
సేమ్ పించ్!
హీరో గోపీచంద్ కూడా ‘సేమ్ పించ్’ అనుకుంటూ సంతోషంతో మురిసిపోతున్నారు. అంతేకానీ... ముద్దుల కుమారుడు విరాట్‌కృష్ణను గిల్లడం లేదు. గురువారంతో విరాట్ రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు.
ఈ సందర్భంగా ఇలా తండ్రీకొడుకూ ఒకే కలర్ డ్రస్‌లో ఫొటో దిగారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న చిత్రం షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడే విరాట్ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు.