టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ నూతన సంవత్సర వేడుకలను తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కొత్త సంవత్సరం తొలి రోజున ముంబైలోని ప్రఖ్యాత సిద్ది వినాయక గుడిని సందర్శించి దీవెనలు అందుకున్నాడు. సిద్ది వినాయక ఆశీర్వాదాలు అందుకున్నా.. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరకున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేసి క్యాప్షన్ జత చేశాడు.
ఇక సూర్యకుమార్ గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా టి20 క్రికెట్‌లో తనదైన మార్క్ చూపించిన సూర్యకుమార్ ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. మిస్టర్ 360 పేరును సార్దకం చేసుకున్న సూర్యకుమార్ గతేడాది టి20 క్రికెట్‌లో 1164 పరుగులు చేసి 2022లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు 2022లో టి20 క్రికెట్‌లో 68 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. రెండు సెంచరీలు సహా తొమ్మిది హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి.
ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లు కలిపి 189 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా సూర్యకుమార్ తన ఫామ్‌ను కంటిన్యూ చేసి టీమిండియాను వన్డే వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాలని కోరుకుందాం.
As we enter the year 2023, with unexplainable gratitude in my heart, I thank you for all the love and support you have showered upon me this year ♥️
— Surya Kumar Yadav (@surya_14kumar) December 31, 2022
Here’s hoping for an even greater year ahead, wishing you all a very happy new year 🤩 pic.twitter.com/mu44f5Mz41
చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం
మహిళా అథ్లెట్ కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment