
పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తీస్తున్న కొత్త సినిమా 'కాక్రోచ్'. విజయదశమి సందర్భంగా చిత్ర బృందం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే వయలెంట్ యాక్షన్ ప్రేమ కథ అని అంటున్నారు. పాత కొత్త నటీనటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది.
(ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)
బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెబుతూ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)
