ఇంటిప్స్
ఆకుకూరలు వండిన తర్వాత కూడా రంగు మారకుండా పచ్చగానే ఉండాలంటే... మొదట నూనె వేసినప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి, ఆపైన మిగతా పదార్థాలన్నీ వేయాలి. కొబ్బరి ఎండిపోయినట్టుగా అనిపిస్తే... దాన్ని తురిమి, కొద్దిగా నీళ్లతో తడిపి పక్కన పెట్టాలి. కాసేపటికి తాజా కొబ్బరిలా అయిపోతుంది.వడియాలు, అప్పడాల వంటివి వేయించాక నూనె నల్లబడిపోయి మళ్లీ వాడటానికి వీలు కాకుండా అయిపోతే... అందులో కాస్త వైట్ వెనిగర్ వేసి స్టౌమీద పెట్టి, కాసేపు సిమ్‌లో ఉంచి వెచ్చబెట్టాలి.
కాసేపటికి నూనె మామూలు రంగులోకి వచ్చేస్తుంది. మరోసారి వాడుకోడానికి వీలవుతుంది. {Vేవీ ఐటమ్స్ చేసేటప్పుడు నాలుగు జీడిపప్పులను పాలతో కలిపి పేస్ట్ చేసి వేస్తే... గ్రేవీ చిక్కగా ఉండటంతో పాటు చక్కని సువాసన వస్తుంది.