జూన్ 12 న హ్యాపీ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Happy birthday, celebrated on June 12 Celebrities | Sakshi
Sakshi News home page

జూన్ 12 న హ్యాపీ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 11 2015 11:01 PM | Updated on Sep 3 2017 3:35 AM

జూన్ 12 న హ్యాపీ  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూన్ 12 న హ్యాపీ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. మీ పుట్టిన రోజులో రెండు ఒకట్లు, రెండు రెండ్లు ఉండటం వల్ల ..

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: శారద (నటి); గోపీచంద్ (నటుడు)
 

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. మీ పుట్టిన రోజులో రెండు ఒకట్లు, రెండు రెండ్లు ఉండటం వల్ల నాయకత్వ లక్షణాలతోపాటు మంచి ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనంతో అన్నింటా విజయం సాధిస్తారు. మనోబలం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఉన్న వాటిని అభివృద్ధి పరుస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎం.బి.ఎ; ఎల్.ఎల్.బి; సి.ఎ. చదవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి కాలం. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. తీరిక లేకుండా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు.

సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement