విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు | Laser Airlines Flight Evacuated In Venezuela After Smoke Fills Cabin | Sakshi
Sakshi News home page

విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు

Published Tue, Apr 30 2024 9:12 PM | Last Updated on Tue, Apr 30 2024 9:17 PM

Laser Airlines Flight Evacuated In Venezuela After Smoke Fills Cabin

లేజర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు  షాకింగ్‌ ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్‌ ద్వారా విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికులు గాయపడ్డారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాలు లేజర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనెజులా నుంచి డొమినికన్‌ రిపబ్లికన్‌కు బయలుదేరింది. ప్రయాణ  సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నట్టుండి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా  ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

కొందరు వెంటనే అత్యవసర స్లైడ్‌ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్‌ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.  ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Following an APU failure aboard a <a href="https://twitter.com/laserairlines?ref_src=twsrc%5Etfw">@laserairlines</a> MD-80, passengers were evacuated due to smoke in the cabin. Regrettably, most passengers exited with their carry-on luggage, resulting in avoidable hazards. <a href="https://t.co/7FsfZ3Zkuk">pic.twitter.com/7FsfZ3Zkuk</a></p>&mdash; Enrique Perrella (@Enrique77W) <a href="https://twitter.com/Enrique77W/status/1784737773464735912?ref_src=twsrc%5Etfw">April 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement