అక్లాండ్: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర జోష్ నెలకొంది. సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఆంగ్ల సంవత్సరాది కోసం భారత్‌లోనూ కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. సంబురాలు చేసుకోవాలనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
ఆక్లాండ్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో న్యూజిలాండ్ 2023లోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లో ముందుగా రోజు ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే కదా. అక్కడి నుంచి కాలమానం ప్రకారం.. ఒక్కో దేశం వేడుకలు చేసుకుంటుంది.
ఇక చివరగా అమెరికా సమీపంలోని జనావాసాలు లేని బేకర్, హౌలాండ్ ద్వీపాలు చివరగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. భారత కాలమానం ప్రకారం .. ఆ టైం జనవరి 1 సాయంత్రం 5:30 గంటలని ఒక అంచనా.
Greetings from the future. I’m glad to report that 2023 is pretty awesome. Happy New Year to all! #Auckland pic.twitter.com/HB9WPDB9TR
— Marcos Balter (@MarcosBalter) December 31, 2022
Comments
Please login to add a commentAdd a comment