ఇంటిప్స్
వంటపాత్రలు తోమేందుకు ఉపయోగించే సింక్, డిష్‌వాషర్ వంటి వాటి నుంచి దుర్వాసన వస్తుంటే, వాటిలో నీరు నిల్వలేకుండా చూడాలి. ఆ తర్వాత వాటిలో కాస్త వెనిగర్ పోసి వదిలేయాలి. కొద్దిసేపట్లోనే దుర్వాసన దూరమవుతుంది. పాతబడ్డ ఇళ్లలోని గదులు, టాయిలెట్స్‌లో తరచు దుర్వాసన వ్యాపిస్తుంటుంది. చెల్లాచెదురుగా పడిన చెత్త, ఆహార వ్యర్థాల వంటివి దుర్వాసనకు కారణమవుతుంటాయి. ముందుగా అలాంటివి గుర్తించి, వాటిని తొలగించాలి. ఆ తర్వాత గదుల మూలల్లో కలరా ఉండలు ఉంచాలి.
బాత్‌రూమ్‌లో దుర్వాసనగా ఉంటే, గాఢమైన పరిమళం గల ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా తీసుకుని, కాటన్‌బాల్స్‌పై వేసి, వాటిని బాత్‌రూమ్ మూలల్లో ఉంచితే చాలు. దుర్వాసన పోతుంది.పాతబడిన పరుపులు దుర్వాసన వస్తుంటే, వాటిపై బేకింగ్‌సోడా చల్లి దాదాపు రెండు గంటలు అలాగే వదిలేయండి. తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. అవి తాజాగా మారుతాయి.