది కాబోలు గుద్దులు తిని ఏడ్చేది. నవ్వో ఏడుపో. నాన్న వచ్చిన రోజు బాగుండేది. నాన్న డబ్బులిచ్చేవాడు కాదు. ఉంచుకున్న ఆడదానికి డబ్బులిచ్చే బాధ్యత మగాడికి లేదు. అమ్మ బీడీలు చుట్టేది. ట్యూషన్లు చెప్పేది. ఇదిగో శారదా టీచర్ సాయంతో జీవితం లాక్కునొచ్చేది. ఏమీ అనడానికి ఉండేది కాదు. నాన్న దగ్గర నాలుక అనే ఆయుధం ఉండేది. ‘ఏమో.. నన్ను తగులుకునే ముందు ఎంతమందిని తగులుకున్నావో’ అనేవాడు.నాలుక కాదు అది. మలం. అమ్మ నోరుమూసుకుని ఉండేది. ఆ తర్వాత్తర్వాత నాన్న కోపంగా ఇంటికి రావడం మొదలెట్టాడు. ఇంట్లో తెలిసిపోయిందట. భార్య గొడవ చేస్తున్నదట. లంపటంలో ఇరుక్కున్నాను అన్నట్టు ఉండేవాడు. రాత్రయితే భయం. రాత్రయ్యాక తాగాక కొట్టాలి కదా మరి.ఆ రోజు సాయంత్రం నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నేను స్కూలు నుంచి వచ్చి పెరడులో నీళ్ల తొట్టి దగ్గర స్నానం చేస్తున్నా.పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి. ఇంటి ముందు రెండు కార్లు వచ్చి ఆగాయి. ఆడవాళ్లు మగవాళ్లు... చాలామంది ఇంట్లో దొమ్మిగా దూరారు. రావడం రావడం అమ్మను బూతులు తిడుతున్నారు. వాళ్లంతా నాన్న భార్య తరపు మనుషులట. ఇవాళ ఐసల్ ఫైసల్ తేల్చుకుందామని వచ్చారట.కొన్ని విషయాలకు సంఘంలో పూర్తిగా అనుమతులు ఉంటాయి.లేకుంటే తీసుకుంటారు.ఉంచుకున్న మనిషిని దండించే అనుమతి వాళ్లు తీసుకున్నారు. ఒకరికి ఉంపుడుగత్తెగా ఉండి, పచ్చని కాపురం పాడుచేస్తుంటే ఊరుకుంటారా? ఒకడు జుట్టు పట్టుకునిలాగి కింద పడేశాడు. ఒకడు దవడ మీద బాదాడు. ఒకామె మాటలతో ఎగదోసింది. ఒకడు రోకలికర్ర ఎత్తి మీద వేశాడు. నాన్న మెదలకుండా చూస్తుంటే అందరూ గుమిగూడి కాళ్లతో చేతులతో కర్రలతో కట్టెలతో మీదపడి.. అమ్మా... అమ్మా....ఎంత మనిషని? సున్నితంగా చక్కగ ఉన్న మనిషి. శరీరంలోని ప్రతి అవయవం నలిగిపోయిందని తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో చెప్పారట. పక్కటెముకలు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు.... ఏ కూతురికైనా శాపం ఏమిటో తెలుసా? తల్లి ముఖం మామూలుగా కాక, నవ్వుతున్నట్టు కాక, వికృతంగా– తల పగిలి– రక్తం కారుతూ గుర్తుండిపోవడం.తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు. రాత్రి పదింటికి జ్వరంతో కాలిపోతూ పూర్తి చీకటిలో పెరడులోని నీళ్ల తొట్టె వెనుక శారదా టీచర్‌కు దొరికాను.తనే పెంచింది నన్ను.ఎంత చీకటిలో అయినా గుడ్డి వెలుతురు ఉంటుంది కదా. ప్రేమగా పెంచిన టీచర్. దయదలుస్తున్నట్టుగా కాక మానవ ప్రతిస్పందనగా పెంచిన టీచర్. బాగా ఎదిగి కాలేజీకొచ్చాక అడిగాను–‘పెళ్లెందుకు చేసుకోలేదు శారదా టీచర్?’‘వెగటు పుట్టి తల్లీ. మగాడిలోని చీకటికి వెగటు పుట్టి’మళ్లీ అంది–‘అన్నీ పడాల్సింది మనమే. ఒకతను పరిచయమయ్యాడు. ప్రేమించాను. చేయి వేశాడు. వద్దన్నాను. చేయి వేయనివ్వట్లేదంటే నీకు నా మీద ప్రేమ లేదన్నట్టే అన్నాడు. బ్లాక్‌మెయిలింగ్. ప్రేమ నిరూపించుకోవాలన్నమాట. వేయనిచ్చాను. పెళ్లి చేసుకోమన్నాను. నాకు లొంగిపోయావంటే ఇంకెంతమందికి లొంగిపోయావో అన్నాడు. లొంగదీసింది వాడే. నింద వేసిందీ వాడే. తగులుకోవడానికి నీకు ఎవరో ఒకరు దొరుకుతారులే అన్నాడు. మనసు విరిగిపోయింది’ ఎంత పెనుగులాడి ఉంటుందో. మగాడు ఎందుకు పెనుగులాడేలా చేస్తాడో.చీకటిగా ఉంది. చుట్టూ హాస్పిటల్ కారిడార్ అంతా పరుచుకున్న చీకటి.శారదా టీచర్ ఇక్కడే ఉంది. కేన్సర్ అన్నారు. ఇప్పుడో మరి కాసేపో. వీడ్కోలు.అమ్మ గుర్తుకొచ్చింది. ఆమె చూసిన జీవితం గుర్తుకొచ్చింది. అమ్మ... అమ్మలాంటి స్త్రీలు.. శారదా టీచర్ శారదా టీచర్లాంటి స్త్రీలు... ఎంతమంది ఉంటారు. అంతమంది ఎందుకు ఉండాలి అసలు. జీవితాలని ఎందుకు కోల్పోవాలి? ‘ఇక్కడున్నావా తల్లీ’ పిలుపు వినిపించింది.శ్యామలా ఆంటీ. శారదా టీచర్ ఫ్రెండు. శారదా టీచర్‌లాగే.‘ఇక మీదట అన్నీ నీకు నేనేనమ్మా’ అంది ఉదయమే అపేక్షగా. ‘ఇక్కడ చాలా చీకటిగా ఉంటే ఏం చేస్తున్నావమ్మా. లోపలికి పోదాం పద’ చేయి పట్టుకుంది.తిరిగి ప్రయాణం మొదలైంది. ఒక గుడ్డి వెలుతురులోకి.కథ ముగిసింది.విమల రాసిన ‘నీలా వాళ్లమ్మ మరికొందరు’ కథ ఇది.మగవాళ్ల వికల వ్యక్తిత్వం వల్ల తప్పిపోయిన స్త్రీ పాత్రలు చాలా ఉంటాయి సమాజంలో. ఎక్కడుంది లోపం? వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిలు... వ్యక్తిత్వం ఉన్న యువకులు... వ్యక్తిత్వం ఉన్న అధికారులు... వ్యక్తిత్వం ఉన్న నాయకులు... అంతిమంగా వ్యక్తిత్వం ఉన్న భర్తలు వీళ్లను తయారు చేసుకోవడంలో వ్యవస్థ ఎక్కడ విఫలం అవుతూ ఉంది? భూమి రెండు అర్ధగోళాలు. స్త్రీ అనే అర్ధగోళం అర్థవంతంగా ఉండాలంటే పురుషుడి వ్యక్తిత్వం అర్థవంతంగా ఉండాలి. వెలగాలనుకుంటున్న స్త్రీలతో పాటు వెలుగుదామనుకునే పురుషుల వల్లే చీకటి పోతుంది. అందాక గుడ్డి వెలుతురే. ఇప్పుడున్నది అదే. పునః కథనం: ఖదీర్ - విమల -
లిఫ్ట్ కిందపడి మహిళ మృతి
పుట్టపర్తి మండలకేంద్రంలోని శ్రీసాయిసదన్ అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ లాక్ ఓపెన్ కావడంతో ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కిందపడి శారద(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆల్వాల్ మండలం వెంకటాపూర్ గ్రామం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జూన్ 12 న హ్యాపీ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: శారద (నటి); గోపీచంద్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. మీ పుట్టిన రోజులో రెండు ఒకట్లు, రెండు రెండ్లు ఉండటం వల్ల నాయకత్వ లక్షణాలతోపాటు మంచి ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనంతో అన్నింటా విజయం సాధిస్తారు. మనోబలం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఉన్న వాటిని అభివృద్ధి పరుస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎం.బి.ఎ; ఎల్.ఎల్.బి; సి.ఎ. చదవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి కాలం. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. తీరిక లేకుండా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
పరువు హత్య
సాంకేతికంగా మనిషి శిఖరాలకు చేరుకుంటున్నా... సంస్కారంలో మాత్రం పాతాళంలోకి కూరుకుపోతున్నాడు. మార్పు కోసం ఎన్ని కాగడాలు వెలిగించినా... చీకటి ఇంకా మహిళలను వేటాడుతూనే ఉంది. కడుపులో బిడ్డ ఉండగానే చంపి పాతరేశారు..పరువు ముందు మానవత్వం సమాధి అయిపోయింది.. ప్రతిష్ఠ కోసం కన్నవారే కసాయిలయ్యారు.. అలాంటి తల్లిదండ్రులు మారాలా? వాళ్లను అలా తయారుచేసిన సమాజం మారాలా? పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం! పోయిందనుకున్న పరువుకి అర్థంలేదని చెప్పలేమా?! నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంభాలపల్లి గ్రామపంచాయితీ పరిధిలో.. విసిరేసినట్టున్న తండా. చుట్టూ కొండల నడుమ ఒదిగిన గువ్వల గుట్ట. రమావత్ చిన్ని, రమావత్ హర్యా ఆ తండాలోని ఓ జంట. వాళ్లకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. నిరుపేద గిరిజన కుటుంబం. కూతురు పేరు శారద. తొలి చూలు. చదువు చెప్పించలేదు. గొర్రెలు, మేకలు కాయడానికి అడవికి వెళ్ళొస్తుండేది. ఈ క్రమంలోనే ఆ తండాకు చెందిన ఓ వ్యక్తి శారదకు పరిచయమయ్యాడు. ఆ పరిచయ ఫలితం.. అమ్మాయి గర్భవతి అవడం. అమ్మాయిలో వస్తున్న మార్పులు తల్లిదండ్రుల్లో అనుమానం రేకెత్తించాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని అనిపించినా భయంతో మిన్నకుండి పోయారు. ఉన్నట్టుండి ఒకరోజు కడుపు నొప్పి అంటూ పిల్ల మెలికలు తిరిగి పోతుంటే గువ్వల గుట్టకు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ల భయాన్ని, అనుమానాన్ని డాక్టర్ నిర్ధారించింది కూతురు గర్భిణీ అని చెప్పి. ఊహించిందే అయినా అబద్ధమేమో అని ఏ మూలో ఉన్న ఆశ ఆవిరై ఆ దంపతులను కుప్పకూలేలా చేసింది. ఆ పరిస్థితికి కారణమైన వాడిని పట్టుకోవాలన్న యోచన కన్నా కూతురు తప్పు చేసింది అన్న భావనే వాళ్ల మెదళ్లలో నిండింది. కడుపులోని పిండాన్ని తీసేయమన్నారు. ‘ఈ టైమ్‌లో కుదరదు’ అంది డాక్టర్. ఏం చేయాలో... ఏం మాట్లాడాలో తెలియక తిరుగు ముఖం పట్టారు. కాని ఊళ్ళోకెళ్తే తండావాసుల ముందు తలెత్తుకోలేమనే చింత వాళ్లను అడుగు ముందుకు వేయనీయలేదు. మార్గమధ్యంలో గుట్టల వద్ద కూతుర్ని నిలదీశారు. జరిగిన విషయాన్ని కూతురు పూసగుచ్చినట్టు చెప్పింది. గుండెలవిసేలా ఏడ్చారు. ఆ ఏడుపు క్రమంగా భరించలేని కోపం.. అవమానంగా మారింది. తలమీదున్న తమ పరువు తండా ముందు కూలిపోయి కనిపించింది. కంపించారు... కన్న బిడ్డ అన్న మమకారం .. గర్భంతో ఉందన్న మానవ త్వం వీళ్లను విడిచి వెళ్లిపోయాయి. బిడ్డ గొంతు నులిమి చంపేశారు. ఊరి సరిహద్దులోనే.. గొయ్యి తీసి పూడ్చేశారు. ఆ నోటా... ఈ నోటా ... శారద కనిపించకపోవడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. విషయం ఆ నోట ఈ నోట బంధువులకు సమాచారం చేరింది. తల్లిదండ్రులను ప్రశ్నించారు. నిజం చెప్పక తప్పలేదు ఆ తల్లిదండ్రులకు. కులాచారం ప్రకారం గర్భిణీని పూడ్చిపెట్టడం తప్పన్నారు. ఆ చావు తండా తండాకే అరిష్టమన్నారు. గుట్టుచప్పుడు కాకుండా తండావాసులంతా ఏకమై పూడ్చిన శారద శవాన్ని బయటకు తీశారు. శారద పొట్ట కోసి లోపలున్న శిశువును వేరు చేశారు. ఆ పక్కనే మరో గొయ్యి తీసి ఆ శిశువును పాతిపెట్టారు. ఆనోటా... ఈ నోటా విషయం బయటకు పొక్కింది. దీంతో అధికారులు, పోలీసులు తండా ప్రవేశం చేశారు. మీడియా కథనాలు రాసింది. తల్లిదండ్రులపై కేసు నమోదైంది. కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతున్నారు. ఓ పదిరోజులు పెద్ద హడావిడే జరిగింది. ఈ వారంపదిరోజుల్లో ఈ కేసు కోర్టులో హియరింగుకు రాబోతోంది. ఈ సంచలనం రేపిన హడావుడికి ఆ తండాలోని ఫాల్స్ప్రెస్టీజ్ భావన చచ్చిపోయి.. గొప్ప మార్పే చోటుచేసుకుంది అనుకునేరు. మూఢాచారాలు, శిశు విక్రయాలు, భ్రూణహత్యలు వంటివి దైనందిన చర్యలో భాగంగా జరిగిపోతూనే ఉన్నాయి. - కొంగరి మధు, సాక్షి, దేవరకొండ కేసు నడుస్తూనే ఉంది 2011లో జరిగిన ఈ సంఘటనలో తల్లిదండ్రుల మీద కేసు నమోదయింది. కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ వారంలో ఈ కేసు జిల్లా కోర్టుకు బదిలీ చేసే అవకాశముంది. అప్పుడప్పుడు ఈ కేసుపై ఉన్నతాధికారులు కూడా వాకబు చేస్తుంటారు. - ప్రసాద్, కానిస్టేబుల్ ఇన్నేళ్ళయినా ఆ సంఘటన కళ్ళముందే కనిపిస్తుంది ఈ సంఘటన సమాచారం అందడంతోనే అధికారులు నన్ను హుటాహుటీన అక్కడికి పంపారు. నా కళ్ళ ముందే శవాలను బయటకు తీశారు. వందల మంది గుమికూడారు. ఏడ్పులు, పెడబొబ్బలు, మరికొందరైతే గుండెబిగబట్టుకుని నిలబడ్డారు. వైద్యులు శిశువుకు సంబంధించిన అవయవాలను డీఎన్ఏ టెస్ట్ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఆ రోజు నాకింకా గుర్తు... ఆ శవాల దగ్గర నన్నే కాపలాగా ఉండమన్నారు. - నూనె శ్రీను, వీఆర్వో అవేర్నెస్సే పరిష్కారం జనరల్‌గా అధికారం కోసం కులం, మతం వంటివాటిని అడ్డంపెట్టుకుంటారు. వీటిని భావోద్వేగాలతో ముడిపెట్టి ప్రజలను రెచ్చగొడుతుంటారు. అయితే ఇవి చిన్న సమూహాలు లేదా కమ్యూనిటీలకు చేరినప్పుడు కుల పోట్లాటలు, పరువు హత్యలు వంటివి జరుగుతుంటాయి. ఈ అజ్ఞానానికి ఎక్కువ, తక్కువ, పేద, ధనిక బేధాల్లేవ్. వీటికి పరిష్కారం ప్రజల్లో చైతన్యం రావడమే. - ఫణి ప్రశాంత్, సైకాలజిస్ట్ -
ఆ ఆరుగురిలో ‘ఆమె’
అవయవదానం చేసి చిరంజీవిగా మారిన శారద హైదరాబాద్: అప్పటి దాకా చక్కగానే ఉన్న ఆమె ఒక్క సారి కుప్పకూలిపోయింది. తాళలేని తలనొప్పి, కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో నగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందనీ..‘బ్రెయిన్ డెడ్’ అయిందని వైద్యులు వెల్లడించారు. అమె కొడుకు సురేష్ స్పందించాడు. తన తల్లి చిరంజీవి కావాలని కోరుకున్నాడు. కానరాని లోకాలకు వెళ్లినా మరికొందరిలో ఆమె బతకాలని భావించాడు. మిగతా కుటుంబీకులు అందుకు సరే అన్నారు. ఇలా అనుకోని రీతిలో ఆమె మరో ఆరుగురికి కొత్త జీవితాన్నిచ్చింది. అవయవదానంతో చిరంజీవిగా నిలచిపోయింది. ఇదీ నిజాంబాద్ జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన లింగంపేట శారద(45) కథ. ఎందరికో చూపిన స్ఫూర్తి బాట. శారద భర్త గంగా గౌడ్ గీత కార్మికుడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో పనిచేస్తూ కుప్పకూలిపోయింది. స్థానికంగా చికిత్సలందించినా ఫలితం లేక పోవడంతో శనివారం నగరంలోని లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ‘బ్రెయిన్ డెడ్’గా తేల్చారు. కొడుకు చొరవతో... దీంతో ఆమె కుమారుడు సురేష్ తన తల్లి భౌతికంగా లేకపోయినా పది మందిలో బతికుండాలనే కోరికతో ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చాడు. మోహన్‌ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవన్‌దాన్ కోఆర్డినేటర్ అనురాధ సహకారంతో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారు జామున డాక్టర్ల బృందం శారద అవయవాలను సేకరించింది. ఆమె లివర్‌ను గ్లోబల్ హాస్పిటల్లో ఢిల్లీకి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి డాక్టర్ బల్భీర్సింగ్ నేతృత్వంలోని బృందం అమర్చి ఆయనకు కొత్త బతుకు నిచ్చారు. ఒక కిడ్నీని పాతబస్తీకి చెందిన 31ఏళ్ల మహిళకు డాక్టర్ జి.శ్రీధర్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేసి అమర్చారు.గ్లోబల్ హాస్పిటల్ వైస్ ప్రసిడెంట్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ హీరేంద్రనాధ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరో కిడ్నీని దక్కన్ హాస్పిటల్, గుండె వాల్వ్స్‌ను ఇన్నోవా హాస్పిటల్, కళ్లను ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్‌కు ఇచ్చారు. అవయవాల సేకరణ అనంతరం శారద మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కుటుంబీకుల చొరవను పలువురు ప్రశంసించారు. -
కష్టాలే క్రెడిట్లు
మిణుగురులు సమాజానికి దివిటీలు తంగిరాల శారద హైదరాబాద్ ఆబిడ్స్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో విధుల నుంచి విరమణ పొందనున్నారు. ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు శారదను చూస్తే అసలేమాత్రం ఆమె అంధురాలనిపించరు! మరి ఇన్నేళ్లుగా ఉద్యోగినిగా కొనసాగుతూ బ్యాంకు అధికారులు, సహోద్యోగుల మన్ననలు పొందడం శారదకు ఎలా సాధ్యమైంది?! ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘పాతికేళ్ల క్రితం కంట్లో పిగ్మెంటేషన్ మొదలైంది. ‘చూపు ఎన్నాళ్లుంటుందో చెప్పలేం’అన్నారు డాక్టర్. మసక చూపుతో పనిలో తప్పులు దొర్లితే నాకు చెడ్డపేరు రావడం అంటుంచి, బ్యాంకు పరువు ఏం కానూ? అందుకే... మూడు నెలల పాటు ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఉద్యోగం మానేశాను. కానీ, ఇల్లు గడవడం చాలా కష్టమయ్యేది. నా భర్త ఒక్కరే ఉద్యోగం చేస్తే గడిచేలా లేని జీవితం. మళ్లీ ఉద్యోగం చెయ్యడం తప్పలేదు. అదృష్టవశాత్తూ, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేదు. చేస్తున్న ఉద్యోగాన్నే కంటిన్యూ చెయ్యమన్నారు. ఎప్పుడు ఊపిరి తీసుకున్నానో తెలీదు! పెళ్లికి ముందే నాకు ఎస్.బి.హెచ్లో (ఖమ్మంలో) టైపిస్టుగా ఉద్యోగం వచ్చింది. మావారు ఉద్యోగరీత్యా ముంబయ్‌కు ట్రాన్స్ఫర్ కావడంతో నేనూ వెళ్లక తప్పలేదు. ముంబయ్‌లో కాపురం. ఉండేది ఐదో అంతస్తులో. ఉదయం తొమ్మిది గంటలకు బ్యాంకుకు బయల్దేరితే, తిరిగి ఇంటికి చేరేది రాత్రి తొమ్మిది గంటలకే. నేను వచ్చిన గంటకు మా వారు డ్యూటీకెళ్లేవారు. అర్ధరాత్రి నీళ్లు వచ్చేవి. ఈ మధ్యలో పిల్లవాడి బాగోగులు. తిరిగి మూడు గంటలకు లేచి, రెడీ అయితే తప్ప సమయానికి ఆఫీస్‌కు చేరుకునేదాన్ని కాదు. ఆ పదిహేనేళ్లు ఎప్పుడు ఊపిరి తీసుకున్నానో కూడా తెలియదు. చూపు బాగుండి... మసకబారి... పూర్తిగా చూపుకోల్పోయే దశలో మావారి ట్రాన్స్ఫర్ కారణంగా హైదరాబాద్ చేరుకున్నాను. సహ సిబ్బంది సహకారం సీతాఫల్మండిలో నివాసం. ఆబిడ్స్‌లో ఉద్యోగం. అక్షరాలు పూర్తిగా కనపడటమే మానేశాయి. ఇక టైపింగ్ పనులు చేయలేను అని నిర్ధారించుకున్నాక డ్యూటీని టెలీఫోన్ ఎక్స్ఛేంజ్కి మార్పించుకున్నాను. 1991లో క్లర్క్‌గా ఉన్నవారు టెలీఫోన్ ఆపరేటర్‌గా చేరొచ్చు అనే ప్రకటన వెలువడింది. దాంతో పూర్తిస్థాయి టెలీఫోన్ ఆపరేటర్‌గా రికార్డుల్లో చేరాను. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది నాకెంతో అండగా నిలిచారు. వారి మేలు మరువలేను. పద్నాలుగు రకాల పనులు అంధుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ (జాస్) ఉందని తెలుసుకొని, దానిని నేర్చుకున్నాను. ఆ తర్వాత నాలాగా చూపు లేని వారు చేసుకోదగిన పనులు బ్యాంకులలో ఏమున్నాయో శోధించాను. అలా చూపుతో పనిలేకుండా ‘రిస్క్ ఫ్యాక్టర్’ లేని 14 పనుల గురించి తెలిసింది. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. చూపులేని ఉద్యోగులు దేశమంతటా ఎంతమంది ఉన్నారో తెలుసుకొని, వారందరికీ పెరంబదూర్‌లో నా పర్యవేక్షణలోనే జాస్ శిక్షణ ఇప్పించారు. పద్దెనిమిదేళ్ల సోదర బంధం 1998 నాటికి... చీకటి పడగానే కళ్లముందు పూర్తిగా కాంతి మాయమయ్యేది. అందుకని, చీకటి పడకుండానే ఇల్లు చేరేదాన్ని. కానీ, ఆ తర్వాత పగలు కూడా అదే స్థితి. ఓ రోజు సయ్యద్ సుల్తాన్ ఆటో ఎక్కాను. నా పరిస్థితి గమనించి, రోజూ నన్ను ఆఫీస్‌లో దిగబెట్టి, తిరిగి ఇంటికి చేర్చే బాధ్యతను ఒప్పుకున్నాడు. ఇప్పటికి 18 ఏళ్లు. నాటి నుంచి నేటివరకు తమ్ముడిలా నాకు రథసారథ్యం వహిస్తూనే ఉన్నాడు (కృతజ్ఞతగా). ఇక మా అబ్బాయి. ముంబయ్‌లో ఐఐటి చేసి, పెళ్లి చేసుకొని, ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు. ‘అమ్మ చాలా కాన్ఫిడెంట్’ అంటుంటాడు. నవ్వుతూనే ఆ ప్రశంసలు అందుకుంటాను’’... అంటూ తన జీవితం నిండా చోటుచేసుకున్న మలుపులను, వాటిని ఎదుర్కొన్న తీరును వివరించారు శారద. ఉద్యోగినిగానే కాదు కవయిత్రిగానూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు శారద. సంకల్ప బలం ఉంటే చూపులేకపోయినా సాధనతో విజయం సాధించవచ్చు అనేందుకు శారద చక్కని నిదర్శనం. శారదమ్మే సాయం చేసింది నాకు మొదట్లో అద్దె ఆటో ఉండేది. శారదమ్మ ప్రోత్సాహంతో బ్యాంకు లోను తీసుకొని సొంత ఆటో కొనుక్కున్నాను. నాకు ముగ్గురు ఆడబిడ్డలు. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లకీ శారదమ్మ సాయం చేసింది. - సయ్యద్ సుల్తాన్, ఆటో డ్రైవర్ -
ప్రపంచానికి జబ్బు చేసింది...
స్మరణీయులు / శారద మిస్టర్ ప్రపంచంగార్కి మళ్లీ జబ్బు చేసింది. మంచాన పడ్డాడు. మిస్టర్ సామ్రాజ్యవాదం వెంటనే సర్ బూర్జువాకి కబురు చేశాడు. ఆయన కారేసుకు దిగాడు. సామ్రాజ్యవాదం ఆయనను చూడగానే ‘సర్ బూర్జువా. మిస్టర్ ప్రపంచం గార్కి మళ్లీ జబ్బు చేసింది. ఇదేం జబ్బో తేలాలి. డాక్టర్ని పిలవండి’ అన్నాడు. ‘ఎవర్ని పిలిచేది’ అని అడిగాడు బూర్జువా. సామ్రాజ్యవాదంగారు బాగా ఆలోచించి ‘డా.సామ్యవాదంగారు ఉన్నాడే. ఆయన్నే పిలు’ అన్నాడు. సర్ బూర్జువా కళ్లజోడు తుడిచి తగిలించుకొని ‘వాడా. ఛా..ఛా. వాడు ప్రతిదానికీ సోషలిజం ఇంజెక్షన్లు, రివల్యూషను సొల్యూషన్లూ ఇస్తానంటాడు’ అన్నాడు. మిస్టర్ సామ్రాజ్యవాదం వినకుండా ‘వాడికి మిస్టర్ ప్రపంచంగారి తత్వం తెలుసు. పిలవండి. మందివ్వడానికి కాదు. రోగం ఏమిటో నిఖరంగా తేలడానికే’ అన్నాడు. బూర్జువా వెంటనే డాక్టర్ సామ్యవాదికి ఫోన్ చేశాడు. ఆయన అర్జెంటుగా వచ్చేశాడు. బూర్జువా గారూ, సామ్రాజ్యవాదం గారూ ఆయనకు మిస్టర్ ప్రపంచాన్ని చూపి జబ్బేమిటో తేల్చమన్నారు. ఆయన చేయి పట్టుకొని చూసి ‘ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీని పేరు బానిసరోగం. దీనికల్లా ముందుగా రెవల్యూషన్ మందు ఘాటుగా తగలాలి. తర్వాత సోషలిజం ఇంజెక్షనులు నరాలలో ఎక్కించాలి. అప్పుడుగాని నయంగాదు’ అన్నాడు. ఇద్దరు పెద్దలూ ఉలిక్కిపడి ‘మిమ్మల్ని మందులు చెప్పమన్నామా? రోగం ఏమిటో తేల్చమన్నాంగాని. ఇదిగో ఈ డాలర్ ఫీజు పుచ్చుకుని దయచెయ్యండి’ అన్నారు. డాక్టరు సామ్యవాది వెళ్లిపోయాడు. సామ్యవాది గడపదాటిన దగ్గర నుంచీ మిస్టర్ ప్రపంచంగార్కి రోగం ఎక్కువైంది. మంచం మీది నుంచి ఎగిరెగిరి పడుతున్నాడు. సంధిలోకి దిగింది వ్యవహారం. సామ్రాజ్యవాదంగారు, బూర్జువాగారు మిస్టర్ ప్రపంచాన్ని మంచానికి కట్టేసి ఆలోచించారు. ఇక ఇది నయమయేదెట్లా? సర్ బూర్జువా చెప్పాడు- ‘ఉన్నాడు గదటయ్యా మన రావ్‌బహదూర్ సర్ మతవాది. ఆయనైతే ఈ పాడు విజాతీయ మందులు గాకుండా అచ్చం స్వజాతి గుళికలు, తైలాలు వేసి నయం చేస్తాడు. ఆయన్ని కబురు చేస్తున్నాను’ అని ఫోన్ చేశాడు. రావ్ బహుదూర్ సర్ మతవాది స్వంత విమానం మీద ఎక్కి వచ్చినాడు. ప్రపంచంగారి చెయ్యి చూచాడు. ‘దైవము కృపయుంచుగాక.మిస్టర్సూ... ఈ మిస్టర్ ప్రపంచానికి నాస్తిక టైఫాయిడ్ జ్వరం వంటబట్టింది. అంచేతనే ఇట్టా ఎగిరెగిరి పడ్తున్నాడు. ఇది నయమయే జబ్బు గాదు. అయినా నిద్ర పట్టేందుకు ఒక మిశ్రీత రసాయనం ఇస్తున్నాను’ అని రెండౌన్సులు వేదాంతం, రెండు గ్రాముల దైవభక్తి, మూడౌన్సులు అహింస కలిపి ఇచ్చాడు. సర్ బూర్జువా అన్నాడు- ‘మరేనండి. నిద్ర పోయినా నయమే. మేలుకొని ఉండి మరీ వేపుక తింటున్నాడు’. శారద (1924-1955) తెలుగువారికి పట్టని ఒక మహా రచయిత. తమిళ దేశం నుంచి తెలుగు ప్రాంతానికి వచ్చి, తెనాలిలో స్థిరపడి, తెలుగు అక్షరాలను కూడబలుక్కుని చదువుతూ నేర్చుకొని, తినడానికి తిండి లేకపోయినా పుస్తకాలనూ ప్రపంచ సాహిత్యాన్ని నమిలి భుజించి, తద్వారా నరాల జబ్బు తెచ్చుకొని, కడు దారిద్య్రంలో జీవిస్తున్నా ఈ నిస్సహాయ జనం చేతికి చైతన్యవంతమైన రచన అనే ఆయుధాన్ని ఇవ్వాలని తపించి, లెక్కకు మించి రచనలు చేసి, చేస్తూ చేస్తూనే అతి చిన్న వయసులో కన్నుమూసిన కలంవీరుడు, తిరుగుబాటుదారుడు శారద. అసలు పేరు ఎస్.ఎస్.నటరాజన్. జూలై 14, 1946లో అతడు రాసిన తొలి కథ, అతి చిన్న కథ, అతి శక్తిమంతమైన కథ ఎలా ఉందో చూడండి. -
శ్మశానవాటికే వారి నివాసం!
చనిపోరుున భర్త.. రానివ్వని అద్దింటి వారు.. ఇద్దరు పిల్లలతో తల్లి సమాధుల వద్ద ఆవాసం వరంగల్ నగర పరిధిలోని కరీమాబాద్‌లో ఘటన కరీమాబాద్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో బిజ్జ ముకుందం, ఆయన భార్య శారద, కుమారుడు హర్షిత్, కూతురు మానసతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమం లో ముకుందం(32) ఆర్థిక ఇబ్బందులతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దె ఇంటివారు మృతదేహాన్ని మా ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. చేసేది లేక భర్త మృతదేహాన్ని శారద పోస్టుమార్టం నుంచి నేరుగా తోట్లవాడలోని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించింది. ఆ తర్వాత శారద తన ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక శ్మశానవాటిక వద్ద గోడ నీడకు రెండు రోజులుగా ఉంది. పగలు ఎండకు, రాత్రి దోమలు, దుర్వాసన భరిస్తూ గడిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు శ్మశానవాటిక పక్కన ఓ చిన్న రేకుల షెడ్డు వేరుుంచడంతో అక్కడే ఉన్నారు. కాగా, అద్దింటివారు పది రోజుల తర్వాత రావొచ్చని చెప్పారని శారద తెలిపింది. -
యువతి మౌన పోరాటం
పల్లివూరు (వజ్రపుకొత్తూరు): 8 ఏళ్లు ప్రేమయాణం సాగించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తీరా వివాహం చేసుకోవాలని కోరితే మా ఇంటిలో వాళ్లు ఒప్పుకోరు పొమ్మంటున్నాడు అని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితో తనకు పెళ్లి జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది. పోలీసులు.. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండల పల్లివూరుకు చెందిన దున్న శారద (24) అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (28) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ 8 ఏళ్ల కాలంలో శ్రీనివాసరావు దుబాయ్, మస్కట్ వెళ్లి అక్కడ కొంతకాలం పని చేసి వస్తున్నాడు. ఈ ఏడాది గ్రామానికి వచ్చిన శ్రీనివాసరావుని శారద పెళ్ల్లి చేసుకోవాలని కోరింది. ప్రియుడు నిరాకరించాడు. దీంతో ఆమె ఈ నెల 5న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో ఆమెకు వైద్య సేవలు అందించడంతో కోలుకుంది. ఈ విషయం గ్రామ పెద్దల పంచాయితీ వరకూ వెళ్లింది. పెద్దలు శ్రీనివాసరావును పిలిచి పెళ్లి చేసుకోవాలని, ఆడపిల్లకు అన్యాయం చేయవద్దను నచ్చజెప్పారు. అయినా అతగాడు వినకపోవడంతో సోమవారం శారద ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. కాగా శ్రీనివాసరావు ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శారద నన్ను వేధిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శారద కూడా పోలీసులకు శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసింది. 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం తమకు పెళ్లి చేయాలని కోరింది. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన వజ్రపుకొత్తూరు ఎస్ఐ కె.రవికిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రోతాభిరామం
రేడియో అంతరంగాలు నేడు వరల్డ్ రేడియో డే ‘రేడియో రామం’ గా ఎస్.బి. శ్రీరామమూర్తి శ్రోతలందరికీ సుపరిచితం! రేడియోలో ఆయన ఎంత వినూత్నంగా కార్యక్రమాలను రూపొందించగలరో.. మాండలిన్తో సరిగమలనూ అంతే హృదయ రంజకంగా వినిపించగలరు. కాన్వాస్ మీద అంత సృజనాత్మకంగాను చిత్రాలను గీయగలరు! ఇలా తనకు తెలిసిన అన్ని విద్యలతో తెలుగు రేడియోకి విలక్షణ కళాకారుడైన రామం... ఈవారం ‘రేడియో అంతరంగాలు’ కు శారదా శ్రీనివాసన్ ఎంచుకున్న ఆత్మీయ అతిథి. (శ్రీరామమూర్తినిశారదా శ్రీనివాసన్ కూడా ఆప్యాయంగా రామం అనే పిలుస్తారు. ఆయన కూడా శారద అత్తా, శ్రీనివాసన్ మామా అంటూ వాళ్లని అంతే ఆప్యాయంగా పిలుస్తారు. విజయవాడ ఆకాశవాణి నుంచి రామం రిటైరై పన్నెండేళ్లవుతోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శారదా శ్రీనివాసన్.. రామంను మళ్లీ ఒకసారి కలుసుకున్నారు. వారి సంభాషణ అలా.. ఆ పాత జ్ఞాపకాలతోనే మొదలైంది). మహామహులు పనిచేసిన విజయవాడ రేడియోస్టేషన్లో నువ్వూ పనిచేశావు. అప్పటి నీ అనుభవాలు, అనుభూతులు తెలుసుకోవాలని వచ్చాను రామం.... నిజంగానే అది నా అదృష్టం అత్తా! 1972లో విజయవాడ కేంద్రానికి పర్మినెంట్ అనౌన్సర్‌గా వెళ్లినా 1968 నుంచే రేడియోతో నాకు సంబంధాలున్నాయి. దానికన్నా ముందు.. డిగ్రీ అయిపోగానే మద్రాసు వెళ్లి అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫోటోగ్రఫీ, సౌండ్, ప్రాసెసింగ్ విభాగాల్లో మూడేళ్లు కోర్సు చేశాను. మరి సినిమాలకు వెళ్లకుండా రేడియో వైపు వచ్చావేం? ఈ ప్రశ్నే రేడియో ఉద్యోగం కోసం చేసిన ఇంటర్వ్యూలోనూ అడిగారత్తా! ‘ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడివి.. రేడియోలోకొస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. ఉద్యోగం ఇవ్వం’ అని కూడా అన్నారు. అప్పుడు నేను చెప్పా.. ‘ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవుతుందండి, డిస్ క్వాలిఫికేషన్ కాదు. నేను అక్కడ నేర్చుకున్న రికార్డింగ్, ఎడిటింగ్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ ఉపయోగిస్తాను. ప్రూవ్ చేస్తాను ఉద్యోగం ఇస్తే’అని! ఇచ్చారు. యువవాణితో మొదలు 1968లో ఆల్ ఇండియా రేడియోలో యువతను ప్రోత్సహించడానికి యువవాణిని మొదలుపెట్టారు. అప్పుడే మద్రాస్ నుంచి కాకినాడ వచ్చేశాను. ఈ యువవాణిని వింటుండేవాడిని. ‘అరే.. బాగుందే.. మనం కూడా ఏదైనా రాయొచ్చు, చేయొచ్చు’ అనిపించింది. విజయవాడ వెళ్లి ఎవరినైనా కలుసుకుని వద్దాం అని బయలుదేరి వెళ్లా. ‘ఏంచేస్తావేంటీ’ అని అడిగారు. ‘మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్’ అని చెప్పాను. ‘ప్రతి శుక్రవారం మార్నింగ్ ఒక అరగంట ఫిల్మ్ రికార్డులు వేసే కార్యక్రమం ఉంది. ముందది చేయండి. తర్వాత మీరేమైనా రాసుకొని పట్టుకొస్తే అప్పుడు చూద్దాం’ అన్నారు. అలా రేడియోలో సినిమారికార్డులు వేసే పనితో నేను ఉద్యోగానికి ముందే ఎంటర్ అయ్యానన్నమాట. స్టేషన్‌కే కొత్త ఐడియా కొన్ని రోజులకి నేనే ఓ ప్రోగ్రామ్ రూపొందించా. మూడ్ మ్యూజిక్ కాన్సెప్ట్‌తో. మద్రాస్‌లో ఉన్నప్పుడు ఓ షార్ట్‌ఫిల్మ్ కోసమని రాసుకున్న స్క్రిప్టునే ఇక్కడ ప్రోగ్రామ్‌గా మలిచా. ప్రకృతిలోని చక్కటి దృశ్యాన్ని చూస్తుంటే చక్కటి సంగీతాన్ని వింటున్న అనుభూతి కూడా కలుగుతుంది. అనాహత శబ్దం అంటామే అది. దీన్ని నేను రివర్స్‌లో చెప్పటానికి ట్రై చేశా ఆ ప్రోగ్రామ్‌లో. ఎలాగంటే ముందుగా ఓ ప్రభాత దృశ్యాన్ని వర్ణించి.. వెంటనే పండిట్ రవిశంకర్ సితార్ మీద మీటిన ఆహిర్భైరవి రాగాన్ని వినిపించేవాడిని. తర్వాత రెండిటినీ సమన్వయం చేస్తూ కామెంట్ చెప్పేవాడిని. అలా ఏడెనిమిది దృశ్యాలు వర్ణించేవాడిని. దశ్యాన్ని శబ్దీకరించడమన్నమాట. దీనికి నన్ను ప్రోత్సహించిందెవరనుకున్నారు? మహా విద్యాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు. చిన్నకుర్రాడిని వెళ్లి.. శాస్త్రీయ సంగీతాన్ని బేస్ చేసుకొని ఓ ప్రోగ్రామ్ చేస్తానంటే.. ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ‘నాతో రా, సాయంకాలం మాట్లాడుకుందాం’ అన్నారు. విజయవాడలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన ఈవినింగ్వాక్కి వెళ్లేవారు. అలా నన్నూ తీసుకెళ్లి నేను చెప్పింది చక్కగా ఓపిగ్గా విని ‘ఐడియా చాలా బాగుందండీ.. మా స్టేషన్‌కే కొత్త ఐడియా’అన్నారు. నాకొచ్చిన ఎన్నో రేడియో జాతీయ అవార్డులన్నిటికంటే గొప్ప అవార్డు ఆ మాట. నేను రూపొందించిన ప్రోగ్రామ్ విని బాగా ఇంప్రెస్ అయ్యి ఓ చక్కటి ఇంట్రడక్షనూ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరు ‘భావనా సంగీతం’! ఇది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం. దీనికి నాకందిన పారితోషికం 20 రూపాయలు. పుట్టినరోజు గిఫ్ట్ అలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే రేడియోలోనే పర్మినెంట్ ఉద్యోగంలో చేరే అవకాశం కోసం చూస్తుండే వాడిని. అప్పట్లో ‘వాణి’ అనే రేడియో పక్షపత్రికొచ్చేది. అందులో ఆకాశవాణికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్సూ వేసేవారు. ప్రోగ్రామ్స్ హడావిడిలో ఉండి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. వైజాగ్‌లో ఓ ఖాళీ ఉందని తెలిసివెళ్లాను. ఆడిషన్లో పాసయ్యాను. అందులో నా నంబర్ 11. ముగ్గురికి అవకాశమిచ్చి మిగతావాళ్లను ఆపారు. అలా నేను పెండింగ్ లిస్ట్‌లో ఉన్నాను. అప్పుడే అదృష్టవశాత్తు వివిధభారతిలో కొత్తగా తెలుగు సర్వీస్ మొదలయింది హైదరాబాద్, విజయవాడలో. ఆ సర్వీస్‌ని సీబీఎస్ అనిపిలిచేవాళ్లు అంటే కమర్షియల్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్. దానికి అనౌన్సర్స్ని తీసుకుంటున్నారని తెలిసి వెళ్లాను. అప్పటికే నేను పెండింగ్లిస్ట్లో ఉన్నాను కాబట్టి వీళ్లు నన్ను తీసుకునే ఛాన్స్ ఉంటుందని విజయవాడకు వెళ్లాను. అక్కడ అవకాశం దొరకలేదు. ఓలేటి వెంకటేశ్వర్లుగారి సలహా మేరకు హైదరాబాద్ వచ్చాను. శ్రీనివాసన్ మామను కలిశాను. కొంత టైమ్ పట్టినా హైదరాబాద్ వివిధభారతిలో అనౌన్సర్‌గా చేరాను. అది 1971, జూన్ 3న. ఆ రోజు నా పుట్టినరోజు. గుర్తుందా.. అత్తా.. ఆ కాంట్రాక్ట్‌ను మీరే పట్టుకొచ్చి ఇచ్చారు.. నా పుట్టినరోజు గిఫ్ట్‌గా!’. ఎందుకు గుర్తులేదూ.. గుర్తుంది రామం... తర్వాత ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది. కాకపోతే విజయవాడ పోస్టింగ్. యేడాదిగా హైదరాబాద్‌లో అందరూ క్లోజ్ అయ్యేసరికి విజయవాడ వెళ్లడానికి మనసొప్పలేదు. సీనియర్ ఎనౌన్సర్లు డి.వెంకటరామయ్యగారు, శమంతకమణిగారు, రత్నప్రసాద్గారు.. ‘విజయవాడలో కన్సోల్ దగ్గర కాళ్లు పెట్టుకోవడానికి పీటలాంటిది తయారుచేశారట శ్రీరామ్మూర్తీ.. హాయిగా అక్కడికి వెళ్లు’అంటూ నా మీద జోక్స్ వేశారు. ఇక్కడే ఉంటానని స్టేషన్ డెరైక్టర్ కందస్వామిని రిక్వెస్ట్ చేశాను కూడా. ఆయన నన్ను సముదాయించి విజయవాడ పంపించారు. బాలాంత్రపు రజనీకాంతరావుగారు మొట్టమొదటి మా స్టేషన్ డెరైక్టర్. ఆయన మాకు గురువు, దైవం అన్నీ! ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్, టెక్నికల్ విషయాల పట్ల ఆసక్తి, అవగాహన నా రేడియో కెరీర్‌కి ప్లస్పాయింట్స్ అయ్యాయి. అందుకే నా ప్రోగ్రామ్స్‌ని శబ్దచిత్రాలు అని పేరుపెట్టుకున్నాను. అంటే శబ్దం ద్వారా చిత్రాన్ని చూపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోగ్రామ్‌కి నేను సరిపోవడం, నాకు మంచి ప్రోగ్రామ్ రావడం.. రెండూ కుదిరాయి అత్తా. ఒక్కో కార్యక్రమం ఒక్కో జ్ఞాపకం. గొప్ప అనుభూతి. ప్రశంసలు, నేర్చుకునేలా చేసిన విమర్శలు,పెద్దపెద్ద వాళ్ల సాంగత్యం, విడదీయలేని అనుబంధం.. ఇవన్నీ రేడియో ఇచ్చిన సంపదలే! చెప్పాలంటే రోజైనా పడుతుంది! ప్రెజెంటేషన్: సరస్వతి రమ ఫొటో: గోదాసు రాజేష్ ‘ఒక పాటపుట్టింది’ ప్రోగ్రామ్ చేశా కదా ఆ ఐడియా ఎలా వచ్చిందంటే..? రేడియో స్టేషన్లో ఓ పాట ఎలా రికార్డ్ అవుతుందో అనుకునే ఓ సగటు శ్రోత కుతూహలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ రూపొందించాను. ప్రసారం అయ్యాక ఎంత రెస్పాన్స్ వచ్చిందో. నా ఫస్ట్ ప్రోగ్రామ్ నీలినీడలు కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమమే. ఆ మాటకొస్తే ఒక పాట పుట్టింది ప్రోగ్రామ్ చేసేటప్పటికే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కింద నాకు నాలుగైదు అవార్డులు వచ్చి ఉన్నాయి. ఈ ప్రోగామ్కీ అవార్డు వచ్చింది. ఇలాంటివి చాలా చేశాను. ‘మెట్లు’ అనే కాన్సెప్ట్ తీసుకొని జీవితంలో మెట్లకున్న ప్రాధాన్యాన్ని చెప్పడానికి రకరకాల థీమ్స్‌తో ప్రోగ్రామ్ చేశాను. ఒకసారి విజయం, పరాజయాలకి చిహ్నంగా, ఇంకోసారి బుద్ధుడి భాగస్వామి యశోధర ప్రధానపాత్రగా శ్రవణనాటకాన్ని రూపొందించాను. ఒకరకంగా ఇది స్త్రీవాద ధోరణిలో సాగే నాటకం. ఇలా చాలా ప్రయోగాలు చేశాను... కేవలం శబ్దాన్ని మాత్రమే ఓరియెంటేషన్‌గా తీసుకుంటూ! జీవితంలో పెరిగిన వేగం మీదా కామెడీ ప్రోగ్రామ్ రూపొందించాను.. ‘చూసిందే మళ్లీ చూడు’ అనే పేరుతో. ఇలాంటి నా కార్యక్రమాలకు పదీపన్నెండు రేడియో జాతీయ అవార్డులు వచ్చాయి. -
ఫిబ్రవరి వరకే సాగర్ జలాలు
కురిచేడు, త్రిపురాంతకం: నాగార్జున సాగర్ జలాలు ఫిబ్రవరి నెలాఖరు వరకే విడుదల చేస్తామని ఎన్ఎస్పీ ఎస్ఈ శారద పేర్కొన్నారు. ఆయకట్టుకు వచ్చే జలాలను వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాగర్ కాలువపై దర్శి నుంచి జిల్లా సరిహద్దు 85/3 మైలు వరకు శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా 126వ మైలు కురిచేడు వద్ద విలేకరులతో మాట్లాడారు. గతంలో వేసిన నాట్లను మాత్రమే సాగు చేసుకోవాలని..కొత్తగా నార్లు పోసి నాట్లు వేయవద్దని ఆమె సూచించారు. ఫిబ్రవరి నెలాఖరుకు నీటి సరఫరా నిలిచిపోతుందని..అప్పుడు పంట దశలో ఉందని రైతులు ఆందోళన చేసినా ప్రయోజనం ఉండదని, ముందుగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. మేజర్లపై ఏర్పాటు చేసిన అక్రమ తీములను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన కాలువ 124వ మైలు వద్ద ఉన్న రైల్వే గేటు ముసివేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారని..దీనిపై వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట చీమకుర్తి, దర్శి ఈఈలు శ్రీనివాసరావు, బీఎస్వీ.ప్రసాదు, ఒంగోలు, దర్శి, కురిచేడు డీఈఈలు పూర్ణచంద్రరావు, కరిముల్లా, లాల్ అహమ్మద్, కురిచేడు ఏఈ శ్రీనివాసరావు, ఎస్వీ.ఎస్.గుప్తా తదితరులు ఉన్నారు. -
రాత్రంతా ఉద్రిక్తత
పార్వతీపురం టౌన్ :ప్రసవానంతరం గర్భసంచి ముడుచుకోకపోవడం వల్ల మృత్యువాత పడిన పైల శారద(28)బంధువులు చేపట్టిన ఆందోళన కారణంగా స్థానిక జయశ్రీ హాస్పిటల్ వద్ద వేకువజాము వరకూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డాక్టర్ వై.వి.పద్మజ నిర్లక్ష్యం కారణంగానే పైల శారద(28) మృత్యువాత పడిందని ఆరోపిస్తూ మండలంలోని పెదమరికి గ్రామానికి చెందిన ప్రజలు శనివారం రాత్రి ఆ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారంతా మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి రాత్రంతా ఆందోళన కొనసాగించారు. సంబంధిత వైద్యురాలిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని వారు పట్టుబట్టారు. ఊరు ఊరంతా ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. రహదారిపై ధర్నా చేపట్టారు. ఆస్పత్రిలో ఫర్నిచర్, మందులను రోడ్డుపై పడేసి ధ్వంసం చేశారు. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పట్టణ ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడు, సాలూరు సీఐ జి.దేవుళ్లు, గరుగుబిల్లి, కొమరాడ, రామభద్రపురం, పార్వతీపురం రూరల్ తదితర ప్రాంతాలకు చెందిన ఎస్సైలు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఒకానొక సమయంలో పోలీసులకు, బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. వందలాదిమంది ఆస్పత్రిలోకి దూసుకుపోయేందుకు యత్నిం చారు. బాధితుల అరుపులు, నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ నాయకుడు ద్వారపురెడ్డి జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జరిపారు. చివరకు రాత్రి 3 గంటల ప్రాంతంలో(సోమవారం వేకువజామున) ఇరువర్గాల మధ్య చర్చలు కొలిక్కిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనలో పలువురికి గాజుపెంకులు తగిలి గాయాలయ్యాయి. -
వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి
పార్వతీపురం టౌన్: పట్టణంలోని జయశ్రీ ఆస్పత్రిలో శనివారం ఓ బాలింత మృతి తీవ్ర ఆందోళనకు దారి తీసింది. తమ గ్రామానికి చెందిన బాలింత మృతికి డాక్టర్ పద్మజే కారణమని పార్వతీపురం మండలంలోని పెదమరికి గ్రామస్తులు ఆరోపించారు. ఆపరేషన్ చేసి కనీసం పట్టించుకోకుండా సిబ్బందికి అప్పగించేసి తన భార్య ప్రాణాలు తీశారని మృతురాలి భర్త వాపోయారు. బాలింత మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి...పెదమరికి గ్రామానికి చెందిన పైల శారద(28)కు శనివారం ఉదయం పురిటి నొప్పులొచ్చాయి. వెంటనే పట్టణంలోని డాక్టర్ వై.వి.పద్మజకు చెందిన జయశ్రీ ఆస్పత్రికి సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో తీసుకొచ్చా రు. పేషెంట్‌ను చూసిన డాక్టర్ పద్మజ ఆపరేషన్ చేయాలని, రూ.12వేలు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సుమారు 3.25 గంటలప్రాతంలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయగా ఆడపిల్ల పుట్టింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ కనీసం పేషెంట్‌ను పట్టించుకోకుండా, సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే పేషెంట్‌కు బ్లీడింగ్ ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న డాక్టర్ ‘ఓ-నెగిటివ్’ రక్తం అర్జెంట్‌గా కావాలని కోరడంతో తొలుత మజ్జి పద్మావతి, ఆ తర్వాత మరో ముగ్గురు రక్తాన్నిచ్చారు. అయితే రక్తం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి పరీక్షలూ జరపలేదు. దీంతో రక్తం ఎక్కించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం తీసుకెళ్లాలని సూచించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను విశాఖపట్నానికి తరలిస్తుండగా మృతి చెందినట్లు మార్గమధ్యలో గుర్తించారు. దీంతో గ్రామస్తులంతా ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహంతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ భర్త వివేక్‌తో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి బయట మెయిన్ రోడ్డుపై బైఠాయించి, డాక్టర్‌ను అరెస్ట్ చేసి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ లోపు పట్టణానికి చెందిన కొంతమంది వైద్యులు, పట్టణ ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడులు తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని వారించేందుకు యత్నించారు. అయినా వారు ససేమిరా అనడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ గది తలుపు అద్దం ముక్కలైంది. ఈ సందర్భంగా బంధువులు మాట్లాడుతూ, ఆస్పత్రిలోనే బాలింత చనిపోయినప్పటికీ ఏమీ ఎరగనట్లు తమను మోసం చేసి విశాఖపట్నం తీసుకెళ్లాలని చెప్పారని ఆరోపించారు. అలాగే ఎనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేశారన్నారు. ‘బిడ్డ సంచి ముడుచుకుపోకపోవడం వల్లే’ ఈ విషయమై డాక్టర్ పద్మజ వద్ద ప్రస్తావించగా ‘డెలివరీ తర్వాత బిడ్డ సంచి ముడుచుకుపోకపోవడం, రక్తం గడ్డ కట్టకపోవడం, వల్ల అధికంగా రక్త స్రావం అయ్యింది. రక్తం అవసరమంటే రక్తం ఇచ్చారు. 3 ప్యాకెట్లు ఎక్కించాం. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో తర్వాత ప్రయత్నానికి ఇక్కడ వసతులు లేకపోవడంతో విశాఖ రిఫర్ చేశాం. ఎనస్తీయన్ రామారావు సమక్షంలోనే ఆపరేషన్ చేశాం. కొన్ని వేల కేసుల్లో అరుదుగా ఇలాంటివి చోటు చేసుకుంటుంటాయి’ అని తెలిపారు.