ఇంటి సౌఖ్యం... మన బాధ్యత
ఇంటిప్స్
ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటే ఈ చిట్కా ఉపయోగించండి. బిర్యానీ ఆకును పౌడర్‌గా వేసి బొద్దింకలు వచ్చే చోట చల్లండి. ఆ వాసనకే అవి చచ్చిపోతాయి. {ఫిజ్‌లో క్రిములు చేరకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే చాలు. దాన్ని చిన్న బౌల్‌లో పోసి ఫ్రిజ్‌లో స్ప్రే చేయాలి. అలా చేస్తే అది బ్యాక్టీరియాను చంపడమే కాకుండా దుర్వాసన రాకుండా చూస్తుంది. ఇంట్లో చీమల్ని వదిలించడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
అవి బారులు బారులుగా ఉన్న చోట కొద్దిగా మిరియాల పొడి చల్లితే చాలు.ఆ ఘాటు వాసనకు అవి దూరంగా వెళ్లిపోతాయి.పండ్లు, కూరగాయలపై ఉండే రసాయనిక మందులు ఊరికే నీళ్లతో కడిగితే పోవు. అందుకే ఉప్పు కలిపిన నీటితో వాటిని కడిగితే ఆ కెమికల్స్ పూర్తిగా తొలగిపోతాయి.