శ్మశానవాటికే వారి నివాసం!
చనిపోరుున భర్త.. రానివ్వని అద్దింటి వారు..
ఇద్దరు పిల్లలతో తల్లి సమాధుల వద్ద ఆవాసం
వరంగల్ నగర పరిధిలోని కరీమాబాద్‌లో ఘటన
కరీమాబాద్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో బిజ్జ ముకుందం, ఆయన భార్య శారద, కుమారుడు హర్షిత్, కూతురు మానసతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమం లో ముకుందం(32) ఆర్థిక ఇబ్బందులతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దె ఇంటివారు మృతదేహాన్ని మా ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. చేసేది లేక భర్త మృతదేహాన్ని శారద పోస్టుమార్టం నుంచి నేరుగా తోట్లవాడలోని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించింది.
ఆ తర్వాత శారద తన ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక శ్మశానవాటిక వద్ద గోడ నీడకు రెండు రోజులుగా ఉంది. పగలు ఎండకు, రాత్రి దోమలు, దుర్వాసన భరిస్తూ గడిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు శ్మశానవాటిక పక్కన ఓ చిన్న రేకుల షెడ్డు వేరుుంచడంతో అక్కడే ఉన్నారు. కాగా, అద్దింటివారు పది రోజుల తర్వాత రావొచ్చని చెప్పారని శారద తెలిపింది.