‘సంచుల్లో సేంద్రియ సేద్యం’! | 'Bags, organic farming'! | Sakshi
Sakshi News home page

‘సంచుల్లో సేంద్రియ సేద్యం’!

Published Wed, Mar 4 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

‘సంచుల్లో సేంద్రియ సేద్యం’!

‘సంచుల్లో సేంద్రియ సేద్యం’!

తక్కువ స్థలంలో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలను ఏ కాలంలోనైనా సాగు చేయడానికి ఉపకరించేదే ‘సంచుల్లో సేంద్రియ సేద్యం’!. సేంద్రియ ఎరువులు కలిపిన మట్టిని ఖాళీ సంచుల్లో నింపి.. తక్కువ స్థలంలోనే ఏడాది పొడవునా సులభంగా ఇంటిపంటలు పండించడమే ‘సంచుల్లో సేంద్రియ సేద్యం’ (కల్టివేషన్ టవర్స్ అని కూడా అంటున్నారు). ఈ సంచుల పైభాగంలో, సంచికి చుట్టూ గాట్లు పెట్టి ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. పోషకాహార భద్రత కల్పించే లక్ష్యంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని పేద కుటుంబాలకు ఇంటికి 8-10 సంచులను పంచారు. తక్కువ ఖర్చుతో కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకునేందుకు ఇవి ఉపయోగపడ్డాయి. ఈ ప్రాజెక్టు నెదర్లాండ్స్‌కు చెందిన హివోస్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డు-2014ను దక్కించుకోవడం విశేషం. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇటీవల ప్రశంసాపత్రంతోపాటు

రూ. 5.23 లక్షల నగదునూ నిర్వాహకులకు ఇచ్చారు. వీటిని మరింత మందికి అందించే మార్గాలను అన్వేషించడానికి ఈ మొత్తాన్ని
 వినియోగించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement