నిమ్మ ముక్కతో దుర్వాసన మాయం
ఇంటిప్స్
వంటగదిలో దుర్వాసన పోవాలంటే చిన్న గిన్నెలో నీళ్లు పోసి, నిమ్మముక్క వేసి మరిగించాలి. ఈ నీళ్లు చల్లారక స్టౌ, కిచెన్ గట్టు, అవెన్.. వంటివి తుడిచి, ఆ తర్వాత పొడిక్లాత్‌తో తుడవాలి. మరకలు ఉండవు. కిచెన్‌లో ఉపయోగించే స్పాంజ్‌లను బేకింగ్ సొడా కలిపిన నీటిలో రాత్రిపూట ఉంచి, మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరచాలి.
ఇలా చేస్తే బాక్టీరియా నశించి, చక్కగా శుభ్రపడతాయి.రోజూ రాత్రి వేళ అవెన్ లోపల తడి స్పాంజ్‌తో తుడిచి, 3 నిమిషాలు ఆన్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా వృద్ధి చెందదు. ఇలాగే, రాత్రిపూట కూరగాయలు కట్ చేసే బోర్డులు, కత్తులు శుభ్రపరిచి, పొడి క్లాత్‌తో తుడిచి ఉంచాలి. చంటి పిల్లలు పార్క్ లేదా బీచ్‌లలో ఇసుకలో ఆడుతుంటారు. అలా వదిలేస్తే మట్టి అంటుకుంటుందని తల్లులు వారిస్తుంటారు. బేబీ పౌడర్‌ని పిల్లల కాళ్లకు, చేతులకు రాసి, వదలాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము అంతగా అంటుకోకుండా ఉంటుంది.