dish washer
-
ఫ్రిజ్.. ఏసీ.. మైక్రోవేవ్.. దీర్ఘాయుష్మాన్‌భవ!
ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డిష్ వాషర్లు తదితర ఎల్రక్టానిక్స్ గృహోపకరణాలపై ఇప్పుడు వారంటీ వార్ నడుస్తోంది. వైట్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తులకు పోటీ పడి మరీ ఏళ్లకు ఏళ్లు రక్షణ కలి్పస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన ఉత్పత్తులపై 10–20 ఏళ్ల పాటు బ్రాండ్ వారంటీని అందిస్తున్నాయి. ఈ వ్యూహంతో డిమాండ్ కూడా పెరుగుతోందనేది పరిశ్రమ వర్గాల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు సేల్స్ పెంచుకోవడానికి కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, హయర్, గోద్రెజ్, వోల్టాస్, పానాసోనిక్ వంటి దిగ్గజ బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన విడిభాగాలకు 10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్ల కంప్రెషర్ల వంటి వాటికి ఇవి వర్తిస్తాయి. ఇక వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ మోటార్లపై ఏకంగా 20 ఏళ్ల వరకూ వారంటీ లభిస్తోంది. కొన్ని కంపెనీలైతే ఈ ఆఫర్లను ‘లైఫ్ టైమ్’ వారంటీగా కూడా పేర్కొంటుండటం విశేషం. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వినియోగదారులు అధిక వారంటీ ఆఫర్లకు బాగా ఆకర్షితులవుతున్నారని, దీంతో అమ్మకాలు కూడా పుంజుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు చెబుతున్నారు.రేటు ఎంత ఎక్కువైతే.... వారంటీ విషయంలో ఉత్పత్తుల రేటు కీలకంగా నిలుస్తోంది. ఎంత ప్రీమియం లేదా ఖరీదైన ఉత్పత్తి అయితే వారంటీ అంత ఎక్కువ కాలం ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని బ్రాండ్లైతే మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం పరిశ్రమ ప్రమాణాలకు మించి ఒకట్రెండు సంవత్సరాలు అధికంగా కూడా వారంటీని అందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, హయర్, వోల్టాస్ బెకో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్లపై 12 ఏళ్లు వారంటీ లభిస్తోంది.ఎల్జీ వారంటీ వ్యవధి 10 ఏళ్లు మాత్రమే. ఇక వాషింగ్ మెషీన్ ఇన్వర్టర్ మోటార్‌పై శాంసంగ్, హయర్ 20 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తుండగా... వోల్టాస్ బెకో, గోద్రెజ్ విషయంలో ఈ వ్యవధి 10 ఏళ్లు ఉంటోంది. అయితే, మొత్తం ఉత్పత్తిపై, అలాగే అన్ని విడిభాగాలపై పూర్తిస్థాయి వారంటీని మాత్రం దాదాపు అన్ని ప్రోడక్టులపై కంపెనీలన్నీ ఒకేలా ఇస్తున్నాయి. ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ప్రధాన విడిభాగాలపైనే... చాలా కంపెనీలు ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో ప్రధాన విడిభాగంపైనే ఎక్కువ కాలం వారంటీని ఇవ్వడానికి ప్రధాన కారణం.. దానికి మన్నిక అధికంగా ఉండటమే. అయితే, సుదీర్ఘ వ్యవధి పాటు వారంటీ ఇచ్చేందుకు కంపెనీలు కొంత ఎక్కువ మొత్తాన్ని పక్కనబెట్టాల్సి వస్తోందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ వ్యయాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. ఉదాహరణకు, ఫ్లాట్ ప్యానెల్ టీవీ సెట్లపై చాలా బ్రాండ్లు మూడేళ్ల వారంటీ ఇచ్చేందుకు భారీగా వెచ్చించాయి. మరోపక్క, ఈ రోజుల్లో టీవీ ప్యానెల్స్ 12–18 నెలల్లోనే పాడవుతున్న పరిస్థితి. దీంతో వారంటీ మేరకు కొత్త టీవీ ఇవ్వడం కోసం కంపెనీలకు తడిసిమోపెడైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.⇒ అధిక వారంటీ వ్యవధి వల్ల అప్‌గ్రేడ్ కొనుగోళ్లపై ప్రభావం లేదంటున్న పరిశ్రమ వర్గాలు. ⇒ యువ కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయంలో వారంటీ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.