White vinegar
-
ఇంటిప్స్
ఆకుకూరలు వండిన తర్వాత కూడా రంగు మారకుండా పచ్చగానే ఉండాలంటే... మొదట నూనె వేసినప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి, ఆపైన మిగతా పదార్థాలన్నీ వేయాలి. కొబ్బరి ఎండిపోయినట్టుగా అనిపిస్తే... దాన్ని తురిమి, కొద్దిగా నీళ్లతో తడిపి పక్కన పెట్టాలి. కాసేపటికి తాజా కొబ్బరిలా అయిపోతుంది.వడియాలు, అప్పడాల వంటివి వేయించాక నూనె నల్లబడిపోయి మళ్లీ వాడటానికి వీలు కాకుండా అయిపోతే... అందులో కాస్త వైట్ వెనిగర్ వేసి స్టౌమీద పెట్టి, కాసేపు సిమ్‌లో ఉంచి వెచ్చబెట్టాలి. కాసేపటికి నూనె మామూలు రంగులోకి వచ్చేస్తుంది. మరోసారి వాడుకోడానికి వీలవుతుంది. {Vేవీ ఐటమ్స్ చేసేటప్పుడు నాలుగు జీడిపప్పులను పాలతో కలిపి పేస్ట్ చేసి వేస్తే... గ్రేవీ చిక్కగా ఉండటంతో పాటు చక్కని సువాసన వస్తుంది. -
చెడు వాసన పోవాలంటే...
ఇంటిప్స్ పొగ, ఇతర మాడు వాసన త్వరగా పోవాలంటే వైట్ వెనిగర్‌ను ఒక చిన్న గిన్నెలో పోసి గదిలో ఉంచాలి.బట్టలు ఉతికాక అందులో కొన్ని చుక్కల వైట్ వెనిగర్ వేసి నానబెట్టి, పది నిమిషాల తర్వాత ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల దుర్వాసన వదులుతుంది. అర సగం నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది, దాంత్తో వంటగదిలోని పొయ్యి గట్టు తుడిచి కడిగితే క్రిములు, దుర్వాసన దరిచేరకుండా ఉంటుంది. వాష్ నుంచి తెచ్చిన దుస్తులను అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు ఉంచకుండా, తీసి అల్మరాలో భద్రపరచాలి. కొన్నాళ్లుగా ప్లాస్టిక్ బ్యాగులో దుస్తులు అలాగే ఉంటే అవి అక్కడక్కడా పసుపు రంగుమారే అవకాశం ఉంది.లేజర్‌తో కాళ్ల రోమాలను షేవ్ చేయాలనుకుంటే సబ్బు ఒక్కటే కాకుండా కొద్దిగా జుట్టుకు ఉపయోగించే కండిషనర్‌ని కూడా ఉపయోగించాలి. ఇలా చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు.