కుక్‌డ్... అన్‌కుక్‌డ్
పచ్చిగా తినాల్సినవివీ... వండి తినాల్సినవివీ...
కూరగాయలు, ఆకుకూరల్లోని పోషకాలను గరిష్టస్థాయిలో పొందాలంటే, వాటిలో కొన్నింటిని పచ్చిగానూ, మరికొన్నింటిని వండుకుని తినాలని బ్రిటీష్ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. క్యారట్లు, టొమాటోలు, క్యాబేజీ, మొలకెత్తిన గింజలు వంటివి వండిన తర్వాత తింటే వాటి ద్వారా రెట్టింపు పోషకాలు లభిస్తాయని పేర్కొన్నారు.
క్యాప్సికమ్, బ్రకోలి, పాలకూర వంటివి పచ్చిగా తింటేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. టొమాటోల్లో ఉండే లైకోపిన్, క్యారట్లలో ఉండే బీటా కెరోటిన్ వాటిని ఉడికించినప్పుడు రెట్టింపవుతాయని వివరించారు. పాలకూరలో ఉండే కెరోటినాయిడ్స్, కేప్సికమ్‌లో ఉండే విటమిన్ ‘సి’ వాటిని పచ్చిగా తిన్నప్పుడే పుష్కలంగా అందుతాయని విశదీకరించారు. శాకాహార పదార్థాలను తినాల్సిన పద్ధతిలో తింటే ఆరోగ్యం బాగుంటుందని బ్రిటిష్ డైటీషియన్ హెలెన్ బాండ్ వివరిస్తున్నారు.