'నాగచైతన్యతో గొడవలు'.. సీక్రెట్స్‌ బయటపెట్టేసిన సమంత! | Samantha Says She Will Compromise First When Fight With Naga Chaitanya | Sakshi
Sakshi News home page

చైతూతో గొడవలు.. సీక్రెట్స్‌ రివీల్‌ చేసిన సామ్!

Published Thu, Jun 3 2021 11:41 AM | Last Updated on Thu, Jun 3 2021 1:20 PM

Samantha Says She Will Compromise First When Fight With Naga Chaitanya - Sakshi

ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ వెబ్‌ సీరీస్‌లో నటిస్తుంది. త్వరలోనే ఈ సీరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా షరవేగంగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. రీసెంట్‌గా అభిమానులతో ముచ్చటించిన సమంత తన వ్యక్తిగత జీవితం గురించి పలు  ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. ప్రతి వ్యక్తికి తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరమని చెప్పిన సమంత..ముందు తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపగలమని చెబుతుంది. ఇక తన విషయానికి వస్తే నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమని, ఈ మూడు లక్షణాలు తనకు బాగా నచ్చుతాయి అని సమంత పేర్కొంది.


ప్రస్తుతం కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృడంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకే ప్రతి రోజు ఓ గంట సమయాన్ని వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలని దాని వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలమని పేర్కొంది. ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని.. అయితే ప్రతిసారి మొదట కాంప్రమైజ్‌ అయ్యేది మాత్రం తానే అని బయటపెట్టేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమా చేస్తోండగా, నాగ చైనత్య థ్యాంక్యూ, లాల్‌ సింగ్‌ చద్దా చిత్రాల్లో నటిస్తున్నారు. 

చదవండి : ఆ హీరోతో నటించాలనుంది : సమంత
ఆకాశంలోకి చూస్తూ బన్నీ పిల్లలకి ఏం చెబుతున్నారో చూడండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement