ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! |John Abraham Has Not Tasted Sugar In 25 Years Does Not Drink Or Smoke, More Details Inside | Sakshi
Sakshi News home page

John Abraham Fitness Secret: ఆజానబాహుడిలా ఉండే జాన్‌ అబ్రహం ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! అందుకే..!

Published Fri, May 3 2024 4:32 PM | Last Updated on Fri, May 3 2024 5:56 PM

John Abraham Has Not Tasted Sugar In 25 Years  Does Not Drink Or Smoke

బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడాటానికి ఆజానుబాహుడిలా యువ హీరోలకి తీసిపోని బాడీ ఫిజిక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. చూడటానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. ఇప్పటికీ సినిమాల్లో షర్ట్‌ తీసేసి మంచి దేహదారుఢ్యంతో కనిపిస్తాడు. ఐదుపదుల వయసొచ్చిన అదే ఫిజిక్‌ని మెయింటెయిన్‌ చేస్తాడు. చాలామంది హీరోలు యంగ్‌ హీరోలా లుక్‌ మెయింటెయిన్‌ చేసినా.. యువకుడి మాదిరి కండలు తిరిగిన దేహం మెయింటెయిన్‌ చేయడం కుదరదు. 

అందుకే చాలామంది పెద్ద హీరోలు ఓ ఏజ్‌ తర్వాత షర్ట్‌ తీసి కెమెరా ముందుకు రారు. కానీ జాన్‌ అబ్రహం అలా కాదు. దర్శకులు సైతం అతని బాడీ ఫీగర్‌ సినిమాలో కచ్చితంగా కనిపించేలా చూసుకుంటారు. అంతలా జాన్‌ అబ్రహం తన ఫిజిక్‌ని మెయింటెయిన్‌ చేస్తాడు. బ్రిటిష్‌-పాకిస్తానీ నటుడు అలీఖాన్‌ జాన్‌ అబ్రహంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. జాన్‌ తన శరీరాకృతి కారణంగానే హీరోగా నిలదొక్కుకున్నాడా అని ఓ ఇంటర్యూలో యాంకర్‌ ప్రశ్నించగా..అందుకు అలీ ప్రతిభ లేకుండా ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. 

ప్రస్తుతం జాన్‌ అబ్రహం వయసు 51 అయినా..ఈ వయసులో కూడా చొక్కా లేకుండానే సినిమాల్లో కనిపిస్తుంటాడని అలీ సతీమణి చాందిని నవ్వుతూ చెప్పారు. అందుకు అతడు అనుసరించే కఠిన జీవనశైలేనని అన్నారు. జాన్‌ 25 ఏళ్లుగా అస్సలు చక్కెర రుచే చూడలేదని చెప్పారు. చక్కెరకు ప్రత్యామ్నయాలను మాత్రమే తీసుకుంటాడని చెప్పారు. అలాగే మద్యం, సిగరెట్‌ వంటి వాటిని సరదాకి కూడా ట్రై చేయలేదని, అదే అతడి బాడీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ హీరోలలో మంచి శరీరాకృతికి పేరుగాంచినవాడు జాన్‌. 

ఇక జాన్‌ శిల్పాశెట్టితో కలిసి ఒక షోలో సందడి చేశారు. ఆ షోలో తన లైఫ్‌ స్టయిల్‌కి సంబంధించిన పలు ఆసక్తికర  విషయాలను షేర్‌ చేసుకున్నారు జాన్‌. తాను రైతు మాదిరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఫిటెనెస్‌ మెయిటెయిన్‌ చేయడం అనేది ప్రధానంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందని, అందులో ఒకటి ఆహారం, వ్యాయామం, చివరిగా నిద్ర అని చెప్పుకొచ్చారు జాన్‌. 

వాటిలో ఏది సరిగా లేకపోయినా.. మంచి ఫిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేయడం అనేది సాధ్యం కాదని అన్నారు. అలాగే తాను ప్రతిరోజు ఉదయం 4.30 గంటల కల్లా నిద్ర లేస్తానని, పైగా తనకెంతో ఇష్టమైన కాజు కల్తీ డెజర్ట్‌ని మూడు దశాబ్దలకు పైగా రుచి చూడకుండా నోటిని అదుపులో ఉంచినట్లు తెలిపారు. తన వద్ద ఎలాంటి ఎరేటెడ్‌ డ్రింక్స్‌ కూడా ఉండవని, తన దృష్టిలో చక్కెర అనేది అతిపెద్ద విషం అని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పుకొచ్చాడు జాన్‌. 

అంతేగాదు సిగరెట్‌ కంటే పాయిజన్‌ చక్కెరే అని జాన్‌ చెబుతున్నాడు. ఎంతటి సెలబ్రిటీలైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. అది కూడా వాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో ఫాలో అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. మనం కనీసం వారిలా కాకపోయినా ఆరోగ్యంగా ఉండేందుకైనా మంచి జీవనశైలిని పాటించేందుకు యత్నించడం బెటర్‌ కదూ..!

(చదవండి: ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement