Greens
-
Sagubadi: ప్రకృతి ఆహారం.. పక్కా లోకల్!
తొలకరితో పాటే వచ్చే అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (జూన్ 5) ఈ ఏడాది లక్ష్యం: ’భూముల పునరుద్ధరణ, ఎడారీకరణను, కరువును తట్టుకునే దిశగా పనిచేయటం’. మట్టిలో సేంద్రియ కర్బనం 0.3%కి పడిపోయింది. దీన్ని పెం΄÷ందించుకోవటానికి, పనిలో పనిగా భూతాపాన్ని తగ్గించడానికి సేద్యం మొత్తాన్నీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటం తప్ప మరో మేలైన దారి లేదన్నది నిపుణుల మాట.ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు భూమిని శాశ్వతంగా బాగుచేసుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వారు పండించిన అమృతాహారాన్ని స్థానిక మార్కెట్లలోనే నేరుగా ప్రజలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్రకృతి/సేంద్రియ రైతులతో పాటు ఈ ఆహారాన్ని కొనుగోలు చేస్తున్న వినియోగదారులు కూడా పర్యావరణ పరిరక్షణకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆహార రంగంలో చోటు చేసుకుంటున్న గుణాత్మక మార్పుల గురించి ప్రత్యేక కథనం..!ప్రకృతి వ్యవసాయంలో మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) విస్తారంగా సాగవుతోంది. రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకంగా పండించిన ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్థానిక మార్కెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్ శాఖ తోడ్పాటుతో ఏపీ రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది.ప్రకృతి వ్యవసాయంలో స్థానిక రైతులు పండించిన ఆహారోత్పత్తులను స్థానిక ప్రజలకే తొలుత అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. స్థానిక మార్కెట్లలో, రైతుబజార్లలో, వైఎస్సార్ చేయూత మహిళా రూరల్ మార్ట్‌లలో రైతుల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమం ్రపారంభమైంది. విజయవాడ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రతి సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజలు తరలి వస్తారు కాబట్టి అదే రోజు నమ్మకమైన ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, సాధారణ మార్కెట్‌తో పోల్చినప్పుడు ఇక్కడ 10–15% అదనపు ధర రైతులకు లభిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ సీనియర్ మార్కెటింగ్ లీడ్ బి. ప్రభాకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.జిల్లా, మండల కేంద్రాల్లో ఉత్పత్తులు విక్రయిస్తున్న ప్రకృతి వ్యవసాయదారులు427 మండల కేంద్రాల్లో అమ్మకాలు..ఏపీలోని 26 జిల్లా కేంద్రాలకు గాను 22 చోట్ల, 663 మండలాలకు గాను 427 మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను రైతులు అమ్ముతున్నారని ప్రభాకర్ వివరించారు. అదేవిధంగా, 113 మునిసిపాలిటీలకు గాను 24 మునిసిపాలిటీలలోనూ తాము పండించే ఉత్పత్తులను గత 2–3 నెలలుగా ప్రకృతి వ్యవసాయదారులు విక్రయిస్తున్నారు. వైఎస్సార్ చేయూత మహిళా గ్రామీణ మార్ట్లు 47 ఉండగా ఇప్పటికి 32 మార్ట్‌లలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను అందుబాటులోకి తెచ్చారు.ఆకర్షిస్తున్న ‘కంటెయినర్ రైతుబజార్లు’..ఏపీలో 96 రైతుబజార్లు పట్టణ ్రపాంత వినియోగదారులకు నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో ఇప్పటికే 47 రైతుబజార్లలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే స్టాల్స్ ఏర్పాటయ్యాయి. 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో 5 రైతుబజార్లలో మార్కెటింగ్ శాఖ తోడ్పాటుతో అవని ఆర్గానిక్స్ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రత్యేక కంటెయినర్లు ఏర్పాటు చేసింది. వీటిలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలను విక్రయించటం ఇటీవలే ్రపారంభించారు. పట్టణ ్రపాంతీయులను ఈ కంటెయినర్ రైతుబజార్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయని, మరో 33 రైతుబజార్లలో జూన్ రెండోవారంలో కంటెయినర్ దుకాణాలను ్రపారంభించనున్నామని ప్రభాకర్ వివరించారు. మున్ముందు దశలవారీగా ప్రతి రైతుబజారులోనూ కంటెయినర్ దుకాణాలు తెరుస్తామన్నారు.లోకల్ మార్కెటింగే మా వ్యూహం!రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తులతో పోల్చితే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. ఈ ఆహారోత్పత్తులను స్థానిక మార్కెట్ల ద్వారా సాధారణ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటమే మా మార్కెటింగ్ వ్యూహం. మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.– టి. విజయకుమార్, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ఏపీఆర్వైఎస్ఎస్.గ్రామాల్లో ‘ఫుడ్ బాస్కెట్లు’!ఏపీలో ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక బృందాలు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందాల సభ్యుల కుటుంబాలలోని వారందరికీ అవసరమయ్యే అన్ని రకాల ఆహారోత్పత్తులను ప్రకృతి వ్యవసాయంలో పండించినవే అందించాలన్న లక్ష్యంతో ఫుడ్ బాస్కెట్స్ కార్యక్రమానికి రైతుసాధికార సంస్థ 7 నెలల క్రితం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి 76 గ్రామాల్లో ఈ ఫుడ్ బాస్కెట్ స్కీమ్ ్రపారంభమైందని, త్వరలో 129 గ్రామాలకు విస్తరించనున్నామన్నారు. వీరికి ఆయా గ్రామాల్లో పండించేవి చాలకపోతే, పక్క గ్రామాలు, మండలాల నుంచి సేకరించి అందిస్తున్నారు.గ్రామీణులకు తొలి ్రపాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ఫుడ్ బాస్కెట్స్ అందిస్తుండటం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తున్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సిబ్బంది, సందర్శకులకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులన్నిటినీ విక్రయించేందుకు జూన్ రెండో వారం నుంచి ప్రత్యేక స్టాల్‌ను ్రపారంభించనున్నామని ప్రభాకర్ (97714 63539) చెప్పారు. స్థానిక మార్కెట్ల ద్వారా స్థానిక ప్రజలకు ప్రకృతి ఆహారాన్ని విస్తృతంగా అందుబాటులోకి తేవటం సంతోషదాయకం.– బి.ప్రభాకర్, సీనియర్ మార్కెటింగ్ లీడ్, ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ -
R Rajeshwari: కాదేది ఉపాధికనర్హం!
గృహిణిగా ఇంటి బాధ్యతలు మహిళలకు ఎలాగూ తప్పదు. ఇక ఆదాయ మార్గం గురించి ఆలోచించడం, వాటిని అమలులో పెట్టడం అంటే తగిన వనరులే కాదు ఇంటిల్లిపాదీ అందుకు సహకరించాలి. హైదరాబాద్ బండ్లగూడ నాగోల్‌లో ఉంటున్న ఆర్.రాజేశ్వరి ని కలిసినప్పుడు ‘పదేళ్లుగా చేస్తున్న పచ్చళ్లు, పొడుల వ్యాపారం... ఆదాయంతో పాటు బిజినెస్ ఉమన్‌గానూ గుర్తింపును తెచ్చిపెట్టింది’ అని వివరించింది. ‘మన ఇళ్లల్లో అన్ని కాలాల్లోనూ ఏవో ఒక పచ్చళ్లు పెట్టడం అనేది గృహిణులకు అలవాటైన పనే. ఇంట్లో నేనూ అలాగే చేస్తుండేదాన్ని. నా చేతి పచ్చళ్లు రుచికరంగా ఉంటాయని ఇంట్లోనూ, బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్లు బాగా మెచ్చుకునేవారు. అడిగి మరీ చేయించుకునేవారు. దీనికితోడు నాకు తెలిసిన వాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు తమకు నచ్చిన పచ్చడి, పొడులు తయారు చేసిమ్మని అడిగేవారు. పదేళ్ల క్రితం... నోటి మాటతోనే ఒకరొకరుగా పచ్చళ్లు చేసిమ్మని అడిగేవారి సంఖ్య పెరగడం మొదలయ్యింది. దీనినే చిన్న వ్యాపారంగా మార్చుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. మా ఊరు గుంటూరుకు వెళ్లినప్పుడల్లా అక్కడ రైతుల దగ్గరకు వెళ్లి, కావల్సిన సరుకులను నేరుగా పొలాల నుంచే సేకరించేదాన్ని. ఒకటే నియమం పెట్టుకున్నాను. కేవలం వెజ్ పచ్చళ్లును మాత్రమే పెట్టాలి. అలాగే, రసాయనిక ఎరువు వాడకుండా పండించిన ఆర్గానిక్ పంటల నుంచే సేకరించాలనుకున్నాను. నేరుగా రైతులను కలిసి, వారి ద్వారా పంటలను కొనుగోలు చేయడం, వాటిని బాగుచేయించి, తీసుకురావడమూ పెరిగింది. మిర్చి, పసుపు, మసాలా దినుసులు వంటివి ఏయే ప్రాంతాల్లో ఏయే ఏవి అధికంగా పండుతాయో తెలుసుకుని, ఆ దినుసులను సేకరిస్తూ ఉంటాను. ఒక్కరిగానే... మొదట్లో ఒక్కదాన్నే పచ్చళ్లకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకునేదాన్ని. అందుకు తగిన పనుల ప్లానింగ్ కూడా చేసుకున్నాను. మెల్లగా మార్కెట్ పెరుగుతుండటంతో సాయానికి మరొకరిని నియమించుకుని, పనులు చేస్తూ వచ్చాను. కామాక్షి ఫుడ్స్ పేరుతో పదేళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని రిజస్టర్ చేయించుకొని, ఇప్పుడు నాతోపాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. మొదట్లో అంతగా తెలియకపోయినా మార్కెట్ గురించి నాకు నేనుగానే ఓ అంచనా వేసుకుంటూ షాప్స్, ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్ల ద్వారానూ పచ్చళ్లు సిద్ధం చేస్తుంటాను. టొమాటో, గోంగూర, మాగాయ, నిమ్మకాయ, చింతకాయ.. వంటి పచ్చళ్లు, పొడుల తయారీ రోజూ ఉంటుంది. రోజూ ఉదయం నాలుగు గంటల నుంచే మొదలయ్యే నా దినచర్య తిరిగి, రాత్రి పదిగంటలకే పూర్తవుతుంది. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు ఉద్యోగి. ఇల్లు, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. ఏడాదికి ఇరవై లక్షల ఆదాయంతో ఈ మార్గం నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నా చేత్తో నలుగురికి రుచికరమైన పచ్చళ్లను అందివ్వడమే కాదు, నాతో పాటు ఇంకొందరికి ఉపాధినివ్వడం సంతోషంగా ఉంది. ఆర్డర్లను బట్టి తయారీ విధానాన్ని ఎంచుకుంటాను కాబట్టి నష్టం అనే సమస్య ఎప్పుడూ రాలేదు. చేసే పనిలో ముందుగానే అంచనా ఉంటే అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఇంటితోపాటు సమర్థవంతంగా నిర్వర్తించే సత్తా మహిళలకెలాగూ ఉంటుంది’ అని వివరిస్తుంది రాజేశ్వరి. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
వ్యర్థాలతో పోషక జలం!
కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సౌలభ్యం ఏమిటంటే.. ఏరోజుకారోజే పోషక జలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో రెండు పద్ధతులున్నాయి. మొదటిది.. వంట కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని సాధారణంగా సింక్‌లో పారబోస్తుంటాం. కానీ, అలా పారబోయకుండా.. వంటింట్లోనే ఒక మూలన ప్రత్యేకంగా ఇందుకోసం ఒక బక్కెట్‌ను ఉంచండి. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఉదయం నుంచి దాంట్లో పోస్తూ ఉండండి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తరిగినప్పుడు వచ్చిన తొక్కలు, ముక్కలను ఆ నీటిలో వేయండి. బక్కెట్‌పై ఈగలు మూగకుండా మూత పెట్టండి. సాయంత్రం (నియమం ఏమిటంటే.. బియ్యం, పప్పులు కడిగిన నీటిలో వేసిన వ్యర్థాలు 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు) వంట పూర్తయిన తర్వాత.. ఆ బక్కెట్లో నీటిలో నుంచి తొక్కలు, ముక్కలను బయటకు తీసి లేదా వడకట్టి.. ఆ పోషక జలాన్ని మొక్కల కుండీల్లో పోసుకోండి. ఇలా పోస్తూ ఉంటే.. మొక్కలు అంతకుముందు కన్నా కళగా, ఏపుగా పెరుగుతుండటం గమనించవచ్చు. మిగిలిన వ్యర్థాలను మీరు ఇప్పటికే కంపోస్టు తయారు చేస్తూ ఉన్నట్లయితే కంపోస్టు పిట్ లేదా పాత్రల్లో వేయండి. ఒకవేళ.. ఇంకా కంపోస్టు తయారు చేయడం ప్రారంభించకపోతే.. ఆ వ్యర్థాలను కూడా బయట పారేయనక్కర లేదు. అందుకు ఇంకో ఉపాయం ఉంది. కూరగాయలు, పండ్ల తొక్కలను.. నీటి లో నుంచి బయటకు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మిక్సీలో వేయండి. దాన్ని పోషక జలంతో కలిపి కుండీలు, మడుల్లో మీరు పెంచుకుంటున్న ఇంటిపంటలకు పోసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పోషక జలం మరీ చిక్కగా లేకుండా మట్టిలో ఇంకిపోయేలా ఉండేలా చూసుకోవాలి. పెరట్లో పెరిగే చెట్లకు కూడా పోసుకోవచ్చు. వారానికి రెండు సార్లు పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది. -
ఈట్ గ్రీన్ ఫర్ గుడ్ బ్రెయిన్!
వాషింగ్టన్: ఆకుకూరలు ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. అయితే ఆ కూరలు ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచడమేకాదు.. మన వయసును తగ్గిస్తాయట. అదెట్లా? అని ఆశ్చర్యపోవద్దు.. ఎందుకంటే ఆకు కూరలు మెదడు వయసును తగ్గిస్తాయట. అంటే... మన శరీరం వయసు పెరిగినా దాని ప్రభావం మెదడుపై పడకుండా చేస్తాయట. దీనివల్ల ఆకుకూరలు తినేవారు మరింత చురుగ్గా కనిపిస్తారట. రోజూ ఆకుకూరలను తమ ఆహారంలోభాగం చేసుకున్నవారు మిగతావారితో పోలిస్తే 11 సంవత్సరాలు వయసు తక్కువగా కనిపిస్తారని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమెరికాలోని రష్ యూనివర్సిటీ తన జర్నల్‌లో ప్రచురించింది. పరిశోధనలోభాగంగా ప్రతిరోజూ ఆకుకూరలు తినేవారికి, అప్పుడప్పుడు మాత్రమే తినేవారికి కొన్ని పరీక్షలు పెట్టారు. వీరిలో ప్రతిరోజూ ఆకుకూరలు తినేవారు ఏదైనా ఆలోచించేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదట. మిగతావారు మాత్రం చిన్నపాటి విషయాలకు కూడా గంటల తరబడి ఆలోచించడాన్ని గమనించారట. దీనికి కారణం వారి శరీర వయసుకంటే మెదడు వయసు ఎక్కువగా ఉండడమేనని గుర్తించారు. -
ఇంటిప్స్
• ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటుంది. • పచ్చిమిర్చి తొడిమలు తీసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. • బియ్యప్పిండి, శనగపిండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫాలిథిన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. -
ఇంటిప్స్
ఆకుకూరలు వండిన తర్వాత కూడా రంగు మారకుండా పచ్చగానే ఉండాలంటే... మొదట నూనె వేసినప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి, ఆపైన మిగతా పదార్థాలన్నీ వేయాలి. కొబ్బరి ఎండిపోయినట్టుగా అనిపిస్తే... దాన్ని తురిమి, కొద్దిగా నీళ్లతో తడిపి పక్కన పెట్టాలి. కాసేపటికి తాజా కొబ్బరిలా అయిపోతుంది.వడియాలు, అప్పడాల వంటివి వేయించాక నూనె నల్లబడిపోయి మళ్లీ వాడటానికి వీలు కాకుండా అయిపోతే... అందులో కాస్త వైట్ వెనిగర్ వేసి స్టౌమీద పెట్టి, కాసేపు సిమ్‌లో ఉంచి వెచ్చబెట్టాలి. కాసేపటికి నూనె మామూలు రంగులోకి వచ్చేస్తుంది. మరోసారి వాడుకోడానికి వీలవుతుంది. {Vేవీ ఐటమ్స్ చేసేటప్పుడు నాలుగు జీడిపప్పులను పాలతో కలిపి పేస్ట్ చేసి వేస్తే... గ్రేవీ చిక్కగా ఉండటంతో పాటు చక్కని సువాసన వస్తుంది. -
ఆకుల అలలు..
బ్యూటిప్స్ తాజా ఆకుకూరలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం మెరగవుతుంది. అలాగే శిరోజాల నిగనిగలు పెరగాలంటే ఆకులతో చెలిమి చేయాలి.రెండు కప్పుల నీళ్లను మరిగించి అందులో 5-6 తాజా /ఎండు తేయాకులను వేసి, మూత పెట్టాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని తల వెంట్రుకలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూ వాడకుండా కేవలం చల్లని నీటితో తలను శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారైనా ఇలా చేయడం వల్ల కేశాలు పొడిబారవు. చిట్లడం వంటి సమస్యలు కూడా రావు. గుప్పుడు తులసి ఆకులను తీసుకొని మెత్తగా రుబ్బి, రసం తీయాలి. ఈ రసాన్ని మాడుకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. చుండ్రు, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.కలబంద ఆకును మధ్యకు విరిచి, దాని నుంచి వచ్చిన జెల్‌ను తలకు రాయాలి. తలస్నానం చేసిన తర్వాత కలబంద జెల్ ప్యాక్ వేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల వెంట్రుకలకు కండిషనర్ లభించి, మృదువుగా మారుతాయి. వేప ఆకులను శుభ్రం చేసి, ముద్దగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చుండ్రు, పేల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. -
తొడిమలు తీస్తే... తాజా!
ఇంటిప్స్ బెండకాయలకు రెండు వైపులా ఉన్న తొడిమెలను తీసేసి వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి.అల్లం-వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది. ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథా కావు. అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తపడకుండా ఉంటాయి. -
మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు!
18 అడుగుల మడిలో ఇంటిపంటల సాగు ఈ ఫొటోలో ఉన్న ఆకుపచ్చని ఇటుకల మడి.. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఆకుకూరలు అందిస్తోంది. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు.. అంతా కలిపితే 18 చదరపు అడుగుల నేల. అయితేనేం.. ఈ చిన్న మడిలోనే కేతిరెడ్డి విజయశ్రీ(98495 27445) ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి సరిపడా సేంద్రియ ఆకుకూరలు పండిస్తున్నారు. భర్త కృపాకర్‌రెడ్డి ఇంటిపంటల సాగులో ఆమెకు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కల్యాణ్పురిలో తాము అద్దెకుంటున్న ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇటుకలతో చిన్న మడిని ఏర్పాటు చేసుకున్నారు. మెంతికూర, దుంప బచ్చలికూర, గోంగూర, పాలకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర.. పెంచుతున్నారు. వీటితోపాటు కాకర, బీర తీగలను కుండీల్లో సాగు చేస్తున్నారు. మూడొంతులు ఎర్రమట్టి, ఒక వంతు పుట్ట మన్ను, ఒక వంతు పశువుల ఎరువును కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొదట్లో ఎర్రమట్టి ఒక్కటే ఉపయోగించటంతో మొక్కలు సరిగ్గా ఎదగలేదని.. పుట్టమట్టి, పశువుల పేడ కలిపిన తర్వాత ఏపుగా పెరుగుతున్నాయని విజయశ్రీ వివరించారు. ‘గత మూడేళ్లుగా మేం ఏనాడూ ఆకుకూరలు కొనలేదు. అతి తక్కువ స్థలమే కావటంతో ఇంటి యజమానులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పురుగులు, వాటి గుడ్లు కనిపిస్తే చేతులతోనే తీసివేస్తాను. రైతు కుటుంబంలో పుట్టి పెరట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవటం సంతృప్తిగా ఉందంటున్నారు విజయశ్రీ. -
పోషకాలు పోకుండా...
కూరగాయలు కరెక్ట్‌గా కడగండి ఆహారాన్ని తినడం ఎంత ముఖ్యమో, దాన్ని అపాయకరం కాకుండా, సురక్షితంగా ఉండేలా చూసుకోవడమూ అంతే ముఖ్యం. తినేముందు మనం చేతులు కడుక్కోవడం ఎంత ప్రధానమో, మనం తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రం చేయడమూ అంతే అవసరం. అయితే అన్నిరకాల కూరగాయలనూ ఒకేరకంగా శుభ్రం చేయడం సరికాదు. పదార్థాన్ని బట్టి శుభ్రం చేసే తీరుతెన్నులేమిటో తెలుసుకుందాం. ఆహారం శుభ్రం చేయడానికి ముందు చేతులూ శుభ్రంగా ఉండాలి... మనం ఏదైనా ఆహారం శుభ్రం చేయడానికి ముందుగా మనం చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో చేతుల్ని కడుక్కోవాలి. లేకపోతే మన చేతికి ఉన్న అపరిశుభ్రమే మన ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఆహారం శుభ్రపరచడంలో చేయకూడనివి... ఆహారాన్ని ఎప్పుడైనా సబ్బుతోగాని, డిటెర్జెంట్‌తో గాని, బ్లీచింగ్ పదార్థాలతో గాని, రసాయన పదార్థాలతోగాని శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోండి. కేవలం పరిశుభ్రమైన నీటితో మాత్రమే శుభ్రం చేయాలని తెలుసుకోండి. ఆహారాన్ని ఎలా శుభ్రం చేయాలంటే... ఆహారాన్ని శుభ్రం చేసే ముందర వాటిని శుభ్రమైన నీటితో లేదా తగినన్ని నీళ్లు పోసి పలచగా చేసిన వెనిగర్ సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. ఈ సొల్యూషన్ తయారు చేయడానికి అవలంబించాల్సిన పద్ధతి... నాల్గింట మూడొంతుల నీళ్లు తీసుకొని అందులో కేవలం ఒక వంతు వెనిగర్ పోసి ఈ సొల్యూషన్‌ను తయారు చేయాలి. ఒకవేళ ఇవేవీ లేకుండా కేవలం కిచెన్‌లోని నీళ్లతోనే శుభ్రం చేస్తుంటే కడగబోయే కూరగాయలపైనా, పండ్లపైనుంచి నీరు కాసేపు పైనుంచి పడుతూ ప్రవహించేలా చేయాలి. వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి... చిన్న తొడిమకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా తొడిమ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు తొడిమ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్ పండు, పీచ్ పండ్లకు వర్తిస్తుంది.మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు.ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం. దుంపల్ని కూరల్ని శుభ్రం చేయడమిలా... మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్ వంటి వాటిని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి.కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి.కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే దోసకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగి,కోయాలి. కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత వాటిని కాస్తంత నిమ్మనీరు లేదా చిటికెడు ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు లేదా చిటికెడు ఉప్పు లేదా 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు తొలగిపోతాయి.పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి. మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా... కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ-కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు ఆకుకు కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి. కడగటం అవసరం లేకున్నా ఒకసారి కడిగితే మేలు.. వాస్తవానికి ఈ కింద పేర్కొన్న ఆహారపదార్థాలను కడగాల్సిన అవసరం లేదు. కడగకున్నా పర్లేదు. అయినా ఒకసారి కడగడం వల్ల నష్టం లేదు. అవి... ఉల్లిగడ్డ అవకాడో మొక్కజొన్నగింజలు పైనాపిల్ మామిడిపండ్లు కివీ క్యాబేజీ బొప్పాయి పుచ్చకాయ బ్రకోలీ టొమాటో చిలగడదుంప (మోరంగడ్డ) వేటిని కడగకూడదు... లేబుల్స్ మీద అప్పటికే ‘రెడీ టు ఈట్’, ‘వాష్డ్’, ‘ట్రిపుల్ వాష్డ్’, ‘డోంట్ వాష్’ అని ప్రత్యేకంగా, నిర్దిష్టంగా రాసినవి మాత్రం కడగకూడదు. ఒకసారి శుభ్రంగా కడిగి, కట్ చేసుకున్న తర్వాత వెంటనే వాడుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మళ్లీ నిల్వ చేయాల్సి వస్తే వాటిని ఫ్రిజ్‌లో 40 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాలి. ఒకవేళ కట్ చేసి ఉన్న పదార్థాలే కొనాల్సి వస్తే అవి ఫ్రిజ్‌లో లేకుండా విడిగా ఉంటే మాత్రం కొనవద్దు. -
కుక్డ్... అన్కుక్డ్
పచ్చిగా తినాల్సినవివీ... వండి తినాల్సినవివీ... కూరగాయలు, ఆకుకూరల్లోని పోషకాలను గరిష్టస్థాయిలో పొందాలంటే, వాటిలో కొన్నింటిని పచ్చిగానూ, మరికొన్నింటిని వండుకుని తినాలని బ్రిటీష్ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. క్యారట్లు, టొమాటోలు, క్యాబేజీ, మొలకెత్తిన గింజలు వంటివి వండిన తర్వాత తింటే వాటి ద్వారా రెట్టింపు పోషకాలు లభిస్తాయని పేర్కొన్నారు. క్యాప్సికమ్, బ్రకోలి, పాలకూర వంటివి పచ్చిగా తింటేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. టొమాటోల్లో ఉండే లైకోపిన్, క్యారట్లలో ఉండే బీటా కెరోటిన్ వాటిని ఉడికించినప్పుడు రెట్టింపవుతాయని వివరించారు. పాలకూరలో ఉండే కెరోటినాయిడ్స్, కేప్సికమ్లో ఉండే విటమిన్ ‘సి’ వాటిని పచ్చిగా తిన్నప్పుడే పుష్కలంగా అందుతాయని విశదీకరించారు. శాకాహార పదార్థాలను తినాల్సిన పద్ధతిలో తింటే ఆరోగ్యం బాగుంటుందని బ్రిటిష్ డైటీషియన్ హెలెన్ బాండ్ వివరిస్తున్నారు. -
‘సంచుల్లో సేంద్రియ సేద్యం’!
తక్కువ స్థలంలో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలను ఏ కాలంలోనైనా సాగు చేయడానికి ఉపకరించేదే ‘సంచుల్లో సేంద్రియ సేద్యం’!. సేంద్రియ ఎరువులు కలిపిన మట్టిని ఖాళీ సంచుల్లో నింపి.. తక్కువ స్థలంలోనే ఏడాది పొడవునా సులభంగా ఇంటిపంటలు పండించడమే ‘సంచుల్లో సేంద్రియ సేద్యం’ (కల్టివేషన్ టవర్స్ అని కూడా అంటున్నారు). ఈ సంచుల పైభాగంలో, సంచికి చుట్టూ గాట్లు పెట్టి ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. పోషకాహార భద్రత కల్పించే లక్ష్యంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని పేద కుటుంబాలకు ఇంటికి 8-10 సంచులను పంచారు. తక్కువ ఖర్చుతో కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకునేందుకు ఇవి ఉపయోగపడ్డాయి. ఈ ప్రాజెక్టు నెదర్లాండ్స్‌కు చెందిన హివోస్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డు-2014ను దక్కించుకోవడం విశేషం. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇటీవల ప్రశంసాపత్రంతోపాటు రూ. 5.23 లక్షల నగదునూ నిర్వాహకులకు ఇచ్చారు. వీటిని మరింత మందికి అందించే మార్గాలను అన్వేషించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. -
పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు...
1. అల్పాహారాన్ని మానకూడదు. 2. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. 3. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. 4. మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు. 5. చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు. 6. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి. 7. రోజూ 45 నిమిషాలు యోగా చేయాలి. 8. ఐదు రకాల పండ్లు తీసుకోవాలి 9. ఐదు రకాల ఆకుకూరలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.. 10. అరగంటైనా రోజూ నడవాలి. -
సహజ ‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు!
‘సాక్షి’ ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన వివరిస్తున్నారు. జీవామృతం కావలసిన పదార్థాలు: తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచితం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, మగ్గిన అరటిపండ్లు 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం: పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. డ్రమ్ములో వేసి చేతితో బాగా కలపాలి. తరువాత ఆవు పంచితం వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని డ్రమ్ములో వేసి 35 లీటర్ల నీటిని పోయాలి. దీన్ని నీడలోనే ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి వైపు తిప్పుతూ కలపాలి. 4వ రోజు నుంచి వాడొచ్చు. వాడే విధానం: 7-10 రోజుల్లోగా జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు లేదా పిచికారీ చేయొచ్చు. ఘన జీవామృతం కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 2 కేజీలు, బెల్లం పావు కేజీ, ఏదైనా పప్పుల పిండి పావు కేజీ, ఆవు పంచితం తగినంత. తయారీ విధానం: తురిమిన బెల్లం, పిండి, ఆవుపేడ.. ఈ మూడిటిని బల్లపరుపుగా పరచిన ప్లాస్టిక్ షీట్ లేదా గోనెసంచిపై వేసి చేతితో బాగా కలిపి.. ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా తగినంత ఆవు పంచకం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో పూర్తిగా ఎండిన ఈ ఉండల్ని పొడి చేసుకొని ఒక గోనె సంచిలో నిల్వ ఉంచి సంవత్సరమంతా వాడుకోవచ్చు. వాడే విధానం: ఘన జీవామృతాన్ని మొక్క మొదట్లో గుప్పెడు చొప్పున ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి వేసుకోవాలి. ఇందులో నిద్రావస్థలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు నీరు తగిలినప్పుడు చైతన్యవంతమవుతాయి. వీటి ద్వారా మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. వేపకషాయం కావలసిన పదార్థాలు: తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, నాటు ఆవు పంచితం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వేపాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచితం చేతితో కలిపి, 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున వస్త్రంతో వడబోసి వాడుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. కీటకాల నివారిణి (మల్టీ పెస్ట్ కంట్రోలర్) కావలసిన పదార్థాలు: పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచితం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత. తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు ఊరబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎంతపాతదైతే అంత ఉత్తమం. ఎగ్ అమైనో ఆమ్లం కావలసిన పదార్థాలు: నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా (లీటరు ద్రవం పట్టేది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, (సేంద్రియ)బెల్లం పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం పోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి కలపాలి. మళ్లీ పది రోజుల వరకు నీడలో భద్రపరచాలి. 28 రోజులకు సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూసిన పూత రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. బూడిద - పసుపు మిశ్రమం కావలసిన పదార్థాలు: నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి: పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. తగినంత బూడిద తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కలపాలి. తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది. ఆచ్ఛాదన (మల్చింగ్) కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన (మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఎండిన ఆకులు, గడ్డీగాదంతో 7 -10 అంగుళాల మందాన మల్చింగ్ చేయవచ్చు. దీనివల్ల కుండీల్లో మట్టి తేమను ఎక్కువ రోజులుంటుంది. వానపాములకు అనువైన వాతావరణం ఏర్పడి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. (డా. శ్రీనివాసరావును 94922 93299 నంబరులో సాయంత్రం 7-8 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలి) -
ఇది ‘ఇంటిపంట’ల కాలం!
ఇంటి పంట సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు. జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా.. తోటకూర, టమాటా..! ‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను. - కాసా హరినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కేపీహెచ్‌బీ 7 ఫేజ్, హైదరాబాద్ జీవామృతం, అమృత్‌పానీ.. మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం, జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా.. -ఎస్. సత్యనారాయణ మూర్తి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి, రామనామక్షేత్రం, గుంటూరు ‘ఇంటిపంట’ల సేవలో.. వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా. మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా. - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్ ‘ఇంటిపంట’ శిక్షణ పొందా.. మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’ - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్ పూల మొక్కల నుంచి కూరగాయల వైపు.. పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్ ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - OrganicKitchen/Terrace Gardening గూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.comకు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు. -
హార్ట్‌ఫుల్ సూచనలు...
ఎప్పుడూ పనిచేసే యంత్రానికి కాసేపు విశ్రాంతి ఇస్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఈ సూత్రం మాత్రం దేహయంత్రంలోని గుండెకు మినహాయింపు. ఎందుకంటే... గుండె ఎప్పుడూ పనిచేస్తుంటేనే మనకు బాగుంటుంది. అది పనిమానేస్తానంటూ మొరాయించే పరిస్థితిని మనం రప్పించకూడదు. దానికి చేయాల్సినవి చాలా సులభం. గుండెను ఇంగ్లిష్‌లో హార్ట్ అంటారని గుర్తుపెట్టుకుని, ఆ హార్ట్ స్పెల్లింగ్‌లోని కొన్ని అంశాలను పాటిస్తే చాలు... అది గుర్తుపెట్టుకోడానికి వీలుగా ఈ కథనం... H హెచ్ ఫర్ హెల్దీ డైట్ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టిన ఆకుకూరలు, పండ్లలో సగానికి సగం పోషకాలు నశిస్తాయి. ఇక కొవ్వుల్ని కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలైన వెల్లుల్లినీ, రక్తనాళాలను శుభ్రపరిచే ద్రాక్ష వంటి పండ్లను, ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ లభ్యమయ్యే చేపలను మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. హెచ్ ఫర్ హ్యాపీనెస్: ఎప్పుడూ సంతోషంగా ఉండండి. తద్వారా మీలోని ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం పెంపొందుతుంది. E ఈ ఫర్ ఎక్సర్సైజ్ : వ్యాయామం అన్నది గుండె ఆరోగ్యానికి చాలా మంచి మార్గం. అయితే శ్రమ కలిగించే కఠినమైన వ్యాయామాలు కాకుండా నడక / జాగింగ్ వంటి తేలికపాటి సాధారణ వ్యాయామాలు అయితే మరీ మంచిది. ఈ ఫర్ ఎండార్ఫిన్స్ : వ్యాయామం వల్ల మనలో సంతోషం కలిగించే రసాయనాలైన ఎండార్ఫిన్ వంటివి వృద్ధి అవుతాయి. దాంతో రెండు ప్రయోజనాలన్నమాట. ఒకటి వ్యాయామం వల్ల కొవ్వులు, రక్తపోటు, మధుమేహం వంటివి అదుపులో ఉండటంతో పాటు అదే ప్రక్రియలో ఎండార్ఫిన్ కూడా స్రవించడం వల్ల సంతోషం, మానసిక ఉల్లాసం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఇది కూడా గుండెకు మేలు చేసేదే. A ఏ ఫర్ యాక్టివిటీ : బద్దకంగా ఒకేచోట కదలకుండా ఉండటం వల్ల స్మోకింగ్‌తో ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో అలాంటివే వస్తాయని అధ్యయనాల్లో తేలింది. మీకు ఒక విషయం తెలుసా? పదిలక్షల సార్లు స్పందించడం వల్ల గుండెకు కలిగే అలసటను ఒకసారి మనం చురుగ్గా పని చేయడం అన్న చర్య తొలగిస్తుందని కొన్ని పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. అందుకే ఆఫీసులోనూ లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం మంచిది. మనం చురుగ్గా ఉండటం గుండెపై మరింత ఒత్తిడిని కలగజేస్తుందన్నది అపోహ మాత్రమే. మనమెంత చురుగ్గా ఉంటే గుండెకు అంత మేలు. అందుకే అందరికీ వ్యాయామంతోపాటు మంచి వ్యాపకమూ (యాక్టివిటీ) ఉండాలి. R ఆర్ ఫర్ రెస్ట్ : ఇక్కడ రెస్ట్ అంటే ఆరోగ్యకరమైన విశ్రాంతి తప్ప బద్దకం కాదు. పగలు ఎంత యాక్టివ్‌గా ఉంటామో, రాత్రి మంచి నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిద్రలేమి రక్తపోటును పెంచి, వ్యాధి నిరోధకతను తగ్గిస్తుంది. ఆర్ ఫర్ రిఫ్రెషింగ్ మూడ్ : వారమంతా మీరు కష్టపడి చురుగ్గా పనిచేయడం గుండెకు ఎంత లాభమో, వారాంతపు విశ్రాంతి కూడా దానికి అంతే ప్రయోజనం. అయితే అతివిశ్రాంతి మళ్లీ గుండెకు అనర్థమన్నది గుర్తుపెట్టుకోండి. ఫర్ రొటీన్ హార్ట్ చెకప్ : మీకు 40 దాటితే ఏడాదికోసారి రొటీన్‌గా గుండె పరీక్షలను డాక్టర్ సలహా మేరకు చేయించుకోవడం మంచిది. T టీ ఫర్ టొమాటో: అని కూడా గుర్తుంచుకోవచ్చు. మీ ఆహారంలో టొమాటోను ఎంత గా వాడితే గుండెకు అంత మేలు అన్నమాట. టొమాటోకు ఎర్రటి రంగును తెచ్చిపెట్టే పదార్థం ‘లైకోపిన్’ అనే పోషకం. మనం లైకోపిన్‌ను ఎంతగా లైక్ చేస్తుంటే అది గుండె ఆరోగ్యాన్ని అంతగా ‘లైక్’ చేస్తుందని ‘పిన్’పాయింటెడ్‌గా గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ ట్రెడ్మిల్: మీ గుండె ఆరోగ్యానికి ట్రెడ్‌మిల్‌పై నడక కూడా ఒక సాధనం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ట్రెడ్మిల్కు ప్రాధాన్యం లేదు. కేవలం నడకకే. టీ ఫర్ ట్రెక్కింగ్ అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. అది కూడా నడక కోసమే. ఇక్కడ నడకకే ప్రాధాన్యం గాని ట్రెడ్మిల్ సాధనానికీ/ట్రెక్కింగ్ ప్రక్రియకూ కాదన్నమాట. -నిర్వహణ: యాసీన్