2024 కొద్దిరోజుల్లో ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది కొందరికి సవ్యంగానే సాగిపోగా, మరికొందరికి భారంగా గడిచింది. ఈ ఏడాది ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, బీహార్ నైటింగేల్ శారదా సిన్హా తదితర ప్రముఖులు ఈ లోకాన్ని విడిచివెళ్లారు. 2024 ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాదిలో కన్నుమూసిన ప్రముఖులను ఒకసారి స్మరించుకుందాం.
రతన్ టాటా
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2024 అక్టోబర్ 9న తన 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా 30 ఏళ్ల పాటు టాటా గ్రూప్‌కు సారధ్యం వహించారు. టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ పలు విజయాలు సాధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. రతన్ టాటా భారతదేశానికి చేసిన సేవలు, ఆయన అందించిన విలువలను రాబోయే తరాలు కూడా గుర్తుచేసుకుంటాయి.
బాబా సిద్ధిఖీ
మహారాష్ట్ర ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీని 2024, అక్టోబర్ 12న ముంబైలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపింది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం ముంబైలో భయాందోళనకర వాతావరణం నెలకొంది.
సీతారాం ఏచూరి
సీపీఎం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ లెఫ్ట్ ఫ్రంట్ నేత సీతారాం ఏచూరి 2024, సెప్టెంబర్ 12న కన్నుమూశారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన చాలా కాలం పాటు ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. శ్వాసకోశ వ్యాధితో ఆయన తుది శ్వాస విడిచారు. ఏచూరి మరణానంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు దానం చేశారు.
శారదా సిన్హా
బీహార్ నైటింగేల్‌గా పేరొందిన జానపద గాయని శారదా సిన్హా 2024లో కన్నుమూశారు. ఆమె మల్టిపుల్ మైలోమా అనే అరుదైన రక్త క్యాన్సర్‌తో బాధపడ్డారు. శారదా సిన్హా 2024 నవంబర్ 5న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారతీయ జానపద సంగీతానికి శారదా సిన్హా అమోఘమైన సేవలు అందించారు.
అతుల్ పర్చురే
ప్రముఖ మరాఠీ హాస్యనటుడు అతుల్ పర్చురే తన 57 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కాలేయంలో 5 సెంటీమీటర్ల కణితి ఉందని తెలిపారు. చికిత్స సమయంలో, అది ప్రమాదవశాత్తూ ప్యాంక్రియాస్‌కు వ్యాపించిందని, ఫలితంగా తాను నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిలో ఉన్నానని తెలిపాడు. అతుల్ పర్చురే 2024లో ఈ లోకాన్ని విడిచివెళ్లారు.
పంకజ్ ఉధాస్
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ 2024, ఫిబ్రవరి 26న తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పంకజ్ ఉదాస్ గజల్స్ శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. పంకజ్ ఉదాస్‌కు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకింది. ఆయన మృతికి నాలుగు నెలల ముందుగానే ఆయనకు ఈ విషయం తెలిసింది.
సుహానీ భట్నాగర్
అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ భట్నాగర్ 2024, ఫిబ్రవరి 17న తన 19 ఏళ్ల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. సుహానీ డెర్మటోమయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు ఆమె తండ్రి తెలిపారు.
రితురాజ్ సింగ్
టీవీ, సినీ నటుడు రితురాజ్ సింగ్ తన 59 సంవత్సరాల వయస్సులో 2024, ఫిబ్రవరి 19న ముంబైలో గుండెపోటుతో మృతిచెందారు. చిన్న తెరపై తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తదనంతరకాలంలో పలు ప్రధాన పాత్రలలోనూ కనిపించారు.
రోహిత్ బాల్
ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ 2024 నవంబర్ 2న తన 63 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంపాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. 2010లో గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నారు. అక్టోబర్ 13న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్‌లో లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్‌లో తన చివరి ప్రదర్శన ఇచ్చారు.
ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి
Comments
Please login to add a commentAdd a comment