వారంటీ తీరకుండానే మార్చేస్తున్నారు... వాస్తవానికి వారంటీ అనేది కొనుగోళ్ల విషయంలో కీలకమైనప్పటికీ... యువ కస్టమర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వినూత్న ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విశేషం. పాత ప్రోడక్ట్ స్థానంలో కొత్తది కొనే వినియోగదారులపై కూడా సుదీర్ఘ వారంటీ పెద్దగా ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రాండ్లు ఏటా కొంగొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పేరుతో పాత ప్రోడక్టులను మార్చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. మరోపక్క, ఎక్కువ ఏళ్ల పాటు వారంటీ ఇవ్వడం విచిత్రం. అధిక వారంటీకి కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నా, వాస్తవ వాడకంలో పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది’ అని ఒక రిటైల్ స్టోర్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. -
Kitchen Tips: ఎంత తోమినా జిడ్డు వదలడం లేదా? ఈ చిట్కాలు పాటించండి
మార్కెట్లో దొరికే డిష్‌వాష్ బార్లు, లిక్విడ్లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధరకాల చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం... వెనిగర్‌లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి. గంజినీళ్లలో బేకింగ్ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తోమితే మురికితో పాటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి గిన్నెలు తోమితే జిడ్డు, వాసన వదిలి చక్కగా శుభ్రపడతాయి. -
ఆవిష్కరణలు.. అద్భుతం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో గురువారం ఫ్యూచర్ ఇన్వెంటర్స్ (భవిష్యత్ ఆవిష్కర్తలు) ఫెయిర్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 24 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఈ ఫెయిర్‌లో ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్ డిష్ వాషర్‌కు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు అనేది తమ నినాదం మాత్రమే కాదని, తమ విద్యాసంస్థ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలున్నాయని, సరైన మార్గదర్శకత్వం, సరైన వేదికలు లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగాలు చేయడం కాదు, ఉన్నత ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఈ నూతన ఆవిష్కరణలతో లభిస్తుందని చెప్పారు. కాగా ఈ ఫెయిర్‌లో మొత్తం ఐదు ఆవిష్కరణలకు బహుమతులు లభించాయి. సోలార్ హ్యాండ్ డిష్ వాషర్ వంట పాత్రలను శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడే నూతన సోలార్ హ్యాండ్ డిష్ వాషర్‌ను కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించారు. అన్ని వైపులా తిరిగేందుకు వీలుండే ఓ మోటార్‌కు స్క్రబ్బర్‌తో కూడిన ప్రత్యేక పరికరం అమర్చారు. సౌర విద్యుత్‌తో పాటు, బ్యాటరీతో కూడా పనిచేసేలా దీనిని తయారు చేశారు. అందుబాటులో ఉన్న సామగ్రితో తయారైన ఈ హ్యాండ్ డిష్ వాషర్‌కు ఫెయిర్‌లో మొదటి బహుమతి లభించింది. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే పాత్రలను శుభ్రం చేయడానికి పడుతున్న ఇబ్బందులను చూసి ఈ హ్యాండ్ డిష్ వాషర్‌ను రూపొందించామని విద్యార్థులు సాకేత్, హర్ష, ప్రణయ్, నవీన్, రక్షితలు పేర్కొన్నారు. పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లు రసాయనాలతో కూడిన శానిటరీ న్యాప్కిన్ లను వాడటంతో మహిళలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి పర్యావరణానికి కూడా హాని చేస్తున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు సహజ సిద్ధంగా లభించే పత్తి, అరటి ఫైబర్ (కాండంలో ఉండే నార), మొక్కజొన్న పిండి, వేప రసాన్ని వంటి వాటిని ఉపయోగించి న్యాప్కిన్లు తయారు చేశారు. వీటివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రావు. లీక్ ప్రూఫ్‌తో పాటు పర్యావరణానికి కూడా అనుకూలమైనవి. ఈ న్యాప్కిన్లు అందుబాటు ధరలో లభించే అవకాశాలు న్నాయని విద్యారి్థనులు అక్షయ, హన్సి క, మానసలు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణకు రెండో బహుమతి లభించింది. అగ్ని ప్రమాదాలపై ‘డ్రయిడ్’ అలర్ట్ అగ్ని ప్రమాదాలపై అలర్ట్ చేయడంతో పాటు, ప్రమా దం జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం లేకుండా నివారించే ‘కెలామెటీ కంట్రోల్ డ్రయిడ్ ’ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్) విద్యార్థులు ఆవిష్కరించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ డ్రయిడ్ అగ్నిప్రమాదం జరిగితే వెంటనే గుర్తించి., మొబైల్ టెక్నాలజీతో ఫైర్ స్టేషన్‌కు సమాచారాన్ని పంపుతుంది. మంటలు విస్తరించకుండా నీటితో ఆర్పివేస్తుంది. సెన్సార్ల సాయంతో అగ్నిప్రమాదంలో ఎవరైనా మనుషులు చిక్కుకున్న విషయాన్ని కూడా పసిగట్టి ఫైర్ స్టేషన్‌కు సమాచారం పంపుతుంది. ఈ ఆవిష్కరణకు తృతీయ బహుమతి వచ్చింది. విద్యార్థులు సూరజ్ గుప్తా, రిషిక్, కార్తికేయలు ఈ డ్రయిడ్ను ఆవిష్కరించారు. ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్.. కల్వర్టుల వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొనడం గానీ, పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొనడం వంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఇలాంటి కల్వర్టుల వద్ద ప్రమాదాల నివారణకు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఎక్స్లెంట్ స్టార్ హైసూ్కల్ విద్యార్థి రయాన్ ‘ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్’అనే నూతన పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. కల్వర్టుల వద్ద ఆర్.ఎఫ్ ట్రాన్స్‌మీటర్, వాహనంలో ఆర్.ఎఫ్.రిసీవర్లను అమర్చ డం ద్వారా వాహనం లైట్ ఆటోమెటిక్‌గా లోయర్ డిప్పర్లోకి మారుతుంది. దీంతో ఎదు రుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి రోడ్డు ప్రమాదం తప్పుతుంది. దీనికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టర్.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించే బాధ్యతను మహిళా సంఘాలే చూస్తున్నాయి. ఎక్కువ బరువున్న వంట పాత్రలను పొయ్యి పైనుంచి దించడం, అన్నం వార్చడం వంటి పనులు చేయలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో భారీ వంట పాత్రలోని అన్నాన్ని సులభంగా వార్చడానికి ఉపయోగపడే ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టు పరికరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపకల్పన చేశారు. దీన్ని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంది. వినీల, నందు, శ్రీచైత్ర, సుప్రియ రూపొందించిన ఈ పరికరానికి కూడా కన్సొలేషన్ బహుమతి లభించింది. -
ఇంటిప్స్
వంటపాత్రలు తోమేందుకు ఉపయోగించే సింక్, డిష్వాషర్ వంటి వాటి నుంచి దుర్వాసన వస్తుంటే, వాటిలో నీరు నిల్వలేకుండా చూడాలి. ఆ తర్వాత వాటిలో కాస్త వెనిగర్ పోసి వదిలేయాలి. కొద్దిసేపట్లోనే దుర్వాసన దూరమవుతుంది. పాతబడ్డ ఇళ్లలోని గదులు, టాయిలెట్స్‌లో తరచు దుర్వాసన వ్యాపిస్తుంటుంది. చెల్లాచెదురుగా పడిన చెత్త, ఆహార వ్యర్థాల వంటివి దుర్వాసనకు కారణమవుతుంటాయి. ముందుగా అలాంటివి గుర్తించి, వాటిని తొలగించాలి. ఆ తర్వాత గదుల మూలల్లో కలరా ఉండలు ఉంచాలి. బాత్రూమ్లో దుర్వాసనగా ఉంటే, గాఢమైన పరిమళం గల ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా తీసుకుని, కాటన్బాల్స్పై వేసి, వాటిని బాత్రూమ్ మూలల్లో ఉంచితే చాలు. దుర్వాసన పోతుంది.పాతబడిన పరుపులు దుర్వాసన వస్తుంటే, వాటిపై బేకింగ్‌సోడా చల్లి దాదాపు రెండు గంటలు అలాగే వదిలేయండి. తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. అవి తాజాగా మారుతాయి. -
ఇది మనకి పనికిరాదా?
వాయనం కొన్నాళ్లక్రితం మహిళలందరి నోటా ఓ వస్తువు గురించి తరచూ వినిపిస్తూ ఉండేది. ఆ వస్తువు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ వారి ఎదురు చూపులు ఫలించలేదు. అది మార్కెట్లోకి రాలేదు. వచ్చిన ఒకట్రెండు చోట్ల కూడా సక్సెస్ అవ్వలేదు. దాంతో భారతీయ మార్కెట్ నుంచి అది మాయమైంది. ఇంతకీ ఆ వస్తువేంటో తెలుసా... డిష్ వాషర్! గిన్నెలు కడుక్కోవడానికి తయారు చేసిన ఈ యంత్రం చాలా ఉపయోగకరమైనది. గిన్నెలన్నీ ఇందులో అమర్చి బటన్ నొక్కితే, అదే కడిగేస్తుంది. ఇది మనకూ లభిస్తే బోలెడంత శ్రమ తగ్గిపోతుందని భారతీయ మహిళలు ఆశించారు. కానీ మన దగ్గర డిష్ వాషర్లు పనికి రావని తేలిపోయింది. దానికి కారణాలు బోలెడు. దీని ఖరీదు చాలా ఎక్కువ కాబట్టి పట్టణాల్లోని ఉన్నత ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లాంటివాళ్లు మాత్రమే దీన్ని కొనగలుగుతారు. అయితే భారతీయ నగరాల్లో చాలాచోట్ల నీటి సమస్య ఉంది. డిష్ వాషరేమో చాలా నీరు తీసుకుంటుంది విదేశాల్లో తినే ఆహారంలో నూనెశాతం చాలా తక్కువ. కానీ మనం నూనె, మసాలాలు, నెయ్యి వంటివి ఎక్కువ వాడతాం. కాబట్టి జిడ్డు, మొండి మరకలు ఏర్పడతాయి. వాటిని వాషర్ పూర్తిగా పోగొట్టలేదు. ఎందుకంటే ఇది విదేశీయుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చేసింది కదా! ముందు మనం ఓసారి కడిగి, అప్పుడు వాషర్లో పెట్టాల్సి ఉంటుంది. అంతకంటే మామూలుగా కడుక్కోవడమే బెటర్ కదూ! విదేశీయులు పింగాణీ, ఫైబర్ వస్తువులు ఎక్కువ వాడతారు. అవి తేలిగ్గా శుభ్రమవుతాయి. కానీ మనం స్టీలు, సీమవెండిని ఎక్కువ వాడతాం. వాటిని కడగడం వాషర్‌కి కాస్త కష్టమే! కాస్త పెద్ద కుటుంబమైతే ఎక్కువ గిన్నెలుంటాయి. రెండు మూడు సార్లు కడుక్కోవాలి. మరి కరెంటు బిల్లు మామూలుగా వస్తుందా! పైగా ఎక్కువమంది ఉండే కుటుంబాల్లో పెద్ద పెద్ద గిన్నెల్లో వండుతారు. అవి వాషర్లో పట్టవు కూడాను! ఇన్ని సమస్యలు ఉండబట్టే మనకు డిష్ వాషర్లు అంతగా అందుబాటులోకి రాలేదు. మరి ఏ కంపెనీ అయినా మనల్ని తృప్తిపరిచే వాషర్లు తయారుచేస్తుందేమో చూద్దాం!