
రిఫ్రిజిరేటర్‌లో దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్‌ని ఫ్రిజ్‌లో ఉంచాలి. చెడువాసనను బ్రెడ్ పీల్చుకుని ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుతుంది.ఏదైనా పదార్థాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌కి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపితే నూనెను ఎక్కువగా పీల్చుకోవు.
వండటం పూర్తయ్యాక కూరలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వెంటనే ఒక బంగాళా దుంపని ఉడికించి, చిదిమి గ్రేవీలో వేస్తే ఉప్పును పీల్చేస్తుంది. గ్రేవీ పలుచగా ఉన్నా కూడా ఉడికించిన బంగాళాదుంపను మాష్ చేసి వేయాలి.