ఇంటిప్స్
వంటింట్లో చిన్న చిన్న కిటుకులు పాటిస్తే పెద్ద సమస్యగా అనిపించేవి కూడా పరార్ అవుతాయి. ఎలా అంటే...నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుకర్ అడుగు భాగాన వేసి, రుద్ది చక్కగా శుభ్రపడటమే కాదు, దుర్వాసన కూడా రాదు. కందిపప్పులో స్పూన్ నూనె వేస్తే త్వరగా ఉడుకుతుంది. కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పులుపెక్కదు.క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి.
నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లి, తర్వాత శుభ్రపరచాలి. పిండి నూనెను త్వరగా పీల్చేస్తుంది.కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి, నీళ్లు చల్లి గంటసేపు ఉంచితే చేదు తగ్గుతుంది. వెల్లుల్లిపాయను మెత్తగా దంచి, కొన్ని నీళ్లు కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచాలి. పిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే, వడియాలు తెల్లగా వస్తాయి. నూనె పొంగకుండా ఉండాలంటే కాగేటప్పుడు చిన్న ఉండ చింతపండు వేయాలి. ఎండుకొబ్బరి చిప్ప చింతపండు డబ్బాలో వస్తే త్వరగా పురుగు పట్టదు